Political News

ఫ్యూచ‌ర్ కోల్పోతున్న వైసీపీ ‘యువత‌రం’

ఏ పార్టీకైనా యువ నాయ‌కులు, యువ‌తరం చాలా ముఖ్యం. ప్ర‌తి పార్టీ కూడా.. యూత్ వింగ్‌ను బ‌లోపేతం చేస్తుంది. ఎందుకంటే.. భ‌విష్య‌త్తులో పార్టీ మ‌నుగ‌డ‌.. రాజ‌కీయాల మ‌నుగ‌డ వారితోనే సాధ్య‌మ‌ని భావిస్తుంది. అందుకే ప్ర‌తిపార్టీలోనూ యూత్ వింగ్‌కు ప్రాధాన్యం ఉంటుంది. గ‌తంలో ఈ వింగ్‌ల‌ను బలంగా వినియోగించేవారు. టీడీపీలో ఇప్ప‌టికీ.. యూత్ వింగ్ చాలా బ‌లంగా ఉంది. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో యూత్ వింగ్ బ‌లంగా పోరాటం కూడా చేసింది.

అయితే.. వైసీపీలో ఉన్న యువ‌త‌రం మాత్రం అధికారంలో ఉన్న‌ప్పుడు.. రెచ్చిపోయారు. ఇప్పుడు ఫ‌లితం అనుభ‌విస్తున్నారు.. అన్న‌ట్టుగా ఉంది పరిస్థితి. శ్రీకాకుళం నుంచి అనంత‌పురం వ‌ర‌కు.. ఏ ఒక్క యువ నాయ‌కుడు కూడా.. ధైర్యంగా ముందుకు రాలేని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీనికి కార‌ణం.. పార్టీ అధినేత‌, అప్ప‌టి సీఎం జ‌గ‌న్ క‌ళ్ల‌లో ఆనందం కోసం.. అనేక అడ్డ‌దారులు తొక్కారు. దీంతో చ‌ట్ట విరుద్ధంగా కొంద‌రు.. సొంత అజెండాల‌తో మ‌రికొంద‌రు విజృంభించారు.

అయితే.. కాలం అన్ని వేళ‌లా ఒకే ర‌కంగా ఉండదు. ప్ర‌భుత్వం మారేస‌రికి వైసీపీ యువ నాయ‌కుల ఆగ‌డాలు వెలుగు చూస్తున్నాయి. కేసుల్లో చిక్కుకుని కొంద‌రు.. ఎక్క‌డ దొరుకుతామోన‌ని మ‌రికొంద‌రు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఫ‌లితంగా వారి ఫ్యూచ‌ర్ పాలిటిక్స్ పైనా ప్ర‌భావం ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

మ‌చ్చుకు కొంద‌రు!

భ‌ర‌త్‌: కుప్పం నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ భ‌ర‌త్‌.. చంద్ర‌బాబును ఓడిస్తాన‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. రాజకీయంగా ఆయ‌న ఎదుర్కొని ఉంటే వేరేగా ఉండేది. కానీ, దీనిని అరాచ‌కంగా ముందుకు తీసుకువెళ్లి.. టీడీపీ జెండా క‌నిపిస్తేనే చిందులు తొక్కారు. ఇప్పుడు కూట‌మి స‌ర్కారు వ‌చ్చాక‌.. క‌నిపించ‌కుండా పోయారు. ప్ర‌స్తుతం ఎక్క‌డున్నార‌నేది ప్ర‌శ్న‌గా మారింది.

దేవినేని అవినాష్‌: విజ‌య‌వాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయిన యువ నాయ‌కుడు. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. అంతా నాదే అన్న‌ట్టుగా చెల‌రేగారు. టీడీపీకార్యాల‌యంపై దాడి కేసులో చిక్కుకుని విల‌విల్లాడుతున్న ప‌రిస్తితి. బ‌య‌ట‌కు రాలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు.

మోహిత్‌రెడ్డి: చంద్ర‌గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన యువ నాయ‌కుడు. కానీ, ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ నాయ‌కుడు, ప్ర‌స్తుత ఎమ్మెల్యే పుల‌వ‌ర్తి నానిపై హ‌త్యాయ‌త్నం చేశార‌న్న అభియోగాలు ఉన్నాయి. దీంతో ఆయ‌న తెర‌చాటుగానే ఉండిపోయారు. దీనికి తోడు మ‌రిన్ని కేసులు కూడా ఉన్నాయ‌ని అంటున్నారు.

పినిపే శ్రీకాంత్‌: తండ్రి వార‌స‌త్వంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. అమ‌లాపురంలో రాజ‌కీయాలు చేయాల‌ని అనుకున్న నాయ‌కుడు. కానీ, సొంత స‌న్నిహితుడైన వ‌లంటీర్ దుర్గా ప్ర‌సాద్ హ‌త్య కేసులో చిక్కుకుని.. ప్ర‌స్తుతం జైలు పాల‌య్యారు. రాజ‌కీయంగా ఆయ‌న భ‌విత కూడా ప్ర‌శ్నార్థ‌కంగా మారిపోయింది.

This post was last modified on October 26, 2024 5:37 am

Share

Recent Posts

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

3 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

6 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

8 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

9 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

9 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

10 hours ago