వైసీపీ నేతల నుంచి తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని.. తనను లేపేస్తారన్న భయం కూడా వెంటా డుతోందని ఏపీ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇంటిపై కొందరు రెక్కీ నిర్వహించినట్టు కూడా ఆయన చెప్పారు. తన ఇంటి ఆనుపానులు తెలుసుకుని.. తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రాణ రక్షణకు ప్రభుత్వం మరింత భద్రత కల్పించాలన్నారు.
తనకు కూడా వ్యక్తిగత లైసెన్స్ తుపాకీ కోరుతూ.. ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టనున్నట్టు ఆనం వివరించారు. గత నెలలో తాను నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలోకి ఓ వ్యక్తి స్వామి మాల ధరించి వచ్చిన ట్టు తెలిపారు. ఆ వ్యక్తికి, వైసీపీకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలోనే తన ఇంట్లో ఏ మూల ఏముంది? ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయనే విషయాలను సదరు వ్యక్తి నిశితంగా పరిశీలించిన ట్టు అనుమానం ఉందన్నారు. దీంతో ఆ వ్యక్తిని గుర్తించి పోలీసులకు అప్పగించామన్నారు.
ఇదిలావుంటే.. నియోజకవర్గంలో మునుపెన్నడూ జరగని విధంగా అభివృద్ది పనులు జరుగుతున్నాయని .. వందల కోట్ల రూపాయలు తెచ్చి.. నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నామని.. ఆనం తెలిపారు. అయితే.. దీనిని చూసి వైసీపీ స్థానిక నాయకులు సహించలేక పోతున్నారని.. అందుకే తనను లేపేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆనం ఆరోపించారు. తాజాగా జరిగిన ఘటన దీనికి అద్దం పడుతుందన్నారు. తన ప్రత్యర్థుల నుంచి రక్షణ కోసం ఇకపై లైసెన్సుడ్ గన్ వాడాలని భావిస్తున్నట్లు మంత్రి ఆనం తెలిపారు.
This post was last modified on October 23, 2024 5:56 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…