Political News

బండి సంజ‌య్‌కు కేటీఆర్ లీగ‌ల్ నోటీసులు ఏం జ‌రిగింది?

తెలంగాణ బీజేపీ నాయ‌కుడు, కేంద్ర స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌కు.. బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి కేటీఆర్‌.. తాజాగా లీగ‌ల్ నోటీసులు పంపించారు. త‌న ప‌రువుకు భంగం క‌లిగించే వ్యాఖ్య‌లు చేశార‌ని, వారం రోజుల్లో త‌న‌కు బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆయ‌న కోరారు. లేని పక్షంలో ప‌రువు న‌ష్టం దావా వేయాల్సి ఉంటుంద‌ని నోటీసుల్లో హెచ్చ‌రించారు. ఈ మేర‌కు త‌న న్యాయ‌వాది ద్వారా కేటీఆర్‌.. బండికి లీగ‌ల్ నోటీసులు పంపించారు.

“ఈనెల 19న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. నేను డ్రగ్స్ తీసుకుంటానని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డానని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ పేరును కూడా ఆయన ప్రస్తావించారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు నా వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయి” అని నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

ఇటీవ‌ల బండి సంజ‌య్ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కేటీఆర్‌కు.. కొందరితో సంబంధాలు ఉన్నాయ‌ని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చేయ‌డంలోనూ సిద్ధ‌హ‌స్తుడ‌ని పేర్కొన్నారు. అక్కినేని కుటుంబం వివాదం జ‌రుగుతున్న క్ర‌మంలో ఈ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. అదే స‌మ‌యంలో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాల్లోనూ కేటీఆర్‌కు సంబంధాలు ఉన్నాయ‌ని మ‌రో సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. ఈ వ్యాఖ్య‌లు అప్ప‌ట్లోనే తీవ్ర ర‌గ‌డ‌కు దారి తీశాయి.

This post was last modified on October 23, 2024 5:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

22 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

58 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago