డొనాల్డ్ ట్రంప్… అమెరికా అధ్యక్షుడి సంచలన విజయం సాధించిన బిజినెస్ మన్ టర్న్ డ్ పొలిటీషియన్. అమెరికాకు అధ్యక్షులుగా ఎన్నికైన వారిలో ట్రంప్ పై పడ్డంత విమర్శలు దాదాపుగా ఎవరిపైనా పడి ఉండవేమో కూడా.
తాను తీసుకున్న ప్రతి నిర్ణయంపైనా ప్రజల్లో నిరసనలు వ్యక్తమయ్యేలా వ్యవహరించిన ట్రంప్… తనను తాను ఆకాశానికి ఎత్తేసుకోవడంలో అందరి కంటే ముందు ఉంటారన్న వాదనలకు ఇప్పుడు ఆయన నోట నుంచి వచ్చిన మాటలే నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పక తప్పదు.
తనను తాను హార్డ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అబివర్ణించుకున్న ట్రంప్… అమెరికా అధ్యక్షుడి హోదాలో తాను పడినంత కష్టం ఏ ఒక్క అధ్యక్షుడు కూడా పడి ఉండరని ట్రంప్ ఇప్పుడు తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. ఈ దిశగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.
అయినా తనను తాను హార్డ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అభివర్ణించుకున్న సందర్భంగా ఆయన ఏఏ వ్యాఖ్యలు చేశారన్న విషయానికి వస్తే… ‘‘ప్రజలంతా తనను హార్డ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు. అమెరికా చరిత్రలోనే ఏ అధ్యక్షుడూ చేయనంత పని నేను చేశా. నా గురించి, దేశ చరిత్ర గురించి తెలిసిన ప్రజలందరూ ఇదే విషయాన్ని చెబుతున్నారు. మూడున్నర సంవత్సరాల కాలంలో నేను దేశం కోసం ఎంతో చేశా. అయితే ఫేక్ వార్తలతో కొందరు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రతి రోజు తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు నేను పని చేస్తూనే ఉంటా.
కొన్ని నెలలుగా వైట్ హౌస్ లో ఉంటూనే… పలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నా. మిలిటరీ వ్యవస్థను పునర్నిర్మించాను. అయితే నా కృషిని తక్కువ చేస్తూ న్యూయార్క్ టైమ్స్ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. నకిలీ వార్తలు రాస్తూ రేటింగులు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు వార్తలు రాసిన మీడియా సంస్థలపై కేసులు వేస్తా. కొందరు మీడియా ప్రతినిధులు వ్యతిరేక ధోరణితో నన్ను ప్రశ్నిస్తుంటారు. అందుకే ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించడంలో అర్థం లేదు. తప్పుడు వార్తలు రాస్తున్న మీడియా కోసం సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు’’ అంటూ ట్రంప్ తనదైన శైలిలో చెప్పుకుంటూ పోయారు.
మొత్తంగా మీడియాలో తనపై వచ్చిన వార్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ గత శనివారం నుంచి మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పట్ల మీడియా ఎలాంటి వైఖరి అవలంబిస్తోంది? దానికి అనుగుణంగా తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాను? అన్న విషయాలను వెల్లడించిన ట్రంప్… తనను తాను హార్డ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అభివర్ణించుకోవడం నిజంగానే ఆశ్చర్యం రేకెత్తిస్తోందని చెప్పాలి.
This post was last modified on April 28, 2020 2:41 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…