Political News

అవినాష్ కోసం.. అన్నీ వ‌దులుకుంటున్నారా?

నిత్యం నిప్పులు చెరుగుతూ.. త‌న కంటిపైకునుకు లేకుండా చేస్తున్న సోద‌రి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల విష‌యంలో జ‌గ‌న్ నాలుగు కాదు..న‌ల‌భై అడుగులు వెన‌క్కి వేస్తున్నార‌న్న విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. ఆమెకు ఆస్తుల్లో పంప‌కాల‌ను.. చేసేయాల‌ని, ఆమె కోరుకున్న విధంగానే ఇచ్చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలిసింది. దీనికి సంబంధించిన బెంగ‌ళూరు వేదిక‌గా సెటిల్‌మెంట్ కూడా జ‌రిగిపోయింద‌ని అంటున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు.. జ‌గ‌న్ మొండిగా ఉన్న ఈ విష‌యంలో ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌.

ఈ విష‌యంపై రెండు ర‌కాల చ‌ర్చలు జ‌రుగుతున్నాయి. 1) పార్టీ కోసం జ‌గ‌న్ ఇలా దిగివ‌చ్చార‌ని కొంద‌రు చెబుతున్నారు. కానీ, జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిని గ‌మ‌నిస్తే.. ఆయ‌న పార్టీ విష‌యంలో ఇలా రాజీ ప‌డే ధోర‌ణి ఉన్న నాయ‌కుడు కాదు. పార్టీలో ఎంతో మంది వ‌చ్చారు. ఎంతో మంది పోయారు. మ‌రింత మంది పోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ విష‌యాలు ఆయ‌న‌కు తెలుసు. ఆయ‌న పెట్టుకున్న పార్టీ కాబ‌ట్టి.. ఆయ‌న‌కు సాధికార‌త ఉంటుంది. సో.. పార్టీ కోస‌మైతే.. ఇలా దిగివ‌చ్చే అవ‌కాశం లేద‌ని చాలామంది చెబుతున్నారు.

2) అవినాష్ కోసమ‌ని మెజారిటీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. సొంత బాబాయి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో క‌డ‌ప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఆది నుంచి కూడా జ‌గ‌న్ ఆయ‌నను వెనుకేసుకు వ‌స్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ లో కూడా ఇదే విష‌యాన్ని చెప్పుకొచ్చారు. త‌ప్పు చేయలేద‌ని తాను న‌మ్మినందుకే అవినాష్‌కు మ‌ద్ద‌తిచ్చాన‌ని చెప్పారు. కానీ, ఈ విష‌యాన్ని చెప్పాల్సిన సీబీఐ.. అవినాష్ కీల‌క నిందితుడ‌ని పేర్కొంటోంది.

ఇక‌, దీనినే ష‌ర్మిల స‌హా వివేకా కుమార్తె సునీత‌లు కూడా హైలెట్ చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో తీవ్ర ఆరోప‌ణలు కూడా చేశారు. క‌ట్ చేస్తే.. సీబీఐ కూడా ఈ కేసును త్వ‌ర‌గా పూర్తి చేసేందుకు సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో త‌మ్ముడిని కాపాడేందుకు.. జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌న్న‌ది మెజారిటీ రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. దీనిలో భాగంగానే ఆస్తుల పంప‌కం స‌హా.. ఏమైనా చేసేందుకు ఆయ‌న సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అవినాష్ అప్రూవ‌ర్‌గా మారితే.. ఇంకేమైనా జ‌రిగే అవ‌కాశం కూడా ఉంద‌న్న ఆలోచ‌న‌తోనే.. జ‌గ‌న్ ఇలా దిగివ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు. మ‌రి దీనివెనుక నిజానిజాలు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

This post was last modified on October 21, 2024 3:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పోటీ ఉన్నా ‘పొట్టేల్’ వైపే చూపు

ఈ శుక్రవారం ఆరు కొత్త సినిమాలు విడుదల కాబోతున్నాయంటే సగటు ప్రేక్షకులు ఆశ్చర్యపోతారేమో కానీ ఇది నిజం. చిన్న చిత్రాలకు…

15 mins ago

ప్రభాస్ చెప్పే సిరివెన్నెల కబుర్లు

ప్రభాస్ వ్యవహారం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలామంది స్టార్ల లాగా బయట, సోషల్ మీడియాలో ప్రచార హడావుడి ఉండదు. సినిమాలు…

1 hour ago

ఇప్పుడు అనావృష్టి.. తర్వాత అతివృష్టి

టాలీవుడ్ నిర్మాతల సినిమాల రిలీజ్ ప్లానింగ్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. కొంచెం క్రేజున్న సీజన్ వచ్చిందంటే చాలు వేలం…

2 hours ago

మల్లారెడ్డి తాత వచ్చాడే..

తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సందడే…

2 hours ago

35 ఏళ్ళ తర్వాత ‘మగాడు’గా రాజశేఖర్

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఆ మధ్య నితిన్ ఎక్స్ ట్రాడినరి మ్యాన్ లో కనిపించాక మళ్ళీ తెరమీద దర్శనం ఇవ్వలేదు.…

3 hours ago

కిచ్చా సుదీప్ కుమార్తె ఆవేదన

సెలబ్రెటీలు ఏం చేసినా వార్తే. వాళ్ల ఇళ్లలో ఏం జరిగినా వార్తే. వాళ్ల పట్ల జనాల్లో ఉండే క్యూరియాసిటీని క్యాష్…

4 hours ago