అన్నా చెల్లెళ్లు కలిసి పోయారని.. ఆస్తుల పంపకాలకు సంబంధించిన వివాదాలను కొలిక్కి తెచ్చుకుంటున్నారని.. వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విషయంలో వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.తరచుగా బెంగళూరుకు వెళ్తున్న జగన్.. ఈ విషయంపై ఎక్కువగానే దృష్టి పెట్టినట్టు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఆస్తుల వివాదం సమసిపోయే దశకు చేరుకుందని అంటున్నారు.
ఇక, షర్మిల వ్యవహార శైలి కూడా గత రెండు మాసాలుగా మారిపోయింది. తరచుగా జగన్‌ను, వైసీపీని టార్గెట్ చేస్తూ వచ్చిన షర్మిల.. రెండు మాసాలుగా మౌనంగా ఉంటున్నారు. ఎక్కడా జగన్‌ను కానీ, వైసీపీని కానీ ఆమె టార్గెట్ చేయకపోగా.. కూటమి సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయంగా ఆమెకు ఉండే స్వేచ్ఛను ఎవరూ కాదనరు. కానీ, జగన్ విషయంలో ఆమె కనుక యూటర్న్ తీసుకుని.. రేపు సమర్థించే ప్రయత్నం చేస్తే.. మాత్రం ఆమె వ్యక్తిగతంగా ఇమేజ్ ను కోల్పోతారనేది చర్చగా మారింది.
ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు.. జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బాబాయి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుతో పాటు.. తనను కూడా తీవ్రంగా మోసం చేశారంటూ.. వాడుకుని వదిలేశారంటూ.. ఆమె కన్నీరు కూడా పెట్టుకున్నారు. ప్రజలు దీనిని నమ్మారు. వైసీపీ ఓటమిలో షర్మిల చేసిన వ్యాఖ్యలు, పెట్టుకున్న కన్నీరు కూడా.. ఫలించాయనే చర్చ ఉంది. ఇలాంటి సమయంలో అనూహ్యంగా.. షర్మిల ఇప్పుడు ఆస్తుల పంపకాలకు సంబంధించి యూటర్న్ తీసుకుంటే.. రేపు రాజకీయంగా ఆమె ఫేడ్ అవుట్ అవుతారన్నది విశ్లేషకుల మాట.
కేవలం ఆస్తుల కోసమే షర్మిల రాజకీయాలు చేశారని.. జగన్‌ను విమర్శించారన్న చర్చ బలపడితే.. ఇక, ఆమెకు సుదీర్ఘకాలంలో పొలిటికల్ ఎఫెక్ట్ పడే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. తెలంగాణలో విఫలమైన ఆమె.. ఏపీలో అడుగు పెట్టిన దరిమిలా.. ప్రజలు ఆమె మాటను విశ్వసించారు. జగన్ పాలన, తనకు అన్యాయం చేశారని, వివేకా హత్య నిందితులను వెనుకేసుకు వస్తున్నారన్న వాదనను కూడా నమ్మి ఆమెను ఫాలో అయ్యారు. జగన్‌కు దూరమయ్యారు. ఇప్పుడు అవన్నీ.. కేవలం ఆస్తుల కోసమే షర్మిల చేసిన వ్యాఖ్యలుగా బలమైన ముద్ర పడితే.. మాత్రం వ్యక్తిగతంగా షర్మిలకే ఇబ్బందులని పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on October 21, 2024 5:59 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…