అవును.. రెండే రెండు గంటల్లో 21 కిలోమీటర్ల దూరాన్ని పరిగెత్తటం కొందరు క్రీడాకారులకు.. మారథాన్ లో పాల్గొనే వారికి పెద్ద విషయం కాదు. కానీ.. తీరిక లేని రాజకీయాల్లో తలమునకలయ్యే రాజకీయ అధినేతలు.. రాష్ట్రానికి అన్నీ తామై అన్నట్లు వ్యవహరించే ముఖ్యమంత్రికి ఇదే మాత్రం సులువు కాదనే చెప్పాలి.అయితే.. ఆ భావన తప్పన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించారు జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. తాజాగా తమ రాష్ట్రంలో జరిగిన తొలి అంతర్జాతీయ మారథాన్ లో 21 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో పూర్తి చేసిన ఆయన సమ్ థింగ్ స్పెషల్ గా నిలిచారు.
54 ఏళ్ల ఒమర్ అబ్దుల్లా ఫిట్ నెస్ చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వయసులో ఇంత ఫిట్ గా ఉండటం గ్రేట్ అంటున్నారు. రాజకీయ నేతలు చూసేందుకు అంతా బాగున్నట్లు అనిపించినా.. ఏ చిన్న తేడా వచ్చినా అనారోగ్యం వారిని కమ్మేయటం.. లేదంటే.. అప్పటికే బోలెడన్ని ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తుంటాయి. అందుకు భిన్నంగా ఒమర్ అబ్దుల్లా మాత్రం తన ఫిట్ నెస్ లెవల్ చూపించి అందరిని విస్మయానికి గురి చేశారు.
ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. జమ్ముకశ్మీర్ లో నిర్వహించిన ఈ తొలి అంతర్జాతీయ మారథాన్ లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి 2 వేల మందికి పైగా క్రీడాకారులు హాజరు కావటం. ఇందులో పాల్గొనటం కోసం ఐరోపా.. ఆఫ్రికా దేశాల నుంచి కూడా వచ్చారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ మారథాన్ ను ప్రారంభించారు. ఈ మారథాన్ గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి ఒమర్.. ప్రపంచంలో అత్యుత్తమ కార్యక్రమాల్లో ఇదొకటిగా మారుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
తన జీవితంలో 13 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాన్ని తానెప్పుడూ పరిగెత్తలేదని.. అది కూడా ఒక్కసారి మాత్రమే పరిగెత్తినట్లు చెప్పిన ఆయన.. మొదటిసారి 2 గంటల వ్యవధిలో 21 కిలోమీటర్లు పరిగెత్తటం గ్రేట్ అని చెప్పాలి. ఇక.. ఈ మారథాన్ లో విజేతలుగా షేర్ సింగ్.. తామసీ సింగ్ లు నిలిచారు. 18-38 ఏజ్ గ్రూప్ లో 42 కిలోమీటర్ల దూరాన్ని 2.23 గంటల్లో పూర్తి చేసిన షేర్ సింగ్ పురుషుల్లో మొదటిస్థానంలో నిలవగా.. 3.03 గంటల వ్యవధిలో తామసీ సింగ్ లక్ష్యాన్ని పూర్తి చేసి మహిళల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. మొత్తంగా చూస్తే.. ఒమర్ ఫిట్ నెస్ లెవల్స్ చూసిన తర్వాత దేశంలో ఇంతటి ఫిట్ నెస్ ఉన్న ఏకైక ముఖ్యమంత్రిగా ఒమర్ నిలుస్తారని చెప్పక తప్పదు.
This post was last modified on October 21, 2024 10:21 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…