ఏపీ రాజకీయాల్లో కూటమి సర్కారు కొలువు దీరిన తర్వాత.. పెను మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వైసీపీ సర్కారు కుప్పకూలి కూటమి ప్రభుత్వం కొలుదీరింది. ఇక, నిన్న మొన్నటి వరకు కూడా మౌనంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ క్రమంగా పుంజుకోవడం ప్రారంభించారు. ఎన్నికల పరాభవం తాలూకు అనుభవాలను ఆయన ఒక్కొక్కటిగా పక్కన పెడుతున్నారు. గత నాలుగు రోజులుగా వైసీపీ నేతలతోనూ భేటీ నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు చేస్తూ.. తాము కూడా అబద్ధాలు చెప్పి ఉంటే.. మరోసారిఅధికారంలోకి ఖచ్చితంగా వచ్చి ఉండేవారమని అన్నారు. అంతేకాదు.. అబద్ధాలు చెప్పుకొని అధికారం దక్కించుకునే కంటే కూడా.. ప్రతిపక్షంలో ఉండడమే మేలు అన్నట్టుగా వ్యాఖ్యానించారు వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులను కూడా ఆయన ప్రస్తావించారు. అరాచాలకు అడ్డాగా మారిపోయింద ని.. టీడీపీ నాయకులు వాటాలు వేసుకుని మరీ దోచుకుంటున్నారని అన్నారు.
ఈ నేపథ్యంలో జగన్.. తన హయాంలో జరిగిన నేరాలు, ఘోరాలను మరిచిపోయినట్టు ఉన్నారనేది పరిశీ లకుల మాట. ఎందుకంటే.. ఆయన పాలనలో సోషల్ మీడియా విజృంభణలు, విపరీత వ్యాఖ్యలు, పెద్ద ఎత్తున దాడులు వంటివి అందరికీ తెలిసిందే. సాక్షాత్తూ టీడీపీ కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీనికి కారణం ఎవరనేది పక్కన పెడితే.. విషయం తెలిసి కూడా.. జగన్ దీనిని ఖండించకపోవడం.. చోద్యం చూడడం విమర్శలకు దారితీసింది.
టీడీపీ నేత పట్టాభి.. జగన్‌ను దారుణ వ్యాఖ్య చేసి ఉండొచ్చు. దానికి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటే సరిపోయేది. దీనిని అడ్డు పెట్టుకుని టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం.. సరికాదు. ఇక, నిండు అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబాన్ని దూషించారు. ఆయన సతీమణిని దారుణంగా వ్యాఖ్యా నించారు. ఇవన్నీ.. చంద్రబాబుకు కంటనీరు తెప్పించాయి. వైసీపీ నేతలపై కసిని, అసహనాన్ని కూడా తెప్పించాయి. ఇదిలావుంటే.. టీడీపీ నేతలు.. అచ్చెన్నాయుడు(ప్రస్తుత మంత్రి), ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర, సహా చంద్రబాబును కూడా కేసులతో వేధించారు. జైళ్లలో పెట్టి ఆనందించారు.
కట్ చేస్తే.. ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. గతంలో తనకు, తన పార్టీ నాయకులకు జరిగిన అవమానాలు, అన్యాయాలను ఆయన మనసులో పెట్టుకుని కసి తీర్చుకోవాలంటే ఎంతసేపు.? చంద్రబా బే కనుక జగన్ మాదిరిగా నేతలను రెచ్చగొట్టి వ్యవహరిస్తే.. మాత్రం అడ్డు ఎవరు చెప్పగలరు.? నిజానికి చంద్రబాబుపై పార్టీలో నాయకులు, మంత్రుల నుంచి ఒత్తిడి ఉంది. వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవా లని తక్షణం కఠినంగా వ్యవహరించాలని కూడా వారు కోరుతున్నారు.
అయినా.. చంద్రబాబు తన పూర్వ పంథాను వీడడం లేదు. జగన్‌లా వ్యవహరించడమూ లేదు. తనను తానుగానే ప్రొజెక్టు చేస్తున్నారు. అందుకే.. చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం, నిబంధనల ప్రకారమే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఆమేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి.. పైకి ఎన్ని వ్యాఖ్యలు చేసినా..చంద్రబాబు మాత్రం జగన్ మాదిరిగా విర్రవీగే పరిస్థితి అయితేలేదు. బ్రాండ్ బాబు
అనే మాటకు ఆయన కట్టుబడి ఉన్నారనే అనిపిస్తుంది.
This post was last modified on October 20, 2024 6:33 pm
'ప్రేమ కోసమే వలలో పడినె పాపం పసివాడు' అంటూ అప్పటి పాతాళ భైరవి సూపర్ హిట్ పాట.. ఇప్పటి తరానికి…
ఇంకో వారం రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ కోసం తెలుగులోనే కాదు తమిళంలో కూడా చెప్పుకోదగ్గ బజ్ కనిపిస్తోంది.…
గత ఏడాది భారతీయుడు 2 రిలీజైనప్పుడు దర్శకుడు శంకర్ కెరీర్ లోనే మొదటిసారి విపరీతమైన ట్రోలింగ్ కు గురయ్యారు. ఐ,…
ఏదో క్యాస్టింగ్ పెద్దగా లేని సినిమా ల్యాబ్ లో మగ్గుతుందంటే సహజం అనుకోవచ్చు. కానీ పేరున్న హీరో, ఇమేజ్ ఉన్న…
అవును.. ఇప్పుడు చెప్పే ఉదంతాన్ని చదివినంతనే.. యమలోకంతో కనెక్షన్ ఉండే చాలా సినిమాలు ఇట్టే గుర్తుకు వచ్చేస్తాయి. నూకలు తీరకుండానే…
దేశంలో వందల సంఖ్యలో పార్టీలు ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ, ఏ పార్టీ చేయని పని..…