వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. పక్కా వ్యూహంతోనే అడుగులు ముందుకు వేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలతో పాటు సోసల్ మీడియా విషయంలోనూ ఆయన చాలాదూకుడుగా ఉండాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఎన్నికలు అయిపోయి.. నాలుగు మాసాలు గడిచాయి. ఈ నాలుగు మాసాల కాలంలో పార్టీ నేతలు ఎలా ఉన్నా..ఇప్పటి నుంచి మాత్రం పక్కాగా ఉండాలని జగన్ సూచించారు. జమిలి ఎన్నికలు వస్తే..ఎప్పుడైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
అయితే.. మరీ ముఖ్యంగా, ప్రజలే కాకుండా.. సోషల్ మీడియాపై కన్నేయాలని పార్టీ కేడర్ సహా నాయకులకు సూచించారు. కేవలం మీడియా మీటింగులు, సభలు సమావేశాలే కాకుండా.. ప్రజల మధ్య ఉండడం తో పాటు సోషల్ మీడియాతోనూ సమరం చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ పరంగా కూడా సోషల్ మీడియాను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయనున్నట్టు చెబుతున్నారు. ప్రధాన మీడియాను బలంగా ఎదుర్కొనే దిశగా అడుగులు వేస్తున్నారు.
అంటే.. మొత్తంగా వచ్చే నెలల్లో వైసీపీ పరంగా దూకుడు పెరగనుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో నూ మార్పులు రానున్నాయన్నది సుస్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియాలో పనిచే సేందుకు పెద్ద ఎత్తున సొంత మీడియా నుంచి ఉద్యోగులను తరలిస్తున్నారు. ఇప్పుడు బయట నుంచి కూడా ఐటీ నిపుణులను తీసుకునే ఆలోచన చేస్తున్నారు. దీంతో కౌంటర్‌కు ప్రతి కౌంటర్.. ఇచ్చేలా బలమైన వ్యూహంతో ముందుకు సాగాలన్నది జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది.
నిజానికి వైసీపీ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత కూడా.. కొన్ని మీడియా సంస్థలు నేటికీ.. జగన్ ప్రభుత్వంలో ఇలా జరిగింది.. అలా జరిగింది.. అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఇది వైసీపీకి మరింత మైనస్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ పరంగా బలోపేతం చేయడం ఎలా ఉన్నా ఆయా మీడియా సంస్థలను బలంగా ఎదుర్కొనాలన్నది జగన్ వ్యూహంగా ఉంది. ఈ క్రమంలోనే సోషల్ సమరాన్ని తీవ్రతరం చేయాలన్నది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి ఏమేరకు దూకుడు చూపిస్తారో చూడాలి.
This post was last modified on October 19, 2024 9:37 am
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…
తెలుగులో ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. పాన్ వరల్డ్ హిట్…