దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు రానున్న దరిమిలా.. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగా ఆయన పక్కా ప్లాన్‌తో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది జూన్‌లో ఏర్పడిన ప్రబుత్వానికి ఐదేళ్ల గడువు ఉంటుంది. అయితే.. జమిలి నేపథ్యంలో రెండున్నరేళ్లకు మించి సమయం ఉండే అవకాశం లేదు. పైగా జమిలికి కేంద్రం కూడా రెడీ అయిపోయింది. ఎన్డీయే కూటమి పక్షాలను కూడా ఒప్పించేసింది.
ఒక్క బిహార్ తప్ప.. ఇతర రాష్ట్రాల్లోని ఎన్డీయే పక్షాలన్నీ కూడా జమిలికి రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు తాజాగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో నిర్వహించిన సమావేశంలో “మనకు సమయం తగ్గిపోయింది. ఈ విషయం మీకు కూడా తెలుసు” అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. దీనికి తగినట్టుగా ప్లాన్ చేసుకుని తమ్ముళ్లు ముందుకు సాగాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే.. టార్గెట్ 2029 కాదని.. 2026 అని చంద్రబాబు చెప్పకనే చెప్పారు.
దీనికి ఉన్న సమయంలో కేవలం 16-18 నెలలు మాత్రమే. ఈ స్వల్పకాలంలోనే ఇచ్చిన హామీలను అమ లు చేసే దిశగా ప్రబుత్వం అడుగులు వేయనుందని చంద్రబాబు తెలిపారు. అయితే.. ఆయన పక్కాగా డేట్ చెప్పకపోయినా.. స్వల్పం కాలమని.. ఎవరూ 2029 వరకు వేచి చూడొద్దని మాత్రం చెప్పుకొని రావడం ద్వారా జమిలికి రెడీ అవుతున్నామన్న సంకేతాలు ఇచ్చినట్టు అయింది. ముఖ్యంగా ఉపాధి కల్పన, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.
అదేవిధంగా పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేయించేందుకు మనకు ఉన్న సమ యంలో స్వల్పమని, ఈ విషయంలో అందరూ సహకరించాలని కూడా ఆయన సూచించారు. అంతేకాదు.. 100 రోజుల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించడం ద్వారా.. సాధించిన ప్రగతికి మార్కులు వేయించాలని సూచించారు. సో.. దీనిని బట్టి దేశవ్యాప్తంగా ఒకే సారి జరిగే ఎన్నికలకు అందరూ రెడీ కావాలన్న సంకేతాలు కూడా ఇచ్చారు. మొత్తంగా 2026లోనే వచ్చే అవకాశం ఉన్న జమిలికి చంద్రబాబు అందరినీ రెడీ చేస్తున్నారన్న సంకేతాలు వెలువడ్డాయి. మరి తమ్ముళ్లు ఏమేరకు ప్రిపేర్ అవుతారో చూడాలి.
This post was last modified on October 19, 2024 9:20 am
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…
బిలియనీర్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు క్రియేట్ చేసిన కార్పొరేట్ సంచలనం…
వైసీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా వెలుగు చూసిన…
అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ తన అల్లరి చేష్టలతో ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సమీపంలోనే జరగబోయే మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను ముందుగానే…