Movie Reviews

సమీక్ష – డబుల్ ఇస్మార్ట్

ఎనర్జిటిక్ స్టార్ రామ్, దర్శకుడు పూరి జగన్నాధ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత బ్లాక్ బస్టరో అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ కూడా అంత సులభంగా మర్చిపోలేదు. అలాంటి మాస్ బొమ్మకు కొనసాగింపంటే సహజంగానే రెట్టింపు ఆసక్తి నెలకొంటుంది. డబుల్ ఇస్మార్ట్ ప్రకటన స్టేజి నుంచే క్రేజ్ సంపాదించుకోవడంతో లైగర్ దెబ్బ నుంచి పూరి పూర్తిగా కోలుకునేలా మరో హిట్టు పడుతుందననే నమ్మకం ఫ్యాన్స్ లో వ్యక్తమవుతూ వచ్చింది. మరి అది నిజమయ్యేలా ఈ కాంబోమేజిక్ చేసిందో లేదో చూసేద్దాం

కథ

అమ్మను ప్రాణంగా ప్రేమించే శంకర్ (రామ్) తన చిన్నప్పుడే ఆమె చనిపోవడంతో పాతబస్తీలో అనాథలా పెరుగుతాడు. తొలిచూపులోనే జన్నత్ (కావ్య థాపర్) ని ఇష్టపడి ప్రేమిస్తాడు. ఇంటర్నేషనల్ డాన్ బిగ్ బుల్ (సంజయ్ దత్) కు ఒక ఆరోగ్య సమస్య రావడంతో తన మెదడులోని మెమరీ ఎక్కించేందుకు ఒక శరీరం ఆవరసమవుతుంది. అది శంకర్ బాడీనేనని డాక్టర్ చెప్పడంతో వెతికి పట్టుకుని ఆ పని పూర్తి చేస్తాడు. బిగ్ బుల్ కోసం వెతుకుతున్న రా ఆఫీసర్ (షియాజీ షిండే) ముందు ఇప్పుడు ఇద్దరినీ పట్టుకునే బాధ్యత తల మీద పడుతుంది. రామ్ ఇదంతా ఎందుకు చేశాడు, బ్రెయిన్ లో ఒకే చిప్పు కలిగిన శంకర్, బిగ్ బుల్ ప్రయాణమే అసలు స్టోరీ.

విశ్లేషణ

సీక్వెల్ అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తేనే విజయం దక్కుతుంది. బాహుబలి, కెజిఎఫ్ కన్నా ఉదాహరణ అక్కర్లేదు. ఎందుకంటే మొదటి భాగం చూసి అంచనాలను పెంచేసుకున్న ప్రేక్షకులను మెప్పించడం అంత సులభం కాదు. బ్రాండ్ అడ్డం పెట్టుకుని బిజినెస్ చేయొచ్చేమో కానీ థియేటర్లకు జనాన్ని రప్పించలేం. దర్శకుడు పూరి జగన్నాథ్ పనితనం ఇండస్ట్రీకి ఎంత గొప్ప శిష్యులను ఇచ్చిందో చూశాం. ఒకప్పుడు పోకిరి లాంటి ట్రెండ్ సెట్టర్స్ ని తీసిన క్రియేటివ్ మాస్ మాస్టర్ గా ఇప్పటికీ ఆయనని గౌరవించే వాళ్లకు కొదవే లేదు. అందుకే లైగర్ తర్వాత కూడా డబుల్ ఇస్మార్ట్ కు మంచి రేటొచ్చింది.

ఇస్మార్ట్ శంకర్ కి కొనసాగింపు అనుకున్నప్పుడు కేవలం అందులో పాయింట్ నే తిప్పి రాసుకోవడం దగ్గరే పూరి లయ తప్పారు. ఒక బస్తీ కుర్రాడిగా రామ్ ని ఎస్టాబ్లిష్ చేశాక సంజయ్ దత్ లాంటి టెర్రిఫిక్ విలన్ ని ఏ స్థాయిలో ఎదురుకుంటాడోననే కాంఫ్లిక్ట్ ని సరైన రీతిలో డిజైన్ చేసుకోకపోవడంతో ఏ దశలోనూ డబుల్ ఇస్మార్ట్ ఎంగేజ్ చేసే విధంగా సాగదు. టాలీవుడ్ లోనే బెస్ట్ ట్విస్టులలో ఒకటిగా చెప్పుకునే కృష్ణమనోహర్ ఐపీఎస్ ఇచ్చిన పూరినే ఇందులో హీరోయిన్ తో సహా కొన్ని పాత్రలకు పెట్టిన తక్కువ స్థాయి మలుపులు చూస్తే నిజంగా ఇవి ఆయనే రాసుకున్నాడా అనే అనుమానం వస్తే తప్పు మనది కాదు. అంత బేసిక్ స్థాయిలో కథా కథనాలు సాగడం విచారకరం.

ఎలాంటి సబ్జెక్టైనా కొన్ని టెంప్లేట్స్ ని పూరి వదలడు. మదర్ సెంటిమెంట్, రా అధికారులు, సూటు బూటు వేసుకున్న ఫారిన్ డాన్లు, కరుకుదనం నింపుకున్న రౌడీ అమ్మాయిలు ఇందులోనూ అన్నీ రిపీట్ చేశాడు. కానీ ఏదీ క్లిక్ అవ్వలేదు. ఝాన్సీని తొలుత శంకర్ తల్లిగా చూపించి తర్వాత ఆ క్యారెక్టర్ లేదు కాబట్టి ప్రీ క్లైమాక్స్ కు ముందు బలవంతంగా ప్రగతిని తీసుకురావడం ఎంత మాత్రం నప్పలేదు సరికదా విసుగెత్తేలా ఉంటుంది. చైనా డాన్లనే వణికించే బిగ్ బుల్ ఆఫ్ట్రాల్ హైదరాబాదీ కుర్రాడిని పట్టుకోవడం కోసం అగచాట్లు పడటం డైరెక్షన్ టీమ్ మీద జాలి కలిగించేలా చేస్తుంది. పోనీ పట్టుకున్నాకైనా డ్రామా పరుగులు పెడుతుందా అంటే అది ఇంకో వెరైటీ కహాని.

ఆడియన్స్ ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడం డబుల్ ఇస్మార్ట్ లోని ప్రధాన సమస్య. లాజిక్స్ లేకపోవడం, నమ్మకశ్యం కానీ రీతిలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉండటం ఇలాంటి కమర్షియల్ సినిమాల్లో సహజమే. అలాని మరీ నేలవిడిచి సాముచేయడం కరెక్ట్ కాదు. ఇస్మార్ట్ శంకర్ లో కూడా కొన్ని లోపాలున్నాయి. అయినా సరే మణిశర్మ కిరాక్ అనిపించే పాటలు, ఆ టైంలో వెరైటీగా అనిపించిన బ్యాక్ డ్రాప్, ఊర మాస్ ఎలిమెంట్స్ జనాలను మెప్పించాయి. బలహీనతలను కాపాడాయి. ఇప్పుడీ పార్ట్ 2లో అవే శాపంగా మారాయి. దేని మీద పూరి ఫోకస్ పెట్టినట్టు అనిపించదు. అప్పటికప్పుడు సెట్లో సన్నివేశాలు రాసుకుని తీశారా అనిపించేలా కొన్ని మరీ తీసికట్టుగా ఉన్నాయి.

కాలం చెల్లిన ఆలోచనలు ఇప్పుడూ వర్కౌట్ అవుతాయని పూరి అనుకోవడానికి నిదర్శనం బోకాగా అలీతో చేయించిన చీప్ కామెడీ. కేవలం ఒక పావుగంట నిడివి పెంచడానికి తప్ప ఎందుకూ ఉపయోగపడని ఈ క్యారెక్టర్ చిరాకుని పీక్స్ ని తీసుకెళ్తుంది. ఇలాంటి లోపాలు క్రమం తప్పకుండా వస్తూ సాగతీతకు కారణమయ్యాయి. హీరో విలన్ సంఘర్షణ కోసం ఎదురు చూస్తున్న టైంలో రామ్, సంజయ్ దత్ ఇద్దరినీ ఒకే షేడ్ లో చూపించి అపరిచితుడు ట్విస్టుని కొత్త ప్రెజెంట్ చేయాలని చూసిన పూరి, ఆలోచన వరకు బాగానే అనుకున్నారు కానీ స్క్రీన్ మీద ఆవిష్కరించే తీరులో మాత్రం నవ్యతని చూపించలేక చేతులెత్తేశారు. ఫలితంగా ల్యాగ్ పెరిగింది.

దర్శకులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకపోతే డబుల్ దెబ్బలు తప్పవు. వన్స్ అపాన్ ఏ టైంలో మనం ఎలాంటి క్లాసిక్స్ ఇచ్చామనేది జనాలు మర్చిపోవడం మొదలుపెడతారు. చాలామంది నిన్నటి తరం టాప్ డైరెక్టర్స్ త్వరగా రిటైర్ అయిపోవడానికి కారణం ఇదే. కానీ పూరి జగన్నాధ్ కి ఇంకా బోలెడు వయసు, టాలెంట్ ఉంది. వాటిని సద్వినియోగపరుచుకునే దిశగా వెళ్తే మునుపటి అద్భుతాలు మళ్ళీ చూడొచ్చు. లేదూ నా ఫార్ములా నుంచి బయటికి రాను, పదే పదే ఇవే తీస్తూ ఉంటానంటే మాత్రం కష్టం. విజయేంద్ర ప్రసాద్ గారు అడిగినట్టు ముందే కథ చెప్పేసి సలహాలు తీసుకుని ఉంటే బాగుండేదని సగటు సినీ ప్రియులు అనుకోవడంలో ఆశ్చర్యం లేదు.

నటీనటులు

రామ్ మరోసారి ఇస్మార్ట్ శంకర్ గా తన ఎనర్జీని తెరమీద పూర్తిగా ఆవిష్కరించాడు. కొత్తగా అనిపించకపోయినా పెర్ఫార్మన్స్ పరంగా ఎలాంటి వంక పెట్టే అవకాశం ఇవ్వలేదు. బిగ్ బుల్ షేడ్ కూడా బాగానే పండించాడు. కావ్య థాపర్ కు ఇచ్చిన పాత్రకు, ఆమె చేసిన అందాల ఆరబోతకు ఏ మాత్రం సంబంధం లేకుండా చూపించిన తీరుకి వీరతాడు వేయాల్సిందే. సంజయ్ దత్ విగ్రహం బాగుంది కానీ యాక్టింగ్ పరంగా నిగ్రహం తక్కువే. ఝాన్సీ ఒక్కరే హుందాగా కనిపించారు. కాకపోతే కాసేపే. అలీ నవ్వించబోయి నవ్వులపాలయ్యాడు. షియాజీ షిండే కొట్టిన పిండే మళ్ళీ కొట్టారు. బనిజేకి బిల్డప్ ఎక్కువయ్యింది. గెటప్ శీను, ఉత్తేజ్, ప్రగతిలు ఉపయోగపడింది లేదు.

సాంకేతిక వర్గం

మెలోడీ బ్రహ్మ మణిశర్మ మాయాజాలం ఈసారి అంతగా పనిచేయలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నిపుణుడైన ఆయన నుంచి పూరి బెస్ట్ రాబట్టుకోలేకపోయారు. కొన్నిచోట్ల మెప్పించింది అంతే. రెండు పాటలు ఓకే అనిపించినా మొత్తంగా ఆడియో పరంగా చూసుకుంటే నిరాశే మిగులుతుంది. శ్యామ్ కె నాయుడు – గియాన్ని సంయుక్త ఛాయాగ్రహణం మార్కులు దక్కించుకుంది కానీ కంటెంట్ లో ఉన్న వీక్ నెస్ వల్ల ప్రత్యేకంగా అనిపించదు. యాక్షన్ బ్లాక్స్ బాగా చూపించారు. పూరి మాటల తూటాలు అంతగా పేలలేదు. కార్తీక శ్రీనివాస ఎడిటింగ్ లో కత్తెరకు పని చెప్పాల్సిన అంశాలు చాలానే ఉన్న వదిలేశారు. నిర్మాణ విలువలు పరంగా బాగానే ఖర్చు పెట్టారు

ప్లస్ పాయింట్స్

రామ్ పెర్ఫార్మన్స్
ఒక మాస్ సాంగ్
కొన్ని ఫైట్స్

మైనస్ పాయింట్స్

లోపించిన క్రియేటివిటీ
తేలికైన సన్నివేశాలు
విలన్ పాత్ర డిజైన్
ఎమోషన్ లేని యాక్షన్

ఫినిషింగ్ టచ్ : సగం స్మార్ట్!

రేటింగ్ : 2.5 / 5

This post was last modified on August 15, 2024 2:32 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

48 minutes ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

1 hour ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

1 hour ago

నిర్మ‌ల‌మ్మ ఎఫెక్ట్‌: ‘పాప్ కార్న్‌’పై ప‌న్ను పేలుడు!

కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలోని జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాల‌క్షేపానికి తినే…

2 hours ago

నో బెనిఫిట్ షోస్, నో టికెట్ హైక్స్ – భవిష్యత్ ఏంటి ?

తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…

3 hours ago

భగ‌వ‌త్ గారి గీతోప‌దేశం.. మోడీకి మండేలా ఉందే!

రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ చీఫ్ మోహ‌న్ భగ‌వ‌త్‌.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాల‌కు కూడా.. ఐకాన్‌. ఆయ‌న…

3 hours ago