Movie Reviews

సమీక్ష – సత్యభామ

ఎన్నికలు, ఫలితాలు అయిపోయాక టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తిరిగి సందడి నెలకొంటోంది. ఈ శుక్రవారం డబ్బింగులుతో కలిపి ఏకంగా పదకొండు సినిమాలు విడుదలకు సిద్ధం కావడంతో టికెట్ కౌంటర్లు మళ్ళీ కళకళలాడతాయని బయ్యర్లు భావించారు. కౌంట్ ఎన్ని ఉన్నా జనాల దృష్టి ఎక్కువగా ఉన్నది శర్వానంద్ మనమే మీద, ఆ తర్వాత సత్యభామపై. సోలోగా కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ పోషించిన ఈ మూవీ ప్రమోషన్ కోసం ఎడతెరిపి లేకుండా రెండు వారాలుగా తిరుగుతూనే ఉంది. మరి అంచనాలకు తగ్గట్టు మెప్పించిందా లేదా

కథ

ఏసిపి సత్యభామ (కాజల్ అగర్వాల్) ది దూకుడు తత్వం. నేరస్థులను పట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లే రకం. హసీనా అనే అమ్మాయి భర్త యూదు (అనిరుధ్ పవిత్రన్) వేధింపులను తట్టుకోలేక ఫిర్యాదు చేస్తే కళ్ళముందే ఆమె ప్రాణాలు పోతున్నా కాపాడుకోలేని స్థితిలో హంతకుడి కోసం వేట మొదలుపెడుతుంది. అనూహ్యంగా హసీనా తమ్ముడు డాక్టర్ చదువుతున్న ఇక్బాల్ (ప్రజ్వల్) మాయమవుతాడు. దీంతో కేసుని సీరియస్ గా తీసుకున్న సత్యభామకు ఈ కుట్రలో స్థానిక మంత్రి కొడుకు రిషి (అంకిత్ కోయ )హస్తం ఉందని తెలుస్తుంది. లోతుగా తవ్వే కొద్దీ సత్యకు విస్తుపోయే విషయాలు తెలుస్తాయి. అవేంటనేది తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ

క్రైమ్ థ్రిల్లర్లు మనకు కొత్తేమీ కాదు. ఎన్ని వచ్చినా సరైన రీతిలో ఎంగేజ్ చేసేలా ఉంటే వీటి ఆదరణకు లోటు ఉండదు. కాకపోతే ఓటిటి ట్రెండ్ లో ఆషామాషీ కహానీలతో మెప్పించాలని చూస్తే మాత్రం దెబ్బ పడుతుంది. దర్శకుడు సుమన్ చిక్కాల ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ బోలెడు సబ్ ప్లాట్స్ పెట్టేసి సమాజానికో రెండు సందేశాలు, థ్రిల్ ఇచ్చే సస్పెన్స్ తో సత్యభామని కాస్తంత కొత్తగా చెప్పేందుకు ట్రై చేశాడు. కాజల్ అగర్వాల్ ఇంట్రోని వెరైటీగా మొదలుపెట్టి ఆపై భర్త నవీన్ చంద్ర పరిచయం, అటు నుంచి నేరుగా హసీనా ఎపిసోడ్ తో పెద్దగా టైం వేస్ట్ చేయకుండా అసలు పాయింట్ లోకి వెళ్ళిపోతాడు. తొలి హత్య అరగంటలోనే చూపించేసి ఆసక్తి పెంచుతాడు.

ఒకదశ వరకు టెంపోలో పెద్దగా ఇబ్బంది అనిపించదు. ఇక్బాల్ మాయమయ్యాక ఏం జరిగి ఉంటుందనే దాని చుట్టూ సరైన హోమ్ వర్క్ లేకుండా ఒక్కో పాత్రను ముడిపెట్టేసి నడిపించాడు. సామాన్య ప్రేక్షకులకు అంతగా అవగాహన లేని వర్చువల్ వీడియో గేమ్స్ ని అసలు నేరస్థుల మధ్య లింకుల కోసం వాడుకోవడం దగ్గర నుంచి కనెక్టివిటీ తగ్గడం మొదలయ్యింది. ఇక్బాల్ ని వెతికే క్రమంలో సత్యభామ చేసే పనుల్లో సినిమాటిక్ లిబర్టీ అనిపించినా కొంత కన్విన్సింగ్ గానే సాగుతాయి. హసీనా చావుకు కారణమైన యూదుని వెతుకుతున్న ట్రాక్ కాస్తా ఇక్బాల్ వైపు షిఫ్ట్ అయిపోవడంతో హఠాత్తుగా ఫోకస్ మారినట్టు అనిపిస్తుంది. ఇక్కడే ఇబ్బంది మొదలు.

సెకండాఫ్ లో దర్శకుడు మాస్ కోసం తీసుకున్న సృజనాత్మకత స్వేచ్ఛ అక్కర్లేని ఎలివేషన్లను పుట్టించింది. అమ్మాయిలను అక్రమ రవాణా చేసే ముఠాను పట్టుకుని షీ టీమ్ యాప్ ఉపయోగాలు చూపించే ఆలోచన బాగున్నా మెయిన్ స్టోరీకి సంబంధం లేకుండా ఈ వ్యవహారం జరగడంతో ఇరికించిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈ గ్యాంగ్ కి, ఇక్బాల్ కుటుంబ సభ్యులకు బంధుత్వం పెట్టినా కూడా అదంత సింక్ లా అనిపించదు. యుదూ ఎక్కడ ఉన్నాడో తెలిశాక అరగంటకు పైగానే సత్యభామ మాయమైపోతుంది. తన స్థానంలో ఇక్బాల్, రిషిల పాటు వీళ్ళిద్దరూ అభిమానించే ఎంబిబిఎస్ క్లాస్ మేట్ చుట్టూ సాగదీసిన ఫ్లాష్ బ్యాక్ పెట్టడంతో కథనం ఎటెటో వెళ్లిపోయింది.

అసలు సత్యభామ అనే టైటిల్ పెట్టినప్పుడు దానికి తగ్గట్టు ఆమె ప్రతి చర్య తెరమీద పవర్ ఫుల్ గా అనిపించాలి. కానీ అలా జరగదు. గూఢచారి లాంటి అద్భుతమైన స్పై డ్రామాతో కట్టిపడేసిన శశికిరణ్ తిక్కా దీనికి స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న టైంలో ఇన్ని ట్విస్టులు అయోమయానికి దారి తీస్తాయని గుర్తించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పైగా ఇక్బాల్, రిషిల చుట్టూ పరిధికి మించి లెన్త్ చేయి దాటడం సరి చేసి ఉంటే రెండో సగం లోపాలు చాలా మటుకు తగ్గేవి. ఆలా కాకుండా హ్యూమన్ ట్రాఫికింగ్, టెర్రరిజం, షీ యాప్, డేటింగ్ మోసాలు ఇలా అన్ని రకాల సామజిక సమస్యలను తలకెత్తుకుని ఇరికించడం వల్ల ఎంతకీ తెగని ప్రహసనంలా మారిపోయింది

ఏ రచయితయినా గుర్తుపెట్టుకోవాల్సిన సూత్రం ఒకటుంది. కథలో భాగంగా మలుపులు రావాలి తప్పించి ట్విస్టులతోనే కథని నింపాలని చూస్తే కలగాపులగం అయిపోతుంది. సత్యభామలో రెండో కోవలోకి వచ్చేసింది. ఏదేదో ఊహించుకుని క్లైమాక్స్ దాకా ఎదురుచూస్తే హడావిడితో దాన్నీ సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు. ఇమేజ్ ఉన్న హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నప్ప్పుడు కేవలం బిల్డప్, బ్యాక్ గ్రౌండ్ ఎలివేషన్లతో పనవ్వదు. దాని తగ్గ సెటప్, నమ్మశక్యంగా అనిపించే లాజిక్స్ తో నడిపించాలి. కానీ సుమన్ చిక్కాల ట్విస్టుల వలయంలో సత్యభామని ఇరికించేసి ఉక్కిరిబిక్కిరి చేశాడు. దీంతో సరైన ఆక్సిజన్ అందక శుభం కార్డుకు ముందే చేతులు ఎత్తేసింది.

నటీనటులు

క్వీన్ అఫ్ మాసెస్ అని కొత్తగా బిరుదు అందుకున్న కాజల్ అగర్వాల్ తనవరకు దర్శకుడు అడిగింది చేసింది. విజయశాంతి రేంజ్ లో పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసేది కాకపోవడంతో డీసెంట్ యాక్టింగ్ తో నెట్టుకొచ్చేసింది. నవీన్ చంద్రకు ఈ మధ్య కాలంలో దక్కిన అతి బలహీనమైన క్యారెక్టర్ ఇదే. భర్తగా మొక్కుబడిగా పని కానిచ్చాడు. ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ ని పసలేని సీన్లకు వాడుకోవడం బ్యాడ్ లక్. నాగినీడు, హర్షవర్ధన్ లాంటి అనుభవజ్ఞులను సరిగా ఉపయోగించుకోలేదు. కుర్రాళ్లు ప్రజ్వల్, అంకిత్ కోయాలకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కింది. ఇంకా మెరుగుపడే స్టేజిలో ఇంత నిడివి ఉన్న పాత్రలు దక్కడం లక్కే. మిగిలిన క్యాస్టింగ్ అంతగా గుర్తుండదు

సాంకేతిక వర్గం

శ్రీచరణ్ పాకాల బీజీఎమ్ సత్యభామ ఎలివేషన్లకు బాగానే ఉపయోగపడింది. కొన్ని సన్నివేశాల్లో పర్వాలేదనే స్కోర్ పడింది. ఉన్నవి తక్కువే అయినా పాటలు పెద్ద మైనస్ గా నిలిచాయి. అవసరం లేకుండా పెట్టడమూ దెబ్బ కొట్టింది. విష్ణు బేసి ఛాయాగ్రహణంలో క్వాలిటీ బాగుంది. పరిమిత బడ్జెట్ లోనూ పనితనం చూపించాడు. నిడివి పరంగా ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్ ని నిందించడానికి లేదు. కంటెంట్ అలా ఉంది కాబట్టి వీలైనంత వేగంగానే వెర్షన్ కట్ చేశాడు కానీ లాభం లేకపోయింది. శశికిరణ్ తిక్కా స్క్రీన్ ప్లేతో పాటు కథా ఆయనదే అయ్యుంటే బాగుండేదేమో. డైలాగులకు స్కోప్ ఉన్నా పేలలేదు. నిర్మాణ విలువలు సబ్జెక్టు డిమాండ్ మేరకు సాగాయి.

ప్లస్ పాయింట్స్

కాజల్ పాత్ర
కొన్ని ట్విస్టులు

మైనస్ పాయింట్స్

ఎక్కువైన మలుపులు
కథనంలో అయోమయం
సెకండాఫ్
పాటలు

ఫినిషింగ్ టచ్ : కేస్ క్లోజ్

రేటింగ్ : 2 / 5

This post was last modified on June 7, 2024 5:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

10 minutes ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

16 minutes ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

58 minutes ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

1 hour ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

2 hours ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

2 hours ago