Movie Reviews

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ బ్యాండుతో డీసెంట్ సక్సెస్ ఖాతాలో వేసుకున్నాక శ్రీరంగనీతులు నిరాశ పరిచినప్పటికీ సోలో హీరోగా చేసింది కాదు కాబట్టి అంతగా పరిగణనలోకి రాలేదు. సుకుమార్ శిష్యుడు అర్జున్ దర్శకత్వం వహించిన ప్రసన్నవదనం ట్రైలర్ దశ నుంచే ఆసక్తి రేపుతూ వచ్చింది. ప్రమోషన్లు బాగానే చేశారు. ఎండలు మండిపోతున్న టైంలో ఈ చిత్రం ప్రసన్నం కలిగించిందో లేదో చూద్దాం

కథ

సూర్య(సుహాస్) రేడియో ఆర్జేగా పని చేస్తుంటాడు. ఒక యాక్సిడెంట్ లో గాయపడి ఎదుటి వాళ్ళ మొహాలు, స్వరాలు గుర్తుపట్టలేని ఫేస్ బ్లైండ్ నెస్ జబ్బుకు గురవుతాడు. ఆద్య(పాయల్)తో పరిచయం ప్రేమగా మారుతుంది. రాత్రిపూట ఓ అమ్మాయి హత్యని కళ్లారా చూస్తాడు. అయితే మొహం గుర్తుపట్టలేని కారణంగా పోలీసులకు ఫోన్ చేసి వదిలేస్తాడు. కానీ స్టేషన్ ఎస్ఐ(నితిన్ ప్రసన్న) సూర్యనే వెంటాడుతూ ఉంటాడు. ఏసిపి వైదేహి(రాశిసింగ్) \ఇతన్ని కాపాడే హామీ ఇస్తుంది. ఈ లోగా ఊహించని సంఘటనలు జరిగి సూర్య ఏకంగా వివిధ మర్డర్ కేసుల్లో ఇరుక్కుంటాడు. చనిపోయిన యువతీ ఎవరు, ఈ విషవలయం నుంచి సూర్య ఎలా బయటికి వచ్చాడనేది స్టోరీ.

విశ్లేషణ

అసలు హంతకుడు ఎవరో ఊహించే అవకాశం ఇవ్వకుండా క్రైమ్ థ్రిల్లర్స్ ని నడిపించడం పెద్ద ఆర్ట్. అందులోనూ తెలుగు ప్రేక్షకులను మెప్పించాలంటే ఆషామాషీ కసరత్తు సరిపోదు. అందుకే వంశీ లాంటి లెజెండరీ దర్శకుడు సైతం అన్వేషణతో అద్భుతాన్ని ఇచ్చి అనుమానాస్పదంతో అయ్య బాబోయ్ అనిపించారు. ఇది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దర్శకుడు అర్జున్ వైకె ఇప్పటిదాకా రాని ఒక డిఫరెంట్ పాయింట్ ని తీసుకోవడం బాగుంది. ఫేస్ బ్లైండ్ నెస్ వాస్తవంగా ఉన్నదే అయినప్పటికీ ఇప్పటిదాకా ఏ రచయితకు దీని మీద సబ్జెక్టు రాయాలన్న ఆలోచన రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అర్జున్ ఇది ఎంచుకోవడంలోనే అభిరుచిని చాటాడు.

టైటిల్ కార్డు దగ్గరి నుంచి స్ట్రెయిట్ గా అసలు పాయింట్ లోకి వెళ్ళిపోయిన అర్జున్ కొంతసేపటి తర్వాత హీరోయిన్ పరిచయం నుంచి కాసేపు రొటీన్ ట్రాక్ లోకి వచ్చేస్తాడు. ఎసిపి ఎంట్రీ, ఎస్ఐ వేట, నందు పరిచయం, పనిమనిషి కుటుంబం ఇదంతా అలా అలా వెళ్ళిపోతుంది. విసుగొచ్చేలా ఉండదు కానీ ప్రత్యేకంగా ఏమీ అనిపించకపోవడంతో ఫ్లాట్ గా వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. యాక్సిడెంట్ జరిగాక పరిణామాలు వేగంగా జరగాలని ఊహిస్తాం. ఆడియన్స్ ఫోకస్ మొత్తం ఎస్ఐ మీదే ఉండేలా తెలివిగా స్క్రీన్ ప్లే రాసుకున్న అర్జున్ విశ్రాంతి దగ్గర అసలు ట్విస్టు రివీల్ చేయడం ఒక్కసారిగా షాక్ ఇస్తుంది. అధిక శాతం దీన్ని ఊహించలేరు.

ఇక్కడ కలిగిన థ్రిల్ తో ఒక్కసారిగా సెకండ్ హాఫ్ మీద అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. అయితే కిల్లర్ ఎవరో మొదటి సగంలోనే ఓపెన్ గా చెప్పేసిన అర్జున్ ఇంకో గంటకు పైగా సస్పెన్స్ ఎలిమెంట్ లేకుండా నడిపించడం సవాల్ గా మారింది. దీంతో సహజంగానే కలిగే తడబాటు వల్ల కొంత ల్యాగ్ వచ్చేసింది. ముఖ్యంగా హత్యలు చేసిన వ్యక్తుల మోటివ్ ని చూపించే క్రమంలో దానికి పెట్టిన నేపథ్యం అంత కన్విన్సింగ్ గా అనిపించదు. అర్థం కావడానికి ఇంకా డీటెయిల్డ్ గా వివరించాలని ఉన్నా కథకు ప్రాణంగా నిలిచే ఆ ట్విస్టుని ఇక్కడ చెప్పేస్తే స్పాయిలర్ గా మారిపోతుంది కాబట్టి వివరాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదు. ఈ ఎపిసోడ్ మీద ఇంకొంచెం వర్క్ జరగాల్సింది.

గుట్టుని విప్పే క్రమంలో దర్శకుడు కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవడం లాజిక్స్ ని పక్కకు తోసేసింది. అన్ని హత్యలు మోపబడిన సూర్య స్వేచ్ఛగా బయట తిరుగుతాడు. ఒక పోలీస్ ని ఆసుపత్రిలో హత్య చేస్తే అదెవరు చూసి ఉండరనే రీతిలో డిపార్ట్ మెంట్ వాళ్ళు మాట్లాడుకోవడం వింతగా అనిపిస్తుంది. సూర్య క్యారెక్టర్ ప్రవర్తించే విధానం కూడా ఒక ఫ్లోలో ఉండదు. నమ్మశక్యం కాని రీతిలో ఒక సమస్య ఉన్నప్పుడు దాని మీద బోలెడు డ్రామా నడిపించవచ్చు. రెండో సగంలో దీన్ని కొంచెం వాడుకుని ఉండాల్సింది. ఇది లేకపోవడం వల్ల ప్రీ క్లైమాక్స్ దాకా కథనం అటుఇటు ఊగుతూ మిశ్రమంగా అనిపిస్తుంది. తిరిగి ప్రీ క్లైమాక్స్ లో ఊపందుకుంటుంది.

అర్జున్ వైకెలో విషయముంది. ఇతను తన దగ్గర మానేశాకే తాను లాజిక్స్ ఆలోచించడం ఆపేశానని చెప్పిన సుకుమార్ మాట నిజమే అనిపిస్తుంది. కాకపోతే ప్రతిభను ఇంకా సానబెట్టుకోవాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా క్యాస్టింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు ఆర్టిస్టులు తమకిచ్చిన పాత్రలకు మిస్ మ్యాచ్ కావడం చివరిగా మిగిలే ఇంపాక్ట్ ని తగ్గించేసింది. బోలెడు థ్రిల్లర్లు ఓటిటిలో పలకరిస్తున్న ట్రెండ్ లో థియేటర్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసేలా తక్కువ బడ్జెట్ సినిమాలు తీయాలంటే ప్రసన్నవదనం లాంటి కాన్సెప్ట్స్ కరెక్టే. పేపర్ మీద ఎగ్జైట్ మెంట్ కలిగించే ఇలాంటి వాటికి తెరమీద వంద శాతం న్యాయం జరిగితేనే అద్భుతాలు చూడొచ్చు. ప్రసన్నవదనం అరవై శాతం దాటిందని చెప్పొచ్చు.

నటీనటులు

సీరియస్ పాత్రలకు బాగా నప్పే సుహాస్ ఇందులో విచిత్రమైన వ్యాధితో బాధపడే కుర్రాడిగా కోరుకున్న పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో నటనకు స్కోప్ ఉన్నవాటిని పూర్తిగా వాడుకున్నాడు. పాయల్ అందంగానే ఉన్నా లుక్స్ పరంగా ఇంకొంచెం శ్రద్ధ తీసుకోవాల్సింది. పోలీస్ ఆఫీసర్ గా రాశి సింగ్ కి చాలా ప్రాధాన్యం దక్కింది. ఈ క్యారెక్టర్ కున్న షేడ్స్ ని బ్యాలన్స్ చేసిన తీరు బాగానే ఉంది కానీ ఇంకొంచెం బెటర్ గా ఆశిస్తాం. నితిన్ ప్రసన్న మరోసారి గుర్తుండిపోయాడు. ఎక్కువ వేరియేషన్స్ పడ్డాయి. హర్ష చెముడు ఓకే. నందు, గోపరాజు రమణ తదితరులకు లెన్త్ సరిపోలేదు. కమెడియన్ సత్యని కేవలం రెండు సీన్లకు పరిమితం చేశారు .

సాంకేతిక వర్గం

విజయ్ బుల్గానిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. విపరీత శబ్దాలు లేకుండా ఎంత టెంపో ఉండాలో అంతే మైంటైన్ చేస్తూ డీసెంట్ గా ఇచ్చాడు. కొంత రిపీట్ ఉన్నా ఇబ్బంది లేదు. పాటల్లో మెరుపులు లేవు. మళ్ళీ వినాలనిపించే క్యాచీ ట్యూన్స్ అయితే రీచ్ మరింతగా పెరిగేది. ఎస్ చంద్రశేఖరన్ ఛాయాగ్రహణం బడ్జెట్ పరిమితులను తట్టుకుని మంచి అవుట్ ఫుట్ వచ్చేందుకు దోహదపడింది. ఇంకొంచెం క్వాలిటీ కావాల్సింది కానీ అది నిర్మాతకు సంబంధించిన అంశం. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ నీట్ గా సాగింది. నిడివి మరీ ఎక్కువ అనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ప్రొడక్షన్ వేల్యూస్ ఓకే. రిస్క్ లేకుండా ఖర్చు పెట్టాలని దానికి తగ్గట్టే తీశారు.

ప్లస్ పాయింట్స్

సుహాస్
ఇంటర్వెల్ ట్విస్టు
స్క్రీన్ ప్లే
ఊహించని మలుపులు

మైనస్ పాయింట్స్

కొంత సెకండాఫ్ గ్రాఫ్
లవ్ ట్రాక్
కిక్ తగ్గిన ఫ్లాష్ బ్యాక్
కొన్ని బేసిక్ లాజిక్స్

ఫినిషింగ్ టచ్ : ట్విస్టుల ప్రయాణం

రేటింగ్ : 2.75/5 

This post was last modified on May 3, 2024 5:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉండి టాక్‌: ర‌ఘురామ‌.. హ్యాపీయేనా…!

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ రాజు ఆనంద ప‌డుతున్నారా? సంతోషంగానేఉన్నారా? ఇదీ.. ఇప్పు డు ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉండి…

5 mins ago

కొన్ని కొన్ని సార్లు మిస్ చేసుకోడమే మంచిది సిద్ధార్థ్…

హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాలను తమిళంతో సమాంతరంగా తెలుగులోనూ విడుదల చేయిస్తున్న హీరో సిద్దార్థ్…

2 hours ago

పెద్ద‌ల స‌భ‌కు పెరుగుతున్న పోటీ.. బాబు క‌రుణ ఎవ‌రిపై..!

రాజ్య‌స‌భకు సంబంధించి ఏపీలో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో రెండు టీడీపీ తీసుకుని.. ఒక‌టి మాత్రం కూట‌మి పార్టీల‌కు…

2 hours ago

అల్లరోడిలో ఇంత మాస్ యాంగిల్ ఉందా…

ఒకప్పుడు కామెడీ సినిమాల కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన అల్లరి నరేష్ ఆ తర్వాత వరస ఫ్లాపులతో వెనుకబడినట్టు అనిపించినా…

2 hours ago

జైలర్ 2 : ఈ సారి రచ్చ ఎలా ఉండబోతుందో తెలుసా?

చాలా ఏళ్లుగా బ్లాక్ బస్టర్ లేని కొరతను తీరుస్తూ రజనీకాంత్ కు జైలర్ ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు.…

2 hours ago