Movie Reviews

సమీక్ష – ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్

ఎలివేషన్లు యాక్షన్లతో నడుస్తున్న ట్రెండ్ లో వినోదాత్మక సినిమాలు రావడం తగ్గిపోయింది. ఇమేజ్ ఉన్న మీడియం రేంజ్ హీరోలు వీటి జోలికి పెద్దగా వెళ్లడం లేదు. అందుకే ఈ గ్యాప్ ని వాడుకోవడం కోసమే అన్నట్టుగా ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ ప్రమోషన్లు జోరుగా చేశారు. మూసలో వెళ్లి మాచర్ల నియోజకవర్గంతో దెబ్బ తిన్న నితిన్ ఈసారి ఖచ్చితంగా హిట్టు కొడతాననే నమ్మకాన్ని బలంగా వ్యక్తం చేస్తూ వచ్చాడు. దర్శకుడిగా వక్కంతం వంశీకి సైతం ఇది విజయం సాధించడం చాలా కీలకం. మరి మ్యాన్ అంత మ్యాన్లీగా ఉన్నాడా

కథ

జూనియర్ ఆర్టిస్టు అభినయ్ (నితిన్) కు పెద్ద హీరో కావాలని కోరిక. చిన్నచిన్నవేషాలు వేసుకునే క్రమంలో ఒక కార్పొరేట్ కంపనీని నడిపించే లిఖిత (శ్రీలీల) పరిచయం ప్రేమగా మరి అతన్ని ఏకంగా సిఈఓ పదవి దాకా తీసుకెళ్తుంది. ఈ క్రమంలో హీరోని చేస్తానంటూ ఒక వ్యక్తి చేసిన మోసం వల్ల అభి ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ లో ఉండే ఒక ఊరికి పోలీస్ ఆఫీసర్ గా వెళ్తాడు. అక్కడ ప్రమాదరకమైన డాన్ నీరో(సుదేవ్ నాయర్) తో తలపడతాడు. ఇంతకీ అభి ఈ వ్యూహంలో ఎలా ఇరుక్కున్నాడు, బయటికెలావచ్చాడనేదే స్టోరీ

విశ్లేషణ

రచయిత వక్కంతం వంశీకి ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ ని బ్యాలన్స్ చేస్తూ స్టార్ హీరోల అభిమానులను మెప్పించేలా స్క్రిప్ట్ రాస్తాడని మంచి పేరుంది. డాక్టర్ తనకు తాను ఆపరేషన్ చేసుకోలేడన్న రీతీలో దర్శకుడిగా మారిన ఈ క్రియేటివ్ రైటర్ డైరెక్టర్ కుర్చీలోకి వచ్చేటప్పటికి పట్టు తప్పుతున్నాడు. బేసిక్ గా వక్కంతం హీరోల ప్రవర్తన ఎక్స్ ట్రీమ్ గా ఉంటుంది. కిక్ లో రవితేజ, రేస్ గుర్రంలో అల్లు అర్జున్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తింగరితనం, తెంపరితనం రెండు మిక్స్ చేసి ఒక పక్క నవ్విస్తూనే డేంజర్ అనిపించే విలన్లను మట్టికరించేలా వాటిని సురేందర్ రెడ్డి ప్రెజెంట్ తీసిన తీరు మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఎక్స్ ట్రాడినరి మ్యాన్ లోనూ ఇదే చేయబోయారు వంశీ.

అభినవ్ పాత్రను ఒక పెద్ద బిల్డప్ తో ఎస్టాబ్లిష్ చేసి అతన్ని జూనియర్ ఆర్టిస్టుగా పరిచయం చేసే తీరు ఇదంతా ఒక టైం పాస్ పద్దతిలో సాగిపోయింది. శ్రీలీల పరిచయమయ్యాక, ఆమెతో ప్రేమ మొదలయ్యాక వస్తుంది అసలు సమస్య. ఏ మాత్రం నమ్మశక్యం కాని రీతిలో కాసిన్ని స్పూఫులు, డాన్సులు పెట్టేసి వాళ్ళ ట్రాక్ ని మమ అనిపించాక అసలు ట్విస్టుని ప్రీ ఇంటర్వెల్ ముందు ప్రవేశ పెడతాడు. ఎక్కడా కొత్తదనం లేకుండా మార్కెట్ లో మూస చిత్రాలకే బ్రహాండమైన ఆదరణ దక్కతుందన్న భ్రమలో స్క్రిప్ట్ రాసుకున్నారేమో అన్నంత పేలవంగా కొన్ని సన్నివేశాలు అటు కామెడీ అనిపించలేక, ఇటు సీరియస్ కిందకు రాక విచిత్రమైన ఫీలింగ్ కలిగిస్తాయి.

ఎంటర్ టైన్మెంట్ టార్గెట్ పెట్టుకుని నడిచే ఇలాంటి వాటిలో లాజిక్స్ వర్తించవు. నిజమే. కానీ వాటిని కప్పెట్టే బలమైన హీరో, క్యారెక్టరైజేషన్లు ఉన్నప్పుడే ఆడియెన్స్ అంగీకరిస్తారు. కానీ ఎక్స్ ట్రాడినరిలో ఇవి పూర్తిగా మిస్ అయ్యాయి. నితిన్ తన శాయశక్తుల ఎనర్జీ మొత్తం వాడి సన్నివేశాలను నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ వీక్ రైటింగ్ వల్ల చాలాసార్లు అదంతా పక్కదారి పట్టేసింది. ఇంట్లో తండ్రి రావు రమేష్ తో చేయించిన కామెడీ కాసిన్ని నవ్వులు పూయిస్తుంది కానీ తర్వాత ఆయన్ని పూర్తిగా పక్కకు తప్పించేసి భారం మొత్తం నితిన్, సుదేవ్ నాయర్ భుజాల మీద పెట్టేయడంతో మోయలేకపోయారు. దీనికి తోడు వీక్ విలన్ అసలు అడ్డంకి అయ్యాడు.

ఎన్ని అతిశయోక్తులు ఉన్నా సెకండ్ హాఫ్ మీద ఆశలు పెట్టుకుంటే పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ మొదలయ్యాక కథనం పూర్తిగా గాడి తప్పేస్తుంది. ఒక సినిమా మేకింగ్ గురించి అవగాహన సగటు ప్రేక్షకుడికి పెద్దగా ఉండదు. అలాంటిది హీరో విలన్ మధ్య క్లాష్ తాలూకు కాంఫ్లిక్ట్ ని రివర్స్ స్క్రీన్ ప్లేతో నడిపించి ఇదేదో పెద్ద ట్విస్టులా అనుకోమంటూ వదిలేయడం అంతుచిక్కని వ్యవహారం. పైగా బావిలో జనాన్ని పారేసి పెట్రోల్ పోసి తగలబెట్టినవాడు అభినయ్ ముందు మాత్రం బుర్రలో ఏ మాత్రం గుజ్జులేని వాడిగా ప్రవర్తిస్తాడు. ఇలా ఇంతకు ముందు బోలెడు సినిమాల్లో వచ్చింది కానీ వాటికి ఆయా దర్శకులు బ్యాలెన్సింగ్ చేయడంలో చూపిన నేర్పు వంశీకి లేదు.

ఇమేజ్ ప్లస్ మార్కెట్ లెక్కలు ముడిపడిన హీరోలకు ప్రయోగాలు అక్కర్లేదు. అలా అని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా ప్రేక్షకులను తక్కువగా జమకట్టి సిల్లీ నెరేషన్ తో మెప్పించడం ఇప్పుడున్న ఓటిటి ట్రెండ్ లో చాలా కష్టం. రాజశేఖర్ లాంటి సీనియర్ యాక్టర్ ని సైతం సరిగా వాడుకోలేకపోయారు. జబర్దస్త్ కామెడీ ఉచితంగా నెట్ లో దొరుకుతున్న ప్రపంచంలో అదే పనిగా థియేటర్లకు వచ్చి టికెట్లు కొని సినిమాలు చూస్తున్న జనాలకు ఆషామాషీ కంటెంట్ ఇస్తామంటే కుదరదు. టైటిల్ లో ఉన్న ఎక్స్ ట్రాడినరికి న్యాయం జరిగినప్పుడే జనం సంతోషంగా బయటికి వస్తారు. లేదూ అదోలాంటి అయోమయం భావనతో బయటికి వచ్చారంటే చెప్పడానికి ఏమీ ఉండదు

నటీనటులు

నితిన్ గురించి వంక పెట్టడానికి లేదు. ఉన్నంతలో తన క్యారెక్టర్ కు ఇచ్చిన అన్ని రకాల వేరియేషన్స్ ని సరిగానే ఇచ్చాడు. శ్రీలీల డేట్స్ తక్కువకు దొరకడం వల్లేమో పాటలకు, లవ్ ట్రాక్ కు వాడుకుని మేనేజ్ చేశారు. తనకెలాంటి ప్రయోజనం లేదు. విలన్ గా సుదేవ్ నాయర్ నప్పలేదు. ఎక్స్ ప్రెషన్లు కూడా అంతంతమాత్రమే. రావు రమేష్ ఎందుకో కొంచెం ఓవర్ చేశారనిపిస్తుంది. రోహిణి ఓకే. అజయ్, హర్షవర్ధన్, బ్రహ్మాజీ, హైపర్ ఆది, సంపత్, జగదీశ్, శ్రీకాంత్ అయ్యంగర్, హరితేజ తదితరులవి రెగ్యులర్ పాత్రలే. చేసుకుంటూ పోయారు. ఎక్కువ ఆశించిన డాక్టర్ రాజశేఖర్ ని మాత్రం నిరాశపరిచేలా వాడుకున్నారు. సాయికుమార్ డబ్బింగ్ కొంత నిలబెట్టింది.

సాంకేతిక వర్గం

ఒకప్పుడు ఆరంజ్ లాంటి అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చిన హరీష్ జైరాజ్ నుంచి ఆశించిన అవుట్ ఫుట్ ఇది కాదు. పాటలు మరీ తీసికట్టుగా ఉండగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తేలిపోయింది. నితిన్, శ్రీలీల హుషారైన డాన్సులు ఆయన అత్తెసరు సాంగ్స్ వల్ల నీరస పడ్డాయి. ఆర్థర్ విల్సన్ – యువరాజ్ – సాయిశ్రీరామ్ సంయుక్త ఛాయాగ్రహణంలో ఎవరెవరు ఎంతెంత భాగం తీశారో తెలియదు కానీ ఓవరాల్ గా క్వాలిటీ అయితే కనిపించింది. స్క్రీన్ మీద వ్యవహారం ఎగుడుదిగుడుగా సాగుతున్నప్పుడు ఎడిటర్ ప్రవీణ్ పూడి మాత్రం చేయగలిగింది ఏమీ లేదు. నిడివిని వదిలేయారు. డైలాగుల్లో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. శ్రేష్ట్ నిర్మాణ విలువల్లో నో కంప్లయింట్

ప్లస్ పాయింట్స్

నితిన్
ఫస్ట్ హాఫ్ హాస్యం
భారీతనం

మైనస్ పాయింట్స్

సంగీతం
రెండో సగం కథనం
దారి తప్పిన స్క్రీన్ ప్లే

ఫినిషింగ్ టచ్ : చాలా ఆర్డినరీ

రేటింగ్ : 2.25/5

This post was last modified on December 8, 2023 2:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పార్ల‌మెంటు ముందే అధికార-ప్ర‌తిప‌క్షాల నిర‌స‌న‌

దేశ చ‌రిత్ర‌లో.. ముఖ్యంగా ప్ర‌పంచంలో అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశంగా ప‌రిఢ‌విల్లుతున్న భార‌త దేశంలో తొలిసారి ఎవ‌రూ ఊహించ‌ని ఘ‌ట‌న‌..…

37 minutes ago

అల్లరోడికి పరీక్ష : 1 అవకాశం 3 అడ్డంకులు!

పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…

1 hour ago

ఇలాగైతే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకు ఇబ్బందులే..

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…

1 hour ago

బలగం మొగిలయ్య కన్నుమూత

తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…

2 hours ago

వైసీపీని ఎవ‌రు న‌మ్ముతారు.. రెంటికీ చెడుతోందా..!

వైసీపీ తీరు మార‌లేదు. ఒక‌వైపు.. ఇండియా కూట‌మిలో చేరేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న‌ట్టు ఆ పార్టీ కీల‌క నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు…

4 hours ago

బైడెన్ వ‌ర్సెస్ ట్రంప్‌.. న‌లిగిపోతున్న విదేశీయులు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణుల‌ను ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. మ‌రో రెండు మూడు వారాల్లోనే…

13 hours ago