స్టార్ క్యాస్టింగ్ లేకుండా కేవలం సపోర్టింగ్ ఆర్టిస్టులతో ఒక రీమేక్ చేయడం సాహసమే. మళయాలం బ్లాక్ బస్టర్ నాయట్టు హక్కులను ఎప్పుడో కొన్న గీతా ఆర్ట్స్ 2 దాన్ని తీసే విషయంలో పలు కారణాల వల్ల ఆలస్యం చేస్తూ వచ్చింది. షూటింగ్ ప్రారంభంలో తీసుకున్న తారాగణంని పూర్తిగా మార్చేసి మరీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. లింగిడి లింగిడి పాట బాగా వైరల్ కావడంతో మాస్ జనాల్లో దీని మీద ఆసక్తి రేపింది. జోహార్ ఫేమ్ తేజ మర్ని దర్శకత్వంలో రూపొందిన ఈ కాప్ డ్రామా మెప్పించిందా లేదా
కథ
కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ లో పని చేసే రామకృష్ణ(శ్రీకాంత్), రవి(రాహుల్ విజయ్), కుమారి(శివాని రాజశేఖర్)లు అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం వల్ల చేయని తప్పుకు స్వంత డిపార్ట్ మెంట్ నుంచే తప్పించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. స్థానిక ఎన్నికల్లో గెలవాలనే పంతంతో అక్కడే మకాం వేసిన హోమ్ మంత్రి(మురళి శర్మ) ఆ ముగ్గురిని పట్టుకునేందుకు రజియా అలీ(వరలక్ష్మి శరత్ కుమార్)ని ప్రత్యేకంగా అపాయింట్ చేస్తాడు. ఇక్కడి నుంచి దాగుడుమూతల ఆట మొదలవుతుంది. చివరికి ఎవరు గెలిచారనేది తెరమీద చూడాలి.
విశ్లేషణ
మలయాళం నేటివిటీ ఉండే సినిమాలతో ఉన్న రిస్క్ ఏంటంటే వాటితో మన ఆడియన్స్ ని అంత సులభంగా మెప్పించలేం. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంతటి పెద్ద స్టార్లే వీటితో బ్లాక్ బస్టర్లు సాధించలేకపోయారు. అలాంటిది క్యారెక్టర్ ఆర్టిస్టులతో ఈ ప్రయత్నం చేయడమంటే బిజినెస్ పరంగా రిస్క్ ఉంటుంది. నాయట్టు ఖచ్చితంగా చాలా మంచి పాయింట్. యధాతథంగా తీస్తే పూర్తిగా కనెక్ట్ కాకపోయే ప్రమాదముంది. అందుకే తేజ మర్ని చాలా తెలివైన మార్పులు చేసుకున్నాడు. ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత రాజకీయ నేపధ్యాన్ని ముడిపెట్టి దాన్ని సమాంతరంగా ముగ్గురు పోలీసుల వేటతో ముడిపెట్టడం బాగా సింక్ అయ్యింది.
ఒరిజినల్ వెర్షన్ లోని సోల్ ని తేజ చెడగొట్టలేదు. మొదలైన ఓ అరగంట వరకు ఏం మార్చలేదే అనే ఫీలింగ్ కలుగుతుంది. మురళీశర్మ ఎంట్రీ ఇచ్చాక టెంపో మారుతుంది. నాయట్టులో నేరుగా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయినట్టుగా నడిపిస్తారు. కానీ ప్రాక్టికల్ గా ఆలోచించిన తేజ మర్ని దాన్ని మంత్రి పాత్రకు షిఫ్ట్ చేయడంతో సహజత్వం పెరిగింది. వ్యవస్థను అడ్డుపెట్టుకుని పొలిటీషియన్లు ఎంత స్వార్థంతో ప్రవర్తిస్తారో, అవసరం తీరాక మీ ఖర్మ అంటూ ఎవరినైనా తోసేయడానికి ఎలా వెనుకడుగు వేయరో బాగా చూపించారు. ఇక్కడ సంబాషణలు కీలక పాత్ర పోషించాయి. చిన్న చిన్న మాటలే అయినప్పటికీ చురకలు మాత్రం బలంగా పడ్డాయి.
ఫస్ట్ హాఫ్ మొత్తం మూడు పాత్రల తాలూకు సంఘర్షణని బాగా ఎస్టాబ్లిష్ చేసిన తేజ ప్రాధాన్యం రామకృష్ణగా చేసిన శ్రీకాంత్ కు ఇవ్వడంతో మిగిలిన ఇద్దరూ ఎక్కువ సేపు డమ్మీగా అనిపిస్తారు. రాహుల్ విజయ్ కైనా కాసిన్ని సీన్లు పడ్డాయి కానీ శివాని రాజశేఖర్ బేలగా చూస్తూ ఏడవటం తప్ప పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు. నిజానికి సమాన ప్రాధాన్యం దక్కాల్సి ఉండగా ఫోకస్ వన్ సైడ్ అయిపోయింది. రామకృష్ణ బృందం అడవుల్లోకి వెళ్ళాక సీన్లు కొన్ని రిపీట్ గా అనిపించడం థ్రిల్ ఫ్యాక్టర్ ని తగ్గించేసింది. ఎక్కువ సేపు ఎంగేజ్ చేయడానికి సరిపడా డ్రామా లేకపోవడంతో అక్కడక్కడా బోర్ కొట్టేస్తుంది. గూడెంకు వెళ్ళాక జరిగే సన్నివేశాలను ఏ మార్పు చేయలేదు.
కథా కథనాలు ఇంకొంచెం బిగితో ఉండి సబ్ ప్లాట్స్ ని జోడించి ఉంటే కోట బొమ్మాళి స్థాయి ఇంకా పెరిగేది. వెనుకబడిన వర్గాలను పార్టీలు ఎలా వాడుకుంటాయనే దాని మీద కాంఫ్లిక్ట్(సంఘర్షణ) డిజైన్ చేసినప్పుడు దాని గురించి ఇంకాస్త లోతుగా వెళ్తే సందేశంతో పాటు ఆలోచింపజేసే అవకాశమూ ఉండేది. చెడగొట్టారనే కామెంట్స్ వస్తాయని కాబోలు తేజ దాని జోలికి అంతగా వెళ్ళలేదు. కొన్ని లాజిక్స్ విషయంలో సినిమాటిక్ లిబర్టీ తీసేసుకున్నారు. రామకృష్ణ బ్యాచ్ తప్పించుకున్నాక గంటల తరబడి సెల్ ఫోన్లతో ఉంటారు. క్షణాల్లో వాటి లొకేషన్లను ట్రేస్ చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ ఆ దిశగా ఎవరూ ఆలోచించకపోవడం తర్కానికి కొంచెం దూరంగా ఆగింది.
రామకృష్ణ తెలివితేటలను ఎలివేట్ చేసిన విధానం బాగుంది కానీ వావ్ అనిపించేలా మాత్రం చేయలేకపోయారు. అయినా సరే ఇన్ని పరిమితుల మధ్య ఆ క్యారెక్టర్ పండిందంటే అది శ్రీకాంత్ అనుభవంతో కూడిన నటన వల్లే. చివర్లో సమాజం కోణంలో తేజ మర్ని మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు కానీ అక్కడ ఎమోషన్ ఎక్కువైపోవడంతో అంతగా కుదరలేదు. క్లైమాక్స్ లో చేసిన చిన్న ఛేంజ్ కాస్త నాటకీయంగా అనిపించింది. నాయట్టు చూసిన వాళ్లకు ఇది పెద్ద ట్విస్టు. మైనస్ కాలేదు కానీ ఇదేంటి ఇంత గొప్పగా మలుపు తిప్పాడనే భావన కలగదు. మొత్తం అయ్యాక అసంతృప్తి కలగకుండా తేజ చూసుకున్నాడు. అన్ని వర్గాలు ఆమోదించడం మీదే సక్సెస్ ఆధారపడి ఉంది
నటీనటులు
చాలా గ్యాప్ తర్వాత శ్రీకాంత్ కో మంచి పాత్ర దొరికింది. సీరియస్ లుక్స్ తో ఖడ్గం తర్వాత మళ్ళీ అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ ఇదేనని చెప్పొచ్చు. రాహుల్ విజయ్ దొరికిన కాసింత స్పేస్ లోనూ ఉనికిని చాటుకునేందుకు కష్టపడ్డాడు. మంచి మార్కులు పడతాయి. శివాని రాజశేఖర్ మాత్రం పరిమితంగా ఉండిపోవాల్సి వచ్చింది. పై ఇద్దరితో సమానంగా స్క్రీన్ షేర్ చేసుకున్నా అంతగా ప్రయోజనం కలగలేదు. మురళీశర్మ ఎప్పటిలాగే తన టైమింగ్ తో హోమ్ మినిస్టర్ ని నిలబెట్టేశాడు. వరలక్ష్మి శరత్ కుమార్ పర్ఫెక్ట్ ఛాయస్. ఏ లోటు లేకుండా చేసేసింది. పవన్ తేజ్, విష్ణు, జోగి నాయుడు తదితరులు అవసరానికి తగ్గట్టు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు
సాంకేతిక వర్గం
రంజిన్ రాజ్ సంగీతం పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డిఫరెంట్ గా ఇచ్చాడు. మిథున్ ముకుందన్ కంపోజ్ చేసిన లింగిడి లింగిడి ఒకటే పాటల్లో క్యాచీ అవుతుంది. జగదీశ్ చీకటి ఛాయాగ్రహణంలో క్వాలిటీ తొంగి చూసింది. పరిమిత బడ్జెట్ ప్లస్ లొకేషన్లను చక్కగా ప్రెజెంట్ చేశాడు. కార్తీక శ్రీనివాస ఎడిటింగ్ నాయట్టు ప్యాట్రన్ ని ఫాలో అయ్యింది. రెండో సగంలో కొంత ట్రిమ్ చేయాల్సింది. నాగేంద్ర కాశి సంభాషణల్లో మెరుపులున్నాయి. బెస్ట్ అనలేం కానీ న్యాచురల్ గా రాశాడు. బడ్జెట్ పరంగా రిస్క్ లేని ఖర్చు కాబట్టి నిర్మాతలు బన్నీ వాస్, విద్య కొప్పినీడిలకు భారమయ్యే రేంజ్ లో ఇబ్బంది రాలేదు.
ప్లస్ పాయింట్స్
కథా బలం
శ్రీకాంత్ పాత్ర & నటన
రాజకీయాల నేపథ్యం
మైనస్ పాయింట్స్
సెకండాఫ్ నెమ్మదితనం
సీరియస్ టోన్
కొన్ని సన్నివేశాల ల్యాగ్
ఫినిషింగ్ టచ్ : కొంచెం పాసైన పోలీస్ డ్రామా
రేటింగ్ : 2.5 / 5
This post was last modified on November 25, 2023 1:50 pm
రాష్ట్రానికి సంబంధించి విజన్-2047 ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. తాజాగా తన సొంత నియోజక వర్గం.. 35 ఏళ్ల నుంచి వరుస…
ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత,…
గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…
కమర్షియల్ సినిమాలు ఎంతో కొంత రొటీన్ ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఇది సహజం. పైకి కొత్తగా ట్రై చేశామని చెప్పినా…
``తెల్లారే సరికి పింఛన్లు పంచకపోతే ప్రపంచం తలకిందులు అవుతుందా? ఇది ఉద్యోగులను క్షోభ పెట్టినట్టు కాదా? మహిళా ఉద్యోగులు ఇబ్బందులు…
ఏ రాష్ట్రమైనా కేంద్రం ముందు ఒకప్పుడు తల ఎగరేసిన పరిస్థితి ఉండేది. పట్టుబట్టి సాధించుకునే ప్రాజెక్టులు కూడా కనిపించేవి. కానీ,…