Movie Reviews

సమీక్ష – టైగర్ 3

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు క్రమం తప్పకుండా తెలుగులో డబ్ అయ్యేవి కానీ ఆ తర్వాత వీటి తాకిడి తగ్గిపోయింది. తిరిగి ఇప్పుడు మళ్ళీ ఊపందుకున్నాయి. పఠాన్, జవాన్ సక్సెస్ లే దానికి నిదర్శనం. అందుకే టైగర్ 3ని సైతం భారీ ఎత్తున హిందీతో వెర్షన్ తో పాటు అనువాదాలు ప్లాన్ చేసుకున్నారు. కిసీకా భాయ్ కిసీకా జాన్ డిజాస్టర్ తర్వాత తన మార్కెట్ సత్తాని మళ్లీ నిరూపించుకునే అవకాశం దీని ద్వారానే ఉందని గుర్తించిన సల్మాన్ ఖాన్ దానికి తగ్గట్టే గట్టి నమ్మకం వ్యక్తం చేస్తూ వచ్చాడు. మరి టైగర్ గర్జించిందా లేదా చూద్దాం.

కథ

ఆస్ట్రియాలో భార్య జోయా(కత్రినా కైఫ్), కొడుకుతో ఉన్న భారత గూఢచారి అవినాష్ అలియాస్ టైగర్(సల్మాన్ ఖాన్)కు ఓ ముఖ్యమైన మిషన్ అప్పజెబుతుంది రా చీఫ్ మైథిలి(రేవతి). పాకిస్థాన్ దేశద్రోహిగా ముద్రపడ్డ ఆతిష్ రెహమాన్(ఇమ్రాన్ హష్మీ) పన్నిన ఉచ్చులో పడి టైగర్ శత్రు దేశంలో కటకటాలపాలవుతాడు. పాక్ ప్రధాన మంత్రి నస్రీన్(సిమ్రాన్) చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని గుర్తించి ఆమెను దాని బారి నుంచి కాపాడటంతో పాటు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే బాధ్యత టైగర్ మీద పడుతుంది. అదేంటో తెరమీద చూడాలి.

విశ్లేషణ

హాలీవుడ్ జేమ్స్ బాండ్ సిరీస్ లో ఇప్పటిదాకా పాతిక పైగానే సినిమాలొచ్చాయి. దాదాపు అన్నీ సూపర్ హిట్లే. అలాంటి యునివర్స్ ఒకటి సృష్టించాలని కంకణం కట్టుకుంది యష్ రాజ్ ఫిలిమ్స్. ఏక్ దా టైగర్ తీసినప్పుడు దానికొచ్చిన స్పందన చూసి ఇలా ఆలోచించిందో లేదో కానీ ఈ ఏడాది ప్రారంభంలో పఠాన్ సాధించిన ఘనవిజయం చూశాక అప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుని సల్మాన్, హృతిక్, షారుఖ్, జూనియర్ ఎన్టీఆర్, దీపికా పదుకునే, అలియా భట్ లతో కూడిన ప్లాన్ ని సిద్ధం చేసుకుని కథలు రాయిస్తోంది. అందులో భాగంగా వచ్చిందే టైగర్ 3. మొదటి రెండు భాగాలు జనం బాగా రిసీవ్ చేసుకోవడంతో సహజంగానే దీని మీద అంచనాలు ఏర్పడ్డాయి.

దర్శకుడు మనీష్ శర్మ తీసుకున్న ప్లాట్ లో ఆసక్తికరమైన అంశాలను బోలెడు చోటున్నప్పటికీ దాన్ని సరైన రీతిలో స్క్రీన్ ప్లేగా మలచడంలో జరిగిన తడబాటు వల్ల టైగర్ గాండ్రింపులు ఫస్ట్ హాఫ్ లో పెద్దగా వినిపించవు. ఛేజులు, ఫైట్లు, అరెస్టులు అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ వావ్ అనిపించే అంశాలు లేకపోవడం ఇంటర్వెల్ దాకా నత్తనడకతో సాగేలా చేసింది. టైగర్ క్యారెక్టర్ తాలూకు ఎస్టాబ్లిషమెంట్, రెహమాన్ ఎంట్రీతో మొదలుపెట్టి అతని గతంలో ఉన్న ట్విస్టు ఇవేవీ ఆసక్తికరంగా ఉండవు. ఊహించినట్టే సాగుతూ ఉంటాయి. దీని వల్ల హై అనిపించే మూమెంట్స్ లేక చప్పగా సాగడంతో తెరమీద భారీ ఖర్చు తప్ప ఇంకేం కనిపించదు.

సెకండ్ హాఫ్ లో టైగర్ పాకిస్థాన్ జైలు నుంచి తప్పించుకోవడానికి పఠాన్ సహాయం తీసుకోవడం మొదలుపెట్టి కథనంలో వేగం పెరుగుతుంది. ఇక్కడా కళ్లుచెదిరే యాక్షన్ ఎపిసోడ్స్ పెద్ద పీఠ వేయడంతో మాస్ కి గూస్ బంప్స్ ఇవ్వడం మినహాయించి సగటు ప్రేక్షకులు ఫీలయ్యే ఎమోషన్ కానీ ఎగ్జైట్ మెంట్ కానీ పెద్దగా ఉండదు. పైగా పాక్ లో పరిస్థితులు ఏదో మిలిటరీ ప్రమేయం వల్ల దిగజారుతున్నాయి తప్పించి వాళ్లెప్పుడూ శాంతి కోసమే పరితపించారని చెప్పడం కోసం కథకుడు కం నిర్మాత ఆదిత్య చోప్రా పడిన పాట్లు క్లైమాక్స్ లో కనిపిస్తాయి. టైగర్ జిందా హైలోనూ ఇలాంటి సీన్ ఉంటుంది. ఇదంతా ఒక వర్గాన్ని ఆకట్టుకోవడం చేసిన ఫీట్లే.

భారీతనం మీద గుడ్డిగా ఆధారపడ్డ మనీష్ శర్మని ఒకవేళ టైగర్ 3 హిట్ అయితే ఆ క్రెడిట్ తీసుకోవడానికి చివరి పేరుగా చేర్చాలి తప్పించి చాలా లోటు పాట్లు గ్రాండియర్ వల్ల కవరైపోయాయి. ఇలాంటి స్పై స్టోరీస్ లో హీరో విలన్ క్లాష్ ఎప్పుడూ క్యాట్ అండ్ మౌస్ గేమ్ ని మించేలా సాగాలి. అంతే తప్ప హీరోకు అనుకూలంగా పరిస్థితులు మారిపోయి విలన్ నిస్సహాయుడిగా మిగిలిపోతే దాని వల్ల హీరోయిజం ఎలివేట్ కాదు. పఠాన్ కు సిద్దార్థ్ ఆనంద్ ఈ జాగ్రత్త తీసుకోవడం వల్లే అతిశయోక్తిగా అనిపించే ఎన్నో ఫీట్లు నమ్మేటట్టు మెప్పించాయి. కానీ టైగర్ 3లో మలుపుల తాలూకు లేయర్లు బలహీనంగా ఉండటంతో లాజిక్స్ వెతకడం మొదలైపోయి అదే వీక్ నెస్ గా మిగిలింది.

పోలికలు వద్దన్నా వస్తాయి కాబట్టి టైగర్ రెండు భాగాలు, పఠాన్, రాజీ, వార్ లతో కంపేర్ చేసుకుని చూస్తే ఈ టైగర్ 3 నిస్సందేహంగా చివరి స్థానంలో నిలుస్తుంది. అలా అని బ్యాడ్ ఫిలిం అనలేం కానీ అంచనాలు అందుకోలేనప్పుడు కలిగే నిరాశని హంగులతో కప్పి పుచ్చలేరు. టాక్, రివ్యూలు ఎలా ఉన్నా ఒకవేళ పోటీలేని అవకాశాన్ని వాడుకుని టైగర్ 3 నాలుగైదు వందల కోట్లు వసూలు చేయొచ్చు. అంతమాత్రాన బెస్ట్ అనే ట్యాగ్ ఇవ్వలేం. టైటిల్స్ అన్నీ అయ్యాక హృతిక్ రోషన్ తో చిన్న ఎంట్రీ ఇప్పించి పది సెకండ్లు చూపించడం అస్సలు పేలలేదు. అప్పటిలే థియేటర్లో నుంచి జనం వెళ్లిపోయారు. మార్వెల్ సిరీస్ తరహాలో ఇలాంటి ఫినిషింగ్లు ఇక్కడ పండవు

నటీనటులు

సల్మాన్ ఖాన్ కు ఇది కొట్టిన పిండి. ఈసారి హావభావాలు, ఎక్స్ ప్రెషన్లు, డైలాగులతో పెద్ద పని లేకుండా ఫైట్లతో కానిచ్చేయడంతో పని తేలికైంది. కత్రినా కైఫ్ కు అలవాటైన వ్యవహారమే. టవల్ ఫైట్ గురించి ఎక్కువ ఊహించుకున్న వాళ్లకు నిరాశ తప్పదు. ఇమ్రాన్ హష్మీ నటుడిగా ఫెయిలవ్వలేదు కానీ డిజైనింగ్ లోపం వల్ల జాన్ అబ్రహం రేంజ్ మేజిక్ చేయలేకపోయాడు. షారుఖ్ కనిపించేది కాసేపే అయినా ఓవర్ ది బోర్డ్ ఫైట్ సీక్వెన్స్ తో విజిల్స్ వేయించుకున్నాడు. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ పాక్ పీఎంగా పర్వాలేదు. కుముద్, అమీర్ బషీర్, రిద్ధి డోగ్రా, విశాల్ జెత్వా తదితరులు ఉన్నారు కానీ మనకు తెలిసిన మొహాలు వీళ్ళలో తక్కువే.

సాంకేతిక వర్గం

ప్రీతం అందించిన పాటలు థీమ్ కు తగ్గట్టే సాగాయి. ట్యూన్స్ గతంలో విన్నట్టే అనిపించినా రెగ్యులర్ శైలిలో విజువల్ గా పాసయ్యాయి తప్పించి ప్రత్యేకంగా నిలవలేదు. తనూజ్ టికు అందించిన నేపధ్య సంగీతం టైగర్ సిగ్నేచర్ బీజీఎమ్ తో సాగింది తప్ప మళ్ళీ కొత్తగా కంపోజ్ చేసింది ఏమి లేదు. ఒకదశ దాటాక పదే పదే రిపీట్ అనిపించి చిరాకు పుడుతుంది. అనయ్ గోస్వామి ఛాయాగ్రహణం కంటెంట్ కు తగ్గట్టే హై స్టాండర్డ్ లో సాగింది. లేనివి ఊహించుకుంటూ గ్రీన్ మ్యాట్ లో షూట్ చేసిన పోరాట దృశ్యాల్లో ఈయన పనితనం కనిపిస్తుంది. రామేశ్వర్ ఎస్ భగత్ ఎడిటింగ్ కోత వేయడానికి మొహమాటపడింది. యష్ ప్రొడక్షన్స్ గురించి చెప్పడానికి ఏమి లేదు.

ప్లస్ పాయింట్స్

యాక్షన్ దృశ్యాలు
టైగర్ పఠాన్ ఎపిసోడ్
సెకండ్ హాఫ్

మైనస్ పాయింట్స్

కథ కథనాలు రొటీనే
ఫస్ట్ హాఫ్
గూస్ బంప్స్ స్టఫ్ లేకపోవడం
విలన్ పాత్ర

ఫినిషింగ్ టచ్ : యావరేజ్ పులి

రేటింగ్ : 2 / 5

This post was last modified on November 13, 2023 12:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

7 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

9 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

10 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

11 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

11 hours ago