Movie Reviews

సమీక్ష – ఖుషి

విజయ్ దేవరకొండ సినిమా అనగానే యూత్ లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంటుంది. దానికి తోడు చాలా గ్యాప్ తర్వాత ఒక రామ్ కామ్ ఎంటర్ టైనర్ చేయడం వల్ల ఖుషి మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నిన్ను కోరి, మజిలీతో ఫ్యామిలీ ఆడియన్స్ లో సదభిప్రాయం కలిగిన దర్శకుడు శివ నిర్వాణ టక్ జగదీశ్ ఇచ్చిన షాక్ నుంచి త్వరగా కోలుకుని తిరిగి తన పాత స్కూల్ కే వచ్చేశాడు. సమంతా హీరోయిన్ కావడం, మైత్రి నిర్మాణ విలువలు సహజంగానే హైప్ కి తోడ్పడ్డాయి. మరి ఖుషి నిజంగా ప్రేక్షకులను ఖుషి చేసిందా

కథ

బిఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా కాశ్మీర్ కు వెళ్లిన విప్లవ్(విజయ్ దేవరకొండ)అక్కడ తొలిచూపులోనే ఓ ముస్లిం యువతి(సమంత)ని ఇష్టపడతాడు. తీరా ప్రేమను చెప్పే సమయానికి ఆమె బ్రాహ్మల కుటుంబానికి చెందిన ఆరాధ్య అని తెలుసుకుని షాక్ అవుతాడు. భక్తి మార్గం, నాస్తికత్వం పట్ల పరస్పర విరుద్ధ భావాలు కలిగిన వీళ్ళ తండ్రుల(మురళి శర్మ-సచిన్ కెడ్కర్)ను ఎదిరించి పెళ్లి చేసుకుని వేరు కాపురం మొదలుపెడతారు. అక్కడి నుంచి అపార్థాలు మొదలవుతాయి. భార్య భర్తల మధ్య గొడవలు ఏ గమ్యానికి చేర్చాయనేదే స్టోరీ

విశ్లేషణ

దర్శకుడు శివ నిర్వాణకు సున్నితమైన భావోద్వేగాల మీద మంచి పట్టుంది. నాని, నాగ చైతన్యలను అలాంటి కథల్లో చూపించిన తీరు మంచి హిట్లిచ్చింది. కమర్షియల్ హంగులకు వీలైనంత దూరంగా ఉంటూ సబ్జెక్టుకే కట్టుబడి ఉండటానికి ప్రయత్నించడం ఈయన శైలి. అగ్రెసివ్ హీరోయిజంని ఎక్కువగా ఇష్టపడే విజయ్ దేవరకొండని ఎలా చూపిస్తాడనే సందేహం ఆడియన్స్ లో లేకపోలేదు. అయితే గీత గోవిందంలో రౌడీ బాయ్ ఆ పాత్రను ఒన్ చేసుకున్న విధానాన్ని బాగా గమనించి కొంచెం అర్జున్ రెడ్డి టచ్ ఇచ్చి విప్లవ్ పాత్రను తీర్చిదిద్దాడు. ఆరాధ్య క్యారెక్టర్లో మరీ చెప్పుకునే ప్రత్యేకత లేదు కానీ సెట్ చేసుకున్న ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ బాగా కుదిరింది.

ఒకళ్ళంటే ఒకరికి పడని హీరో హీరోయిన్ల తండ్రుల బ్యాక్ డ్రాప్ లో వందల సినిమాలు వచ్చాయి. గుడ్డిగా అలా వెళ్ళిపోతే రొటీన్ అయిపోతుందని భావించిన శివ నిర్వాణ చాలా తెలివిగా వ్యతిరేక సిద్ధాంతాలు కలిగిన ఇద్దరు కుటుంబ పెద్దల నేపథ్యంలో ప్రేమకథను రాసుకున్నాడు. అయితే లైన్ పరంగా పరిమితులు చాలా ఉండటంతో ఫస్ట్ హాఫ్ లో విప్లవ్, ఆరాధ్యల మధ్య లవ్ స్టోరీకి ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఇదంతా ఎక్కువ బోర్ కొట్టించకుండా అలా నడిపించేయడంతో ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర కావాల్సిన ఆసక్తి రేపడానికి సరిపోయింది. అలా అని టైమే తెలియకుండా కథనం పరుగులు పెట్టలేదు. ప్యాసెంజర్ ట్రైన్ స్పీడ్ లో నెమ్మదిగా గమ్యం వైపు వెళ్ళింది.

ఎప్పుడైతే ప్రేమజంట ఇల్లు వదిలి వచ్చిందో అక్కడి నుంచో వైఫ్ అండ్ హస్బెండ్ క్లాష్ మీద సీరియస్ దృష్టి పెట్టారు శివ నిర్వాణ. దీని వల్లే స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగి హాయిగా నవ్వుకునే సన్నివేశాల కన్నా హృదయాన్ని కదిలించాలని తాపత్రయపడిన సీన్లే ఎక్కువగా వస్తాయి. పైగా ఈగో క్లాష్ ని సెంటర్ పాయింట్ గా చేసుకోవడంతో ఇతర పాత్రలు చూస్తూ ఉండటం మినహా ఏమీ చేయలేకపోయాయి. విప్లవ్, ఆరాధ్య మధ్య సంఘర్షణని బలంగా రిజిస్టర్ చేయకపోవడంతో విజయ్ దేవరకొండ ప్రవర్తన ఒకసారి సహేతుకంగా, మరోసారి విచిత్రంగా అనిపిస్తుంది. పైపెచ్చు అతనే ఆవేశపడుతున్నాడు కానీ నిజానికి ఆరాధ్య వైపు తప్పేమీ లేదన్న సింపతీ కలిగించాడు.

అతనే స్వయంగా ఒప్పుకున్నట్టు శివ నిర్వాణ మీద మణిరత్నం ప్రభావం బలంగా ఉంది. రోజా నుంచి లవ్ ని, సఖి నుంచి పెళ్ళైన జంట తాలూకు కాంఫ్లిక్ట్ ని, బొంబాయి నుంచి పళ్ళు నూరుకునే పేరెంట్స్ ట్రాక్ ని తనకు అనుగుణంగా, చక్కగా మార్చుకున్నాడు. ఇది కొంత మేర సానుకూల ఫలితమే ఇచ్చినప్పటికీ ప్రేక్షకుల గుండెలను తాకే స్థాయిలో ఎమోషన్స్ ని పూర్తి స్థాయిలో పండించలేకపోయాడు. ప్రీ క్లైమాక్స్ లో విజయ్, సామ్ లు విడిపోయినప్పుడు అలా న్యూట్రల్ గా చూస్తామే తప్పించి వాళ్ళ బాధను ఫీల్ కాలేం. దానికన్నా కొడుకు కోసం లెనిన్ సత్యం తన సిద్ధాంతాలను పక్కనపెట్టేందుకు సాహసించడం ఇంకా బాగా వచ్చింది.

రైటింగ్ పరంగా సెకండ్ హాఫ్ లో పట్టు తప్పుతూ వెళ్లిన శివ నిర్వాణ గ్రాఫ్ మరీ డౌన్ కాకుండా డీసెంట్ ఫిల్లింగ్స్ తో క్లైమాక్స్ వరకు నెట్టుకు రావడం ఖుషిని రన్నవుట్ కాకుండా కాపాడింది. దీనికి తోడు హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం రక్షణ కవచంలా నిలవడంతో కథలో కంటెంట్ కన్నా మ్యూజిక్ లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లీనమయ్యేలా చేసింది. ఈ విషయంలో శివ నిర్వాణ సెలక్షన్ ని మెచ్చుకోవలసిందే. నిజానికి లెనిన్ సత్యం, చదరంగం శ్రీనివాసరావుల మధ్య విబేధాలను ఇంకాస్త బెటర్ గా వాడుకుని దానికి విప్లవ్, ఆరాధ్యల మ్యారీడ్ లైఫ్ కి ముడిపెట్టి ఉంటే ఇంకా బాగుండేది. సహజంగా ఎక్కువ శాతం జంటలకు వచ్చే కామన్ సమస్యని ఎక్కువ ప్రొజెక్ట్ చేయడం వల్ల ఇలాంటివి సాధ్యపడలేదు

ఫ్యామిలీస్, యూత్ కి యునానిమస్ గా నచ్చే అంశాలన్నీ ఖుషిలో ఉన్నట్టు అనిపించినా మొత్తం అయ్యాక విందు భోజనం అంచనాలు ప్లేట్ మీల్స్ దగ్గరే ఆగిపోయి జస్ట్ ఆకలి తీర్చేసిన భావన కలుగుతుంది. మళ్ళీ మళ్ళీ చూడాలనో, ఖచ్చితంగా రికమండ్ చేయాలనో పూర్తి స్థాయిలో అనిపించదు. ఎంత ఫీల్ గుడ్ అయినా సరే క్రమం తప్పకుండా ఎంటర్ టైన్మెంట్ డోస్, మ్యూజికల్ ట్రీట్ జరుగుతూ ఉంటేనే ఇలాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ స్థాయికి వెళ్తాయి. శివ నిర్వాణ టేకాఫ్ సరిగానే చేసినా మధ్యలో కుదుపుల వల్ల ప్రయాణం అంత సాఫీగా జరగలేదు. అయినా సరే లక్ష్యాన్ని చేర్చారు కాబట్టి బాక్సాఫీస్ లెక్కల్లో పాస్ అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం.

నటీనటులు

ఫైనల్ గా విజయ్ దేవరకొండ సాధారణ ప్రేక్షకులు తనను ఎలా చూడాలనుకుంటున్నారో సరిగ్గా అదే పాత్రతో వచ్చి మెప్పించాడు. విప్లవ్ గా పర్ఫెక్ట్ ఛాయస్. ఇలాంటివి కొనసాగించాలి. సమంతాలో మునుపటి చలాకీతనం, గ్లో కాస్త తగ్గడం గమనించవచ్చు. ఉన్నంతలో బాగానే చేసింది కానీ ఎక్కువ సీరియస్ ఎక్స్ ప్రెషన్స్ ఇప్పించారు. మురళి శర్మ, సచిన్ కెడ్కర్ లు అచ్చులో ఒదిగినట్టు సరిపోయారు. జయరాం, రోహిణిల ఎపిసోడ్ అంత స్పెషల్ గా అనిపించదు. సీనియర్ నటి లక్ష్మి కనిపించే కాసింతసేపే ఉనికిని చాటారు. వెన్నెల కిషోర్ కన్నా రాహుల్ రామకృష్ణ ఎక్కువ నవ్వించాడు. శత్రు, శరణ్య, శరణ్య ప్రదీప్, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులంతా రొటీనే

సాంకేతిక వర్గం

హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం ఖుషికి ప్రధాన బలం. మూడు మెలోడీ పాటలు ఆడియో పరంగానే కాదు విజువల్ గానూ ఆహ్లాదకరంగా తీయడంతో బాగా వచ్చాయి. పెళ్లాల గురించి టీజింగ్ సాంగ్ కి ఏదైనా క్యాచీ ట్యూన్ పడితే అదీ ఛార్ట్ బస్టర్ అయ్యేది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూల్ గా సింక్ అయ్యింది. మురళి ఛాయాగ్రహణం కాశ్మీర్ అందాలను, సింపుల్ హైదరాబాదీ సోయగాలను బాగా చూపించింది. ఫ్రేమ్ వర్క్ నీట్ గా ఉండటం వల్ల రిచ్ నెస్ వచ్చింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఇంకొంచెం పదునుగా ఉంటే సాగతీత ఫీలింగ్ తగ్గేది. ఆర్ట్ డిపార్ట్ మెంట్ పనితనం బాగుంది. మైత్రి నిర్మాణ విలువల గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సింది ఏమీ లేదు. నో కాంప్రోమైజ్ అంతే.

ప్లస్ పాయింట్స్

సంగీతం
విజయ్ దేవరకొండ
సామ్ పాత్ర
క్లీన్ టేకింగ్

మైనస్ పాయింట్స్

బలంగా లేని భావోద్వేగాలు
నెమ్మదిగా సాగే కథనం
నిడివి
విప్లవ్ ఆరాధ్య కాంఫ్లిక్ట్

ఫినిషింగ్ టచ్ : చక్కెర తగ్గిన టేస్టీ కాఫీ

రేటింగ్ : 2.75/5

This post was last modified on September 1, 2023 5:06 pm

Share
Show comments
Published by
Satya
Tags: FeatureKushi

Recent Posts

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

5 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

6 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

8 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

10 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

11 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

11 hours ago