Movie Reviews

సమీక్ష – జైలర్

సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తమిళనాడులోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. రోబో తర్వాత మళ్ళీ అంత స్థాయి బ్లాక్ బస్టర్ దక్కలేదనే అసంతృప్తి తప్ప తలైవర్ ని విపరీతంగా ఇష్టపడే వాళ్లకు కొదవే లేదు. అందుకే జైలర్ ప్రమోషన్లు మొదలైనప్పటి నుంచి దీని మీద అన్ని చోట్లా ఆసక్తి నెలకొంది. దానికి తగ్గట్టే ట్రైలర్, కావాలయ్యా పాట కావాల్సిన ఊపుని తీసుకొచ్చాయి. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డుల వేట మొదలుపెట్టిన జైలర్ సాబ్ ఎప్పటి నుంచో కోరుకుంటున్న హిట్ ఇచ్చే రేంజ్ లో ఉన్నాడా?

కథ

పదవీ విరమణ చేసిన ముత్తువేల్ పాండియన్(రజినీకాంత్) కుటుంబంతో కలిసి ప్రశాంతంగా జీవితం గడుపుతుంటాడు. కొడుకు ఏసిపి అర్జున్(వసంత్ రవి) విగ్రహాల దొంగతనం చేసే ముఠాను పట్టుకునే క్రమంలో మాయమవుతాడు. దీంతో అతను చనిపోయాడని భావించిన ముత్తువేల్ తానే స్వయంగా వాళ్ళను వేటాడి చంపే పనిలో పడతాడు. ఈ క్రమంలో గ్యాంగ్ లీడర్ వర్మ(వినాయకన్)ని కవ్వించి బయటికి వచ్చేలా చేస్తాడు. అసలు ప్రమాదం ఇక్కడి నుంచి మొదలవుతుంది. తర్వాత జరిగేదే తెరమీదే చూడాలి.

విశ్లేషణ

దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కు డార్క్ కామెడీ మీద మంచి పట్టుంది. కోకోకోకిల, వరుణ్ డాక్టర్ లో ఆ టాలెంట్ చూసే విజయ్ బీస్ట్ అవకాశం ఇచ్చాడు. మూడో ఫలితం కొంచెం అటుఇటు అయినా టెక్నికల్ గా ఇతనికున్న పట్టు, కథ చెప్పడంలో నేర్పు ఏకంగా రజనీకాంత్ నే మెప్పించేలా చేసింది. జైలర్ సరిగ్గా సూపర్ స్టార్ వయసుకు, ఇమేజ్ కి వంద శాతం సరిపోయే పాత్ర. హీరోయిన్లతో రొమాన్స్, డ్యూయెట్లు పాడుకునే రెగ్యులర్ తరహాలో కాకుండా మనవడితో ఆడుకునే క్యారెక్టర్ ని బాగా డిజైన్ చేశాడు దిలీప్. జైలర్ గా దయా దాక్షిణ్యం లేదని చూపించే చిన్న ఫ్లాష్ బ్యాక్, అడ్డొస్తే నరకడం తప్ప మరో ఆలోచనే చేయని తరహాలో రాసుకున్నాడు.

ఎక్కువ సాగదీయకుండా రజని సింపుల్ ఇంట్రోతో మొదలుపెట్టి డైరెక్ట్ గా స్టోరీ లోకి వెళ్ళిపోయిన దిలీప్ ముత్తు చేసే హత్యలను, సస్పెన్స్ ముడివిప్పే క్రమాన్ని మరీ హై లెవెల్ లో కాకపోయినా ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచేలా బాగానే చూపించాడు. సహాయం కోసం కర్ణాటక వెళ్లి అక్కడ పలుకుబడి ఉన్న శివ రాజ్ కుమార్ ని కలుసుకోవడం, ముంబైలో దందా చేసే మోహన్ లాల్ ని రెండో సగంలో పరిచయం చేయడం ఇవన్నీ ఎలివేషన్లకు కొంతమేర ఉపయోగపడ్డాయి. స్టయిలిష్ కంటెంట్ మీద ఎక్కువ ఆధారపడ్డ దిలీప్ అంతే మోతాదులో సబ్ స్టన్స్ మీద దృష్టి పెట్టలేదు. దీని వల్ల బలం తక్కువగా ఉన్న సీన్లు కేవలం రజని, అనిరుద్ వల్ల గట్టెక్కాయి.

ముత్తుకు సంబంధించిన కీలక సంఘర్షణ సీరియస్ అయినప్పుడు దాన్ని మరీ కామెడీ చేయకూడదు. సెకండ్ హాఫ్ జైలు ఫ్లాష్ బ్యాక్ అయ్యాక వర్మ ముత్తుకి ఇచ్చిన టాస్క్ ఎప్పుడో కృష్ణ కాలం నాటిది. కనీసం దానికి రాసుకున్న ట్రీట్ మెంట్ హైవోల్టేజ్ తో ఉంటే బాషా రేంజ్ లో పేలేది. కానీ ఇక్కడ నెల్సన్ శ్రీను వైట్ల మార్కు ఎంటర్ టైన్మెంట్ మీద ఆధారపడి ఆ భారం మొత్తం సునీల్ మీదకు తోసేయడంతో ఓ మోస్తరు నవ్వులు తప్ప ఫ్యాన్స్ కి కావాల్సిన స్టఫ్ పూర్తిగా తగ్గిపోయింది. పైగా ఎంతో ఊహించుకున్న కావాలయ్య పాట, తమన్నా క్యామియో రెండూ సరిగా సింక్ కుదరక వృథా అయ్యాయి. లేదంటే టేకింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండి అదిరిపోయేది.

చాలాసార్లు చెప్పుకున్నట్టు డ్రామా బలంగా ఉంటేనే రజని స్థాయి హీరోలకు క్లాస్ మాస్ తేడా లేకుండా అన్ని వర్గాల వాళ్ళు కనెక్ట్ అవుతారు. నరసింహ, అరుణాచలం లాంటివి కేవలం ఆయన సిగరెట్ వెలిగించడం వల్లో లేదా కోటుని అటు ఇటు తిప్పి వేసుకోవడం వల్లో బ్లాక్ బస్టర్ కాలేదు. ఆయా దర్శకులు వాటిని కేవలం తాలింపుగా వాడుకున్నారు తప్పించి అసలైన పిండిని అంటే కథా కథనాలను బాగా రాసుకోవడం వల్ల విజయం సాధించాయి. జైలర్ లోనూ బోలెడు స్కోప్ ఉన్నా దిలీప్ లోని ఫిలిం మేకర్ ని అభిమాని డామినేట్ చేయడంతో పేటలో కార్తీక్ సుబ్బరాజ్ చేసిన పొరపాట్లు తానూ రిపీట్ చేశాడు. అందువల్లే అవుట్ ఫుట్ తేడా కొట్టింది.

రజనిని పిచ్చిగా అభిమానించే వాళ్లకు జైలర్ ఫుల్ మీల్స్ అనిపించవచ్చు. కానీ బాక్సాఫీస్ లెక్కల్లో అందరికీ నచ్చాలి కాబట్టి ఆ కోణంలో చూస్తే ఇది ఆకలిని సగమే తీరుస్తుంది. ప్రీ క్లైమాక్స్ ముందు నుంచి టైటిల్ కార్డు వరకు తిరిగి ట్రాక్ లో పడినా ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ రిపేర్ చేయలేని విధంగా ఉండటంతో సగం అసంతృప్తితోనే థియేటర్ నుంచి బయటికి వస్తాం. శివరాజ్ కుమార్, మోహన్ లాల్ లను విక్రమ్ లో రోలెక్స్ రేంజ్ లో ప్రెజెంట్ చేయబోయారు కానీ అది కొంత వరకే నెరవేరింది. ముఖ్యంగా కన్నడ స్టార్ ని పంచెకట్టు, చుట్టతో మమ అనిపించడం సరిగా కుదరలేదు. భారతీయుడు టైపులో మెయిన్ ట్విస్టుని ఏదో చేయబోయిన దిలీప్ ప్రాపర్ గా రాసుకోలేదు.

భావోద్వేగాలు లేనిదే నాటకం రక్తి కట్టదు. నెల్సన్ లాంటి న్యూ ఏజ్ ఫిలిం మేకర్స్ ఇది తెలుసుకోవాలి. ఎంతసేపూ బీజీఎమ్ మీద ఆధారపడి ఎలివేషన్లతో నెట్టుకొస్తామంటే కుదరదు. దళపతి క్లాసిక్ ఎందుకయ్యింది. ఈ ప్రశ్నను తరచు వేసుకుంటూ ఉండాలి. బీస్ట్ ఇచ్చిన చేదు అనుభవం పూర్తి పాఠాలు నేర్పించినట్టు లేదు. తమిళనాడులో జైలర్ పెద్ద రేంజ్ కు వెళ్లొచ్చు. మనకు నచ్చని పొన్నియిన్ సెల్వన్ కు అక్కడ వందల కోట్లు కురిపించారు. కాబట్టి అభిరుచులు, ఆడియన్స్ ఆలోచనల పద్ధతిలో చూసుకుంటే జైలర్ మన ప్రేక్షకులకు అతి కష్టం మీద పాస్ అవ్వొచ్చేమో అనిపిస్తుంది తప్ప మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రేంజ్ లో అయితే లేదు.

నటీనటులు

రజనీకాంత్ అసలైన స్టయిల్, స్వాగ్ ని జైలర్ లో కనులారా ఆస్వాదించవచ్చు. డెబ్భై రెండు వయసులో ఇంతగా అలరించడం చూస్తే రియల్ సూపర్ స్టార్ అనకుండా ఉండలేం. రమ్యకృష్ణ, మిర్నా మీనన్ కొన్ని సీన్లకే పరిమితం చేశారు. కీలకమైన కొడుకు పాత్రలో వసంత్ రవి కన్నా బెటర్ ఛాయస్ చూడాల్సింది. విలన్ వినాయకన్ కు జీవితాంతం చెప్పుకునే క్యారెక్టర్ దక్కింది. బక్కపలచని దేహంతో కొంచెం ఓవర్ చేస్తూ అంత బరువుని సరిగా మోయలేకపోయాడు.యోగిబాబు నవ్వులు కొంత వరకు వర్కౌట్ చేశారు. క్యాస్టింగ్ చాలా పెద్దదే ఉంది కానీ తెరనిండుగా ఉంటే రజని లేదా వినాయకన్ తప్ప ఇంకెవరు కనిపించరు కాబట్టి గుర్తు చేసుకోవడం కష్టమే

సాంకేతిక వర్గం

అనిరుద్ రవిచందర్ నేపధ్య సంగీతం ఐసియులో చేరాల్సిన జైలర్ ని ప్రాణం పోకుండా కాపాడింది. కావాలయ్యా పాట తప్ప మిగిలిన ఎమోషనల్ సాంగ్స్ బాలేవు. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం గొప్పగా ఉంది. తలైవాని ఇంత బాగా చూపించిన వాళ్ళలో టాప్ ప్లేస్ ని ఇవ్వొచ్చు. ఆర్ నిర్మల్ ఎడిటింగ్ నిడివి మీద సీరియస్ గా వర్క్ చేయలేదు. రెండు గంటల యాభై నిముషాలు డిమాండ్ చేసే కంటెంట్ కాదిది. కోతకు బోలెడు స్కోప్ ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ ని బాగానే డిజైన్ చేశారు. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పదేముంది. ఎంత కావాలో అంతకు మించే ఖర్చు పెట్టిన వైనం స్క్రీన్ మీద కనిపిస్తుంది. ప్రొడక్షన్ పరంగా ఫిర్యాదు లేదు.

ప్లస్ పాయింట్స్

రజనీకాంత్
నేపధ్య సంగీతం
యాక్షన్ బ్లాక్స్
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్

సెకండ్ హాఫ్
పండని ఎమోషన్స్
సూటవ్వని విలన్
తాతలనాటి దొంగతనం కాన్సెప్ట్

ఫినిషింగ్ టచ్ : ఫ్యాన్స్ స్టయిలర్

రేటింగ్ : 2.5/5

This post was last modified on August 10, 2023 4:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోడీ కోసం బాబు: ఎన్ని భ‌రిస్తున్నారంటే.. !

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్రమోడీతో ఉన్న గ్యాప్‌ను దాదాపు త‌గ్గించుకునే దిశ‌గా సీఎం చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా మోడీ…

46 minutes ago

కోహ్లీతో కొట్లాట.. యువ క్రికెటర్ ఏమన్నాడంటే..

ఆసీస్-భారత్ టెస్ట్ సిరీస్‌లో నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కాన్‌స్టాస్ మధ్య…

1 hour ago

వెన్నెల కిషోర్ దూరాన్ని అర్థం చేసుకోవచ్చు

ఇటీవలే విడుదలైన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ నిర్మాత చెప్పినట్టు పుష్ప 2 గ్రాస్ ని దాటేంత రేంజ్ లో ఆ…

1 hour ago

‘విజ‌న్-2020’ రూప‌శిల్పి బాబు.. కార్య‌శిల్పి మ‌న్మోహ‌న్‌.. !

ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీసుకువ‌చ్చిన 'విజ‌న్‌-2020' - అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న ఉమ్మ‌డి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో దీనికి…

2 hours ago

విజయ్ దేవరకొండ 12 వెనుక ఎన్నో లెక్కలు

హీరో హిట్లు ఫ్లాపు ట్రాక్ రికార్డు పక్కనపెడితే విజయ్ దేవరకొండ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా…

2 hours ago

ఏపీలో సీత‌క్క‌లు.. చంద్ర‌బాబు ఛాన్సిస్తారా ..!

తెలంగాణ మంత్రి ధ‌ర‌స‌రి సీత‌క్క‌.. ఫైర్‌.. ఫైర్‌బ్రాండ్‌! కొన్ని కొన్ని విష‌యాల్లో ఆమె చేసిన, చేస్తున్న కామెంట్లు కూడా ఆలోచింప‌జేస్తున్నాయి.…

4 hours ago