Movie Reviews

సమీక్ష – హిడింబ

ఒక చిన్న సినిమాకు అంచనాలు రేపడం పెద్ద కసరత్తు. అందులోనూ ఇమేజ్ లేని హీరోతో మార్కెటింగ్ చేయడం అంత సులభం కాదు. అయినా హిడింబ టీమ్ కంటెంట్ ని నమ్ముకుని ప్రమోషన్ల ద్వారా ఒక డిఫరెట్ థ్రిల్లర్ ఇవ్వబోతున్నామనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలుగజేసింది. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందిన హిడింబను అనిల్ సుంకర సమర్పించడంతో పబ్లిసిటీ, డిస్ట్రిబ్యూషన్ పరంగా హెల్ప్ అయ్యింది. రెండు రోజుల ముందే కొన్నిచోట్ల ప్రీమియర్లు కూడా వేశారు. మరి హిడింబ మెప్పించేలా ఉన్నాడా

కథ

నగరంలో వరసగా అదృశ్యమవుతున్న అమ్మాయిల కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న అభయ్(అశ్విన్)కు సహాయంగా ఉండటానికి కేరళ నుంచి వస్తుంది ఆద్య(నందిని శ్వేత). ఇద్దరు కలిసి విచారిస్తున్న క్రమంలో ఈ కేసుకు సంబంధించిన మూలాలు కేరళలో ఉన్నాయని తెలుసుకుని అక్కడికి వెళ్తారు. ఆద్య బాల్యంలో తండ్రి అదృశ్యం కావడానికి, ఇప్పుడీ మిస్టరీకి ముడి ఉందని ఈ కోణంలో వెతుకులాట మొదలుపెడతారు. అప్పుడే చరిత్రలో కలిసిపోయిన హిడింబ జాతి గురించి తెలుస్తుంది. ఈ దారుణాలుకు ఒడిగట్టిదెవరనేదే స్టోరీ

విశ్లేషణ

సాధారణంగా ఏ క్రైమ్ థ్రిల్లర్ కైనా బేసిక్ ప్లాట్ దాదాపుగా ఒకటే ఉంటుంది. అధిక శాతం దర్శకులు లేడీస్ మిస్సింగ్ నే ఎంచుకుంటారు. ఎందుకంటే హింసను గ్లోరిఫై చేసి తద్వారా ప్రేక్షకులను త్వరగా కనెక్ట్ చేసేలా చేయడం దీని ద్వారానే సాధ్యమవుతుంది. శైలేష్ కొలను హిట్ రెండు భాగాలూ ఈ థ్రెడ్ మీదే జరుగుతాయి. అయితే ఆ లైన్ మీదే గుడ్డిగా వెళ్ళిపోతే రొటీన్ అవుతుందని గుర్తించిన అనిల్ కన్నెగంటి ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని హిడింబ కాన్సెప్ట్ ని ఎంచుకున్నాడు. దానికి కావలసిన ప్రాధమిక సమాచారాన్ని, ఇంటరెస్టింగ్ గా మలచడానికి కావాల్సిన కాల్పనిక నేపధ్యాన్ని బాగానే సెట్ చేసుకున్నాడు.

ఆలోచన వరకు చాలా వైవిధ్యంగా అనిపించిన హిడింబ ట్రీట్ మెంట్ గా మారే క్రమంలో హెచ్చుతగ్గులకు గురైంది. ఫస్ట్ హాఫ్ లో ప్లాట్ ఎస్టాబ్లిష్ చేసిన తీరు రెగ్యులర్ గా అనిపించినా త్వరగానే అసలు బ్యాక్ డ్రాప్ ని పరిచయం పెంచడం ఆసక్తిని పెంచుతుంది. మొదలైన గంట లోపే కేసుని పరిష్కరించినట్టు చూపించి తిరిగి మళ్ళీ మొదటికే తెచ్చిన విధానం మరీ స్పెషల్ గా అనిపించలేదు. మధ్యలో అవసరం లేని హీరో హీరోయిన్ ప్రేమకథ, వాళ్ళ మధ్య రొమాంటిక్ సాంగ్ ఇవన్నీ ఫ్లోకి బ్రేక్ వేయడానికి తప్ప ఎందుకు ఉపయోగపడలేదు. నాన్ లీనియర్ తరహాలో రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంటర్వెల్ వరకు ఓ మోస్తరుగా టైం పాస్ చేయించింది.

క్యానిబల్స్ అంటే నరమాంసం తినే అడవి భక్షకులు. అలాంటి వాళ్ళు ఊళ్ళోకి వస్తే ఏమవుతుందనే పాయింటే బహుశా నిర్మాతని ఎగ్జైట్ చేసి ఉంటుంది. ఒకప్పుడు హాలీవుడ్ లో ఈ థీమ్ మీద చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులో కొన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ అరుదు. అయితే కేవలం దానికే కట్టుబడకుండా ఆడియన్స్ ని కాస్త డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇరికించిన అవయవాల వ్యాపారం చేసే హాస్పిటల్ ఎపిసోడ్ అంతగా కనెక్ట్ కాలేకపోయింది. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ మొదలుపెట్టాక దానికి ఎక్కువ సమయం తీసుకోవడం మైనస్ అయ్యింది. ఆధ్య తండ్రి ఎలా చనిపోయాడో ముందే ఊహించే ఛాన్స్ ఉన్నప్పుడు వీలైనంత త్వరగా విషయం చెప్పేయాలి.

అభయ్ హీరోయిజం చూపించేందుకే అన్నట్టు పెట్టిన ఫైట్లలో కాలాబండ తప్ప మిగిలినవి అవుట్ అఫ్ ది సింక్ వెళ్లిపోయాయి. ఏదో మాస్ కోసమన్నట్టు వాటిని ఇరికించడం అసలు ఉద్దేశాన్ని పక్కదారి పట్టించేసింది. పైగా చాలా కన్వీనియంట్ గా లాజిక్స్ ని పక్కన పెట్టేశాడు అనిల్. మనుషుల రక్తం తాగితే తప్ప ఉండలేని అడవి మనుషులకు మొరటుతనం తప్ప ఇంటెలిజెన్స్ ఉండదు. కానీ అసలు హంతకుడికి ఆ తెలివి తేటలు ఉన్నాయని ముందే చెబితే ఇబ్బంది ఉండదు. ఆలా కాకుండా అసలు ట్విస్టు కోసం ఎక్కడా క్లూసే లేవన్న రేంజ్ లో పోలీసులను నిస్సహాయులుగా చూపించడం అంతగా పండలేదు. హడావుడి చేశారు కానీ కుదరలేదు.

ఫైనల్ కిల్లర్ రివీల్ చేసే క్రమంలో క్లైమాక్స్ కు వెళ్లే క్రమాన్ని మునివేళ్ళ మీద నడిపించాలి. కానీ అనిల్ ఇక్కడ అక్కర్లేని ప్రహసనాలు ఎన్నో పెట్టేశారు. రాక్షసుడులో సాయిశ్రీనివాస్ పాత్ర ఏ ఫ్రేమ్ లోనూ అతిగా ప్రవర్తించడు. చాలా సెటిల్డ్ గా బాలన్స్డ్ గా ఉంటాడు. ఇక్కడా అలాంటి క్యారెక్టరైజేషన్లు పడాలి. అశ్విన్ ని అల్లు అర్జున్ రేంజ్ లో చూపిస్తే ఎలా. చివరిలో వచ్చే మలుపు షాకింగ్ గానే అనిపించినప్పటికీ అది కూడా సంతృప్తి కలిగించేలా సాగలేదు. దానికి ముందు ఉండాల్సిన ఎమోషన్ మోతాదు ప్రతి దశలోనూ జీరో అయిపోవడంతో ఆ క్యారెక్టర్ తాలూకు బాధ, ఆవేదన మనకు అందదు. ఫలితంగా అది ముగించిన విధానం కూడా అసంతృప్తితోనే బయటికి వెళ్లేలా చేసింది

నటీనటులు

అశ్విన్ దేహదారుఢ్యం బాగుంది. నటన పరంగా ఛాలెంజింగ్ అయితే అనిపించలేదు. కొన్ని బరువైన ఎక్స్ ప్రెషన్లు ఇవ్వడానికి ఇబ్బంది పడ్డాడు. నందితా శ్వేతాకు ఎక్కువ స్పేస్ దొరికింది. దానికి తగ్గట్టే అలవాటైన ఈజ్ తో చేసుకుంటూ పోయింది. మకరంద్ దేశ్ పాండేకు ఆయనకు సరిపడా పాత్రనే ఇచ్చారు కానీ మంచి బలిష్టమైన ఆర్టిస్టు పడి ఉంటే ఇంకా బాగా పేలేది. సంజయ్ స్వరూప్, శుభలేఖ సుధాకర్, కుంచె రఘు, శ్రీనివాసరెడ్డి తదితరులంతా ఒకటి రెండు సీన్లకే పరిమితం. దేవి ఫేమ్ సిజ్జు వీళ్లందరి కన్నా ఎక్కువ సేపు ఆద్య గతంలో కనిపిస్తాడు. స్పెషల్ ఏమీ కాదు. చిన్నా చితక ఆర్టిస్టులు ఇంకా ఉన్నారు కానీ అంతగా గుర్తుండే వాళ్లయితే లేరు

సాంకేతిక వర్గం

హిడింబకున్న ప్రధాన బలం సౌండ్ డిజైన్. మంచి డాల్బీ సిస్టమ్ ఉన్న థియేటర్లో దీన్ని ఆస్వాదించవచ్చు. వికాస్ బాదిసా సంగీతం పాటల పరంగా ఎలాంటి మేజిక్ చేయలేదు కానీ బిజిఎం వరకు మరీ నిరాశపరచకుండా చక్కగా సాగింది. రాజశేఖర్ ఛాయాగ్రహణంలో అనుభవం తొంగిచూసింది. విజువల్స్ లో ఉన్న డెప్త్ ని బాగా ప్రెజెంట్ చేశారు. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ నిడివిని వీలైనంత తగ్గించింది కానీ ఇంకొంత కోత జరిగి ఉంటే బాగుండేది. జాషువా-సతీష్ ఫైట్ కంపోజింగ్ పర్వాలేదు. కళ్యాణ్ చక్రవర్తి డైలాగులు సోసోనే. నిర్మాణ విలువల పరంగా చూస్తే మరీ కోట్ల కొద్దీ మంచి నీళ్లలా ఖర్చు పెట్టలేదు కానీ కాన్సెప్ట్ ని నమ్మిన నిర్మాతల అభిరుచిని మెచ్చుకోవచ్చు

ప్లస్ పాయింట్స్

విభిన్నమైన క్రైమ్
ఊహించని ట్విస్టు
సౌండ్ డిజైన్

మైనస్ పాయింట్స్

ఫ్లాష్ బ్యాక్ నిడివి
కన్విసింగ్ గా లేని క్లైమాక్స్
లవ్ ట్రాక్

ఫినిషింగ్ టచ్ : తగల్లేదు దెబ్బ

రేటింగ్ : 2.25/5

This post was last modified on July 20, 2023 3:57 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

ఎస్ఎస్ఎంబి 29 – అంతుచిక్కని రాజమౌళి సెలక్షన్

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ జనవరిలో మొదలవుతుందనే మాట…

43 minutes ago

అమరావతి రయ్.. రయ్.. బిట్స్.. లా వర్సిటీ

ఆంధ్రుల రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. 2014లో…

1 hour ago

వైసీపీకి ఇంతియాజ్ గుడ్ బై.. జ‌గ‌నే రీజ‌న్‌!

కార‌ణాలు లేవ‌ని పేర్కొంటూనే.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు మాజీ ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్‌. వైసీపీకి ఆయ‌న గుడ్ బై…

11 hours ago

డెడ్ బాడీ డోర్ డెలివ‌రీ.. ఆస్తి కోసం కుట్ర‌.. క్రైమ్ థ్రిల్ల‌ర్‌ను త‌ల‌ద‌న్నేలా!

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉండి మండ‌లంలో కొన్ని రోజుల కింద‌ట వెలుగు చూసిన డెడ్ బాడీ డోర్ డెలివ‌రీ…

13 hours ago

కీర్తి సురేష్…బ్యాడ్ లక్ బేబీ!

బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…

14 hours ago