Movie Reviews

సమీక్ష – సామజవరగమన

రెగ్యులర్ పంథాలో వెళ్లకుండా ప్రయోగాలు చేస్తాడని పేరున్న శ్రీవిష్ణుకి మంచి ఫిల్మోగ్రఫీ ఉంది. ఈ మధ్య కొన్ని వరస ఫ్లాపులు మార్కెట్ ని కొంత ప్రభావితం చేశాయేమో కానీ తన కొత్త సినిమా వస్తోందంటే యూత్ లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంటోంది. అయితే సామజవరగమన విషయంలో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా టార్గెట్ కావడంతో ప్రత్యేకంగా ప్రీమియర్లు వేసి, ప్రేక్షకులతో ఫీడ్ బ్యాక్ తీసుకుని దాన్నే ప్రమోషన్ కోసం వాడుకున్నారు.  రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ మెప్పించేలా సాగిందా

కథ

ఏషియన్ మల్టీప్లెక్సులో పని చేసే బాలు(శ్రీవిష్ణు)మధ్యతరగతి జీవి. డిగ్రీ పూర్తయితే కానీ కోట్ల ఆస్తి స్వంతం కాలేని తండ్రి(నరేష్)ని అది పాస్ చేయించడం కోసం నానా తంటాలు పడుతుంటాడు. ఈ క్రమంలోనే నాన్న క్లాస్ మేట్ సరయు(రెబ్బా మోనికా జాన్) వీళ్ళ ఇంటికే పేయింగ్ గెస్టుగా వస్తుంది. ఇద్దరూ ప్రేమలో పడే సమయంలో ఆ అమ్మాయికి సంబంధించిన ఒక కీలక ట్విస్టు బాలుని ఇరకాటంలో పడేస్తుంది. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిన పరిస్థితిలో నుంచి ఎలా బయటపడి పెళ్లి చేసుకున్నాడనేది అసలు స్టోరీ

విశ్లేషణ

జబర్దస్త్ జమానాలో థియేటర్ ఆడియన్స్ ని నవ్వించడం దర్శక రచయితలకు పెద్ద సవాల్ గా మారిపోయింది. ఆషామాషీ జోకులు వేశామా, నవ్వించడం కాదు నవ్వుల పాలయ్యే ప్రమాదంలో పడతాం. అయితే సెన్సిబుల్ కామెడీకి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. సిల్లీగా అనిపించే పాయింట్ తో రూపొందిన జాతిరత్నాలు అంత పెద్ద విజయం సాధించడానికి కారణం ఇదే. రామ్ అబ్బరాజులోనూ అలాంటి సెన్స్ ఉండటం సామజవరగమనకు అతి పెద్ద ప్లస్ పాయింట్. అతిశయోక్తులకు పోకుండా, ఆర్భాటంగా హాస్యం పండించాలని తాపత్రయ పడకుండా తాను రాసుకున్న థీమ్ లోని సందర్భాల నుంచి కామెడీని పిండుకోవడం ఇందులో బాగా వర్కౌట్ అయ్యింది.

హీరో ఫోకస్ తో నేరేషన్ లేకపోవడం సామజవరగమనను సామాన్య ప్రేక్షకులను త్వరగా కనెక్ట్ చేస్తుంది. ఒకదశ వరకు శ్రీవిష్ణు కన్నా నరేష్ డామినేషన్ ఎక్కువై ఎంజాయ్ చేస్తున్నా ఆ తలపే రాకుండా స్క్రీన్ ప్లేని మేనేజ్ చేసిన తీరు చాలా బాగా వచ్చింది. పదే పదే పరీక్షలో ఫెయిలయ్యే అరవై ఏళ్ళ స్టూడెంట్ గా ఇటీవలి కాలంలో ఆయనకు దక్కిన బెస్ట్ క్యారెక్టర్స్ లో ఇదే ఫస్టు. పాప్ కార్న్ టబ్బులు వెనక్కు ఇచ్చే సీన్లో, పార్టీలో పెళ్ళాంని కంట్రోల్ లో పెట్టుకోవడం గురించి చెప్పే డైలాగుతో మాములుగా చెలరేగిపోలేదు. ఎంత కఠినంగా సినిమా చూస్తున్నా సరే పెదాల మీద నవ్వు రాకుండా ఉండదు. అరగంట అయ్యాక బాలు సరయులు లైన్ లోకి వస్తారు.

దర్శకుడు రామ్ అబ్బరాజు చాలా తెలివిగా వర్తమానంలో ఉన్న ట్రెండింగ్ టాపిక్స్ వాడుకోవడం పేలాయి. కెజిఎఫ్, పొన్నియిన్ సెల్వన్ లను ఉదహరించిన తీరు ఘొల్లుమనేలా చేస్తుంది. ఎప్పుడైతే సరయు బాలు ప్రేమలో పడటం మొదలవుతుందో అక్కడి నుంచి ప్లాట్ వేరే దారిలోకి వెళ్లిపోయింది. ఇంటర్వెల్ వరకు మంచి ఫన్ టెంపో మెయింటైన్ చేసిన రామ్ అక్కడ ఇచ్చిన మలుపు చిన్న ఝలక్ ఇస్తుంది. ఇక్కడి దాకా జరిగిన ప్రహసనంలో ఏకంగా మూడు పాటలు పెట్టడం ఇబ్బంది పెట్టింది. నిజానికి క్యాచీ ట్యూన్స్ తో సాంగ్స్ బాగా ఉంటే ఇవి కూడా పాజిటివ్స్ లో తోడయ్యేవి. ఎలాగూ వినోదం పుష్కలంగా ఉంది కాబట్టి వీటి మీద పెద్దగా శ్రద్ధ పుట్టలేదేమో

సెకండ్ హాఫ్ మొదలయ్యాక రెట్టింపు అంచనాలతో కూర్చున్న ప్రేక్షకులను టైం పాస్ చేయించడంలో రామ్ అబ్బరాజు విఫలం కాలేదు కానీ అంతకు మించి డోస్ ని ఎక్స్ పెక్ట్ చేసిన ఆడియన్స్ కి కొంత మోతాదు తగ్గడం కొంత అసంతృప్తికి దారి తీసింది. బాలు సరయులకు రిలేషన్ షిప్ షాక్ తగిలాక కథ సింగల్ పాయింట్ మీద నడిచింది. దీంతో ఉపకథలకు ఎక్కువ ఆస్కారం లేకుండా లీడ్ పెయిర్ చుట్టూ ఉన్న పాత్రల కన్ఫ్యూజన్ తో నెట్టుకొచ్చారు. కుల పిచ్చి ఉన్న వాడిగా వెన్నెల కిషోర్ కొంత భారం పంచుకున్నా కొన్ని సీన్స్ రిపీటెడ్ గా అనిపిస్తాయి. ట్విస్టు బాగానే ఉన్నా దాని చుట్టూ అన్నేసి సీన్లు అల్లుకోవడం కొంత మైనస్ అయ్యిందనే చెప్పాలి

క్లీన్ కామెడీ అనిపించుకోవడంలో సామజవరగమన నిస్సందేహంగా సక్సెస్ అయ్యింది. ఎక్కడా బూతులు వాడలేదు. ఒక లిప్ లాక్ పెట్టారు కానీ మరీ అభ్యంతరపెట్టేలా అనిపించకపోవడం దర్శకుడి తెలివి. క్లైమాక్స్ ఎమోషన్లు ఇంకొంత బలంగా ఉండాల్సింది. రెండో సగం తడబాటు వల్ల సన్నివేశాల్లో ఫన్ తగ్గిపోవడంతో భావోద్వేగాలు అంతగా కిక్ ఇవ్వలేకపోయాయి. తండ్రిని పాస్ చేయించిన బాలు ఆ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకోవడం, అవమానించిన బాబాయ్ కుటుంబాల మధ్య విజేత చూపించడం లాంటివి పెట్టి ఉంటే ఖచ్చితంగా విజిల్స్ పడేవి. శ్రీవిష్ణు, నరేష్ ఇద్దరికీ ఎలివేషన్లు దక్కేవి. అయినా సరే సామజవరగమన శ్రుతులు గతి తప్పకుండా నడిచాయి

నటీనటులు

శ్రీవిష్ణు తిరిగి పాత స్కూల్ కు వచ్చేశాడు. తనదైన టైమింగ్ తో బాలుగా చాలా ఈజ్ తో చేసుకుంటూ పోయాడు. ఇప్పటి తరం అమ్మాయిల గురించి క్లాసు పీకే సీన్ లో చాంతాడంత డైలాగుని సింగల్ టేక్ తో చెప్పడం అబ్బాయిలతో ఈలలు వేయించింది. రెబ్బా మోనికా జాన్ పర్ఫెక్ట్ ఛాయస్. చలాకీగా నటించింది. నరేష్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే పేకాడేశారు. ఈయన తప్ప ఎవరూ ఇంత పర్ఫెక్ట్ గా చేయలేరు. శ్రీకాంత్ అయ్యంగార్ ఒక దశ దాటాక కొంత ఫ్రస్ట్రేట్ చేసిన మాట వాస్తవం. సుదర్శన్ నవ్వులకు పనికొచ్చాడు. వెన్నెల కిషోర్ టేకాఫ్ బాగుంది కానీ తర్వాత రిపేర్లు అవసరమయ్యాయి. సపోర్టింగ్ ఆర్టిస్టుల లిస్టు పెద్దదే ఉంది కానీ ఎవరూ మైనస్ కాదు.

సాంకేతిక వర్గం

మంచి మెలోడీ ఆల్బమ్స్ తో పేరెన్నికగన్న గోపి సుందర్ పనితనం నిరాశపరుస్తుంది. ఏ పాటా క్యాచీగా లేదు. ఒక సాంగ్ మంచి లొకేషన్లలో తీసినా కేవలం ఆడియో కారణంగా రీచ్ తగ్గించేసింది. బీజీఎమ్ పర్వాలేదు. రామ్ రెడ్డి ఛాయాగ్రహణం చాలా పరిమితుల మధ్య క్వాలిటీని ఇచ్చింది. ఫ్రేమ్స్ బాగా పడ్డాయి. ఛోటా కె ప్రసాద్ సీనియారిటీ ఎడిటింగ్ పరంగా హెల్ప్ అయ్యింది కానీ పాటలు, సెకండ్ లెన్త్ మీద దర్శకుడికి కొన్ని ఇన్ ఫుట్స్ ఇవ్వాల్సింది. నందు సంభాషణలు ట్రెండీగా, నీట్ గా ఉన్నాయి. మంచి మార్కులు కొట్టేశాడు. ఏకె ఎంటర్ టైన్మెంట్స్, హాస్య మూవీస్ నిర్మాణ విలువలు రిస్కీ ప్రాజెక్టు కాదు కాబట్టి డీసెంట్ గా సాగాయి.

ప్లస్ పాయింట్స్

శ్రీవిష్ణు నటన
నరేష్ పాత్ర / పెర్ఫార్మన్స్
కామెడీ
క్యాస్టింగ్

మైనస్ పాయింట్స్

పాటలు
రెండో సగం తడబాటు
ట్విస్టు మీద రిపీట్ సన్నివేశాలు

ఫినిషింగ్ టచ్ : ‘సరదా’వరగమన

రేటింగ్ : 3/5 

This post was last modified on June 29, 2023 9:54 am

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

కీర్తి సురేష్…బ్యాడ్ లక్ బేబీ!

బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…

13 hours ago

కెజిఎఫ్ హీరోయిన్ దశ తిరుగుతోంది

ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…

14 hours ago

సితార & హారికా హాసిని – 18 సినిమాల జాతర

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…

16 hours ago

యువ ఎమ్మెల్యే దూకుడు: ప్ర‌చారం కాదు.. ప‌నిచేస్తున్నారు ..!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న గాలి భానుప్ర‌కాష్ నాయుడు.. దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…

17 hours ago

వైఎస్’ల వార‌స‌త్వం కోసం జ‌గ‌న్ ఆరాటం!

ఈ ఏడాది జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ.. త‌ర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఓ ప్ర‌శ్న…

18 hours ago