Movie Reviews

సమీక్ష – అమిగోస్

అతి పెద్ద స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కమర్షియల్ జానర్ కి కట్టుబడకుండా విభిన్న ప్రయత్నాలు చేస్తున్న కళ్యాణ్ రామ్ కు కొంత గ్యాప్ తర్వాత వచ్చిన బింబిసార బ్లాక్ బస్టర్ సక్సెస్ మంచి ఊపునిచ్చింది. నెంబర్ కన్నా క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఈ నందమూరి హీరో మొదటిసారి ట్రిపుల్ రోల్ చేసిన సినిమా అమిగోస్. ఇంగ్లీష్ టైటిల్ అయినప్పటికీ ప్రమోషన్లు వగైరా ఆసక్తికరంగా అనిపించడంతో అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకూ దీని మీద ఆసక్తి కలిగింది. చెప్పుకోదగ్గ పోటీ లేకుండా సోలో బెనిఫిట్ తో బరిలో దిగిన అమిగోస్ మీద అంచనాలైతే ఉన్నాయి. మైత్రికి 2023 రెండో నెలలోనే మూడో సినిమా ఇది

హైదరాబాద్ లో బిజినెస్ చేసుకునే సిద్దార్థ్(కళ్యాణ్ రామ్) డాప్లర్ గ్యాంగ్ కు సంబంధించిన వెబ్ సైట్ ద్వారా అచ్చం తనలాగే మరో ఇద్దరు ఉన్నారని తెలుసుకుంటాడు. కర్ణాటక నుంచి మంజునాథ, కోల్కతా నుంచి మైకేల్ ఈ రూపంలో కనెక్ట్ అవుతారు. ముగ్గురు కలిసి గోవాలో మంచి సమయం గడుపుతారు. ఈలోగా ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఐఏ బృందం ద్వారా మైఖేల్ అసలు రంగు బయటపడుతుంది. దీంతో మిగిలిన ఇద్దరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అక్కడి నుంచి మొదలవుతుంది తెరమీద చూడాల్సిన అసలైన ఆట.

వైవిధ్యమైన సినిమాలు రావాలి. అప్పుడే ప్రేక్షకులూ మార్పు ఫీలై కొత్త వాటిని ప్రోత్సహిస్తారు. కమర్షియల్ చక్రంలో ఇరుక్కున్న పెద్ద స్టార్లు అలాంటి రిస్కుల జోలికి పోరు. వాళ్ళ మీద అంచనాలు ఏ మాత్రం మిస్ మ్యాచ్ అయినా నిర్మాతకు నష్టం, అభిమానులకు మనస్థాపం తప్పదు. అందుకే కళ్యాణ్ రామ్ లాంటి హీరోలు ప్రయోగాలకు మొగ్గు చూపడం మెచ్చుకోదగ్గ విషయం. దర్శకుడు రాజేంద్ర రెడ్డి తీసుకున్న పాయింట్ ఖచ్చితంగా యూనీకే. ఎక్కడినుంచైనా స్ఫూర్తి పొందడా లేదా అనేది పక్కన పెడితే ఈ కాన్సెప్ట్ తో గతంలో ఎవరూ చేయలేదన్న అవకాశాన్ని వాడుకుని అమిగోస్ లైన్ రాసుకున్నాడు. డాప్లర్ గ్యాంగ్ సగటు జనానికి అవగాహన లేని విషయం.

దాన్నే కథా వస్తువుగా తీసుకోవడం అమిగోస్ లోని ప్లస్ పాయింట్. సాధారణంగా డ్యూయల్ రోల్ సినిమాల్లో ఒక పాత్రకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో రెండో క్యారెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోవడం రాముడు భీముడు నుంచి రౌడీ అల్లుడు వరకు, తిరిగి అక్కడ నుంచి జై లవకుశ దాకా చాలాసార్లు జరిగిందే. కాకపోతే వాటిలో ఉన్న బలమైన ఎంటర్ టైనింగ్ అంశాలు సక్సెస్ మెట్టుపైన కూర్చోబెట్టాయి. క్లాస్ మాస్ అందరికీ కావాల్సిన మసాలాలు కొలత వేసి మరీ కూర్చినవి. అయితే అమిగోస్ లో ఆ ఛాన్స్ లేదు. రాజేంద్ర దీన్ని నవ్విస్తూ చెప్పాలనో వినోదాన్ని పంచుతూ నెరేట్ చేయాలనో చూడలేదు. సీరియస్ గా స్టోరీకి కట్టుబడాలనే సూత్రాన్ని ఫాలో అయ్యాడు

ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంటర్వెల్ బ్లాక్ ముందు వరకు పాత్రలను రిజిస్టర్ చేయడానికి ఎక్కువ సమయం ఖర్చు పెట్టిన రాజేంద్ర అసలు సరుకంతా రెండో సగంలో పెట్టాడు. అయితే పరమ దుర్మార్గుడైన మైఖేల్ అలియాస్ బిపిన్ ని అంత క్రూరంగా రిజిస్టర్ చేసినప్పుడు అంతకన్నా రెట్టింపు మోతాదులో సిద్దార్థ్ లేదా మంజునాథ్ ఇద్దరిలో ఒకరైనా అతన్ని అడ్డుకునే క్రమాన్ని ఎలివేట్ చేసే రేంజ్ లో చూపించాలి. కానీ ఎంతసేపూ బిపిన్ కర్కోటకుడిగా వరస హత్యలతో పదే పదే భయపెడతాడు కానీ చూసేవాళ్ళు ఎక్కువగా ఆశలు పెట్టుకున్న సిద్దార్థ్, మంజునాథ్ లు ప్రీ క్లైమాక్స్ ముందు వరకు నిస్సహాయంగా కనిపించడం మైనస్ అయ్యింది.

ట్రైలర్ లోనే స్టోరీ తాలూకు గుట్టుని దాదాపుగా చెప్పేసిన టీమ్ మంచి పని చేసింది. ముందే ప్రిపేరవ్వడానికి ఉపయోగపడింది. బిపిన్ ఫ్లాష్ బ్యాక్ కోసం కొంత సమయం కేటాయించిన రాజేంద్ర ఆ తర్వాత ఆడియన్స్ థ్రిల్ అయ్యేలా ఎలాంటి హై ఎపిసోడ్స్ రాసుకోలేదు. అలా అని బోర్ కొడుతుందని కాదు. చూస్తున్నంత సేపు సీన్లు అలా వెళ్లిపోతుంటాయి కానీ అరె ఇక్కడ భలే మలుపు తిప్పారేనన్న భావన కలగదు. ముగ్గురి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ మొదలైనప్పుడు విలన్ ఎంత తెలివిమంతుడైనా సరే ఒక దశ దాటాక హీరో ఖచ్చితంగా అంతకు మించిన ఇంటెలిజెన్స్ తో కేక అనిపించాలి. అది జరగదు

జానర్ ఏదైనా సరే సినిమాటిక్ లిబర్టీని ఎంతైనా తీసుకోవచ్చు కానీ అది వీలైనంత రియాలిటీకి దగ్గరగా ఉండాలి. ఎన్ఐఏ వ్యవహారం రానురాను మరీ సింపుల్ గా తేల్చేస్తున్నారు. అమిగోస్ లో విలనూ హీరో ఇద్దరూ ఒకరే కావడం ఇదేం మొదటిసారి కాదు. స్వర్గీయ ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణ, తారక్ అందరూ ట్రై చేశారు. వాటిలో ఎక్స్ ట్రా ప్రతినాయకుడు మరొకరు ఉంటారు. కానీ అమిగోస్ అంతా కళ్యాణ్ రామే కావడం, దానికి తోడు స్క్రీన్ డామినేషన్ అంతా మైఖేల్ వైపే జరగడంతో సగటు కామన్ ఆడియన్స్ ఇంతకీ హీరో ఏం చేస్తున్నాడనే ప్రశ్నకు వెళ్ళిపోతారు. సమాధానం దొరికే లోపు క్లైమాక్స్ వచ్చేస్తుంది. అది కూడా సింపుల్ గా కాదు సుదీర్ఘంగా

నటుడిగా కళ్యాణ్ రామ్ ని ఇది మరో మెట్టు ఎక్కిస్తుంది. విపరీతమైన ఛాలెంజులు లేకపోయినా సంబంధం లేని మూడు షేడ్స్ ని పర్ఫెక్ట్ గా ఎక్స్ ప్రెస్ చేయడం ఒక కళ. బిపిన్ పాత్రే ప్రాధాన్యం దక్కించుకోవడంతో ఆ కోణంలో చూస్తే దానికి కావాల్సిన సీరియస్ నెస్, నెగటివ్ యాంగిల్ ని బాగా పండించాడు. ఆశికా రంగనాథ్ క్యూట్ గా ఉంది. నటన ఓకే. సెకండ్ హాఫ్ లో పెద్దగా కనిపించదు. బ్రహ్మాజీ కాసిన్ని నవ్వులకు ఉపయోగపడ్డారు. హీరో తల్లి తండ్రులు జయ ప్రకాష్,కళ్యాణి నటరాజన్, చెల్లిగా ప్రణవిలవి రెగ్యులర్ పాత్రలే. కేవలం ఒక్క సీన్ కి సత్యం రాజేష్, సప్తగిరి లాంటి నోటెడ్ ఆర్టిస్టులను తీసుకోవడం మైత్రి ప్రొడక్షన్ వల్లే

సంగీత దర్శకుడు గిబ్రాన్ నేపధ్య సంగీతంలో సౌండ్ మొదట్లో చక్కగానే అనిపించినా ముందుకెళ్లే కొద్దీ థ్రిల్లర్ కన్నా హారర్ తరహా సినిమా అన్న రీతిలో బీజీఎమ్ లో బాస్ పెంచేయడం ఇబ్బంది పెట్టింది. హోరు పెరిగింది. పాటలు ఎక్కువ పెట్టకపోవడం రిలీఫ్. ఎన్నో రాత్రులు రీమిక్స్ యూట్యూబ్ లోనే ఫుల్ వెర్షన్ పెట్టేశారు కాబట్టి స్పెషల్ ఎగ్జైట్ మెంట్ ఉండదు. సౌందర్ రాజన్ ఛాయాగ్రహణం బాగుంది. ముగ్గురిని చూపించేది సిజి ఎఫెక్టే అయినా ఆ ఫ్రేమ్స్ ని బాగా ప్రెజెంట్ చేశారు. తమ్మిరాజు ఎడిటింగ్ సెకండ్ హాఫ్ ని కొంత తగ్గించాల్సింది. మైత్రి నిర్మాణం గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. నమ్మేస్తే ఖర్చు పెట్టేస్తారు.

ప్లస్ పాయింట్స్

కళ్యాణ్ రామ్
డాప్లర్ గ్యాంగ్ కాన్సెప్ట్
కొన్ని ట్విస్టులు

మైనస్ పాయింట్స్

బిపిన్ పాత్ర ఆధిపత్యం
ఊహించే కథనం
ప్రీ క్లైమాక్స్ ల్యాగ్
ఎమోషనల్ కనెక్షన్

ఫినిషింగ్ టచ్ – పాయింట్ ఓకే ప్రెజెంటేషన్ వీకే

రేటింగ్ : 2.5/5

This post was last modified on February 10, 2023 3:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కాళేశ్వరం వివాదం.. కీలక వివరాలతో వచ్చిన వి.ప్రకాశ్

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…

54 minutes ago

ప్రాణాలు కాపాడుకుందామని రైలు నుంచి దూకితే.. మరో రైలు గుద్దేసింది

బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…

1 hour ago

ఆ సినిమాల నుంచి నన్ను తీసేశారు – అక్షయ్

బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…

2 hours ago

తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ

ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…

2 hours ago

ఎంపీలో ఘోరం!… శోభనానికి ముందు కన్యత్వ పరీక్ష!

దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…

2 hours ago

‘సిండికేట్’ : ఆర్జీవీ పాపాలను కడగనుందా?

రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…

2 hours ago