Movie Reviews

సమీక్ష – కోబ్రా

క్లిష్టమైన కథ..అంతకన్నా సంక్లిష్టమైన స్క్రీన్ ప్లే తో సినిమాగా మారిస్తే ఎలా వుంటుంది? ఒక వైవిధ్యం కాదు..ఒక లోకం కాదు..బోలెడన్ని కలిపి ఒకేసారి అందిస్తే ఎలా వుంటుంది…అచ్చం కోబ్రా సినిమాలా వుంటుంది. హీరో విక్రమ్ కు మామూలు కథలు నచ్చవు. తన లోని నటుడిని ఎలివేట్ చేసే కథలు కావాలి. ఆ కథల్లో చిత్రమైన గెటప్ లు వుండాలి. పాపం, వాటి కోసం ప్రాణం పెట్టి పని చేస్తాడు. కానీ ఇక్కడ ఒక్కటే సమస్య..ప్రేక్షకుడి మేథకు పదును పెట్టే రేంజ్ కథలు, కామన్ ఆడియన్స్ ను కంగారుపెట్టే స్క్రీన్ ప్లే లు కలిసి సినిమాను ఎక్కడికో బదులు ఇంకెక్కడికో తీసుకెళ్లిపోతాయి. ఈవారం విడుదలైన కోబ్రా సినిమా ఇలాంటి వ్యవహారానికి పక్కా ఉదాహరణగా నిలుస్తుంది.

సినిమా అంతా చూసేసాక బాగుంది అనాలా? బాగా లేదు అనాలా? లెంగ్త్ ఎక్కువైంది అనాలా? తగ్గిస్తే బాగుండేది అనాలా? ఇలా అనేక సందేహాలు ముసురుకుంటాయి. అంత సులువుగా చెత్త సినిమా లేదా బాగాలేని సినిమా అని డిసైడ్ అయిపోవడానికి చాన్స్ ఇవ్వదు. అలా అని చూడండి అని సిఫార్సు చేయనివ్వదు. అదో చిత్రమైన వ్యవహారం.

కోబ్రా సినిమాలో పాజిటివ్ పాయింట్లు చాలానే వున్నాయి. భారీ చిత్రీకరణ, భారీ యాక్షన్ సీన్లు, విక్రమ్ నటన, నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ ఇంకా..ఇంకా… కానీ మైనస్ పాయింట్లు కూడా తూకంలో సిద్దంగా వున్నాయి. తొలిసగం చూసేసరికే పూర్తి సినిమా చూసినంత ఫీలింగ్. మలిసగం చూస్తుంటే ‘మనకేదో అర్థం కావడం లేదు కదా’ అనే ఆలోచన. కథకు మరీ ఇంత డిటైలింగ్ అవసరమా? అనే అనుమానం ఇవన్నీ మైనస్ లే.

కోబ్రా సినిమా కథ టక్కున చెప్పేసేది కాదు..అలా అని వివరంగా చెప్పకూడదు. ఎందుకంటే కథలో కీలకమైన పాయింట్లు బయట పెడితే ఆ కాస్త ఆసక్తి కూడా పక్కకు పోతుంది. సింపుల్ గా చెప్పుకోవాలంటే మాది అనే లెక్కల ప్రొఫెసర్ చెన్నయ్ లో వుంటాడు. రకరకాల వేషాల్లో రెండు మూడు హై ప్రొఫైల్ కిరాయి హత్యలు చేస్తాడు. వాటిని పరిశోధించడానికి ఇంటర్ పోల్ రంగంలోకి దిగుతుంది. క్రిమినాలజీ..మ్యాథ్స్ ను మిక్స్ చేసి పరిశీలించే ఓ స్టూడెంట్ వారికి సాయపడుతుంది. దాదాపు మాది దొరికేసాడు అనుకునే సరికి ఓ పేద్ద ట్విస్ట్. ఆ ట్విస్ట్ తో పాటు ఇంకా అనేకానేక అడిషనల్ వ్యవహారాలు..ఇవన్నీ కలిసి కోబ్రా సినిమా.

కోబ్రా అన్న టైటిల్ కు సినిమాలో పాత్రలకు సంబంధం లేదు. వరుసగా జరుగుతున్న హై ప్రొఫైల్ హత్యల్లో మ్యాధమెటిక్స్ ఫార్ములాలు కూడా దాగి వున్నాయి అని డీకోడ్ చేసి, ఆ ప్రాజెక్టుకు కోబ్రా అనే పేరు పెట్టుకుంటుంది క్రిమినాలజీ స్టూడెంట్. కోబ్రా అన్న టైటిల్ అంత వరకే. సినిమా చూసిన తరువాత కోబ్రా టైటిల్ లోగో డీకోడ్ చేసుకుంటే..అప్పుడు ఆ లోగోలోనే కొంత కథ దాచారు కదా అనిపిస్తుంది.

సినిమా తొలిసగం మాంచి గ్రాండియర్ గా ప్రారంభం అవుతుంది. ప్రపంచంలోని పలు లోకేషన్లలో తీసిన భారీ సీన్లు ఆకట్టుకుంటాయి. సినిమా ముందుకు వెళ్తున్న కోద్ది ఫరవాలేదు ఓకె అని అనిపిస్తూ వుంటుంది. హీరో లవ్ ట్రాక్ మాత్రం కాస్త తగ్గించుకోవచ్చు కదా అని కూడా అనుకుంటాం. తొలిసగంలోలోనే మూడు హత్యలు…లవ్ ట్రాక్…హీరోకి వున్న మానసిక సమస్యను ఎలివేట్ చేసే సీన్లు అవీ కలిసి సినిమా నిడివి కాస్త పెంచేసాయి. తొలిసగం అయ్యేుసరికే చాలా పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ భారంతోనే మలిసగంలోకి వెళ్తాడు ప్రేక్షకుడు.

మలిసగంలో కేవలం మ్యాధ్స్ ..మర్డర్లు మాత్రమే కాదు. ఇంకా చాలా వుంది వ్యవహారం అని అర్థం అవుతుంది. హీరోకి వున్న ఫ్లాష్ బ్యాక్. హీరోకి వున్న వెల్లడి చేయకూడని అనుబంధాలు, హీరో ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ లుక్ కోసం వేరే నటుడిని వాడడం, ఇలా ఒకటి కాదు, రెండు కాదు. సవాలక్ష ఎలిమెంట్లు వచ్చి జాయిన్ అవుతాయి. హీరోకి వున్న సమస్య విషయంలో ఎప్పుడూ లేనంతగాగా డైరక్టర్ డిటైలింగ్ వర్క్ చేయడం అన్నది ప్రేక్షకుడిని దాదాపు పిచ్చేక్కించేస్తుంది. ఒక పక్క విక్రమ్ నటన, భారీ యాక్షన్ ఎపిసోడ్ లు చూడబుద్దవుతాయి. డైరక్టర్ అతి అనే అతిడిటైలింగ్ చూస్తే ఇదంతా అవసరమా అనిపిస్తుంది. అన్నింటి కన్నా కీలకమైన (వెల్లడి చేయలేని) ఓ విషయంలో ప్రేక్షకుడు స్క్రీన్ మీద ఏం జరుగుతోందో అర్థం కాక కిందా మీదా అయిపోతాడు. అలాంటి టైమ్ లో ఇచ్చీ ఇవ్వనట్లు క్లారిటీ ఇస్తాడు దర్శకుడు. అప్పుడు, ఓహో ఇదా సంగతి అని అనుకోవాల్సి వస్తుంది.

మొత్తం మీద దర్శకుడి మేధావితనం ఎక్కువై…దాని వల్ల డిటైలింగ్ ఎక్కువై…తద్వారా సినిమా నిడివి ఎక్కువై..తద్వారా ప్రేక్షకుడికి కాస్త అయోమయం ఎక్కువై, కోబ్రా సినిమా విజయానికి దూరం జరిగింది.

ఇలాంటి సినిమాలో విక్రమ్ తన నట విశ్వరూపం చూపించాడు. మిగిలిన వారు ఓకె. టెక్నికల్ గా సినిమా చాలా భారీగా వుంది. సినిమాటోగ్రఫీ, సంగీతం అన్నీ బాగున్నాయి. నిడివి తగ్గించి వుంటే కాస్త జనానికి చేరువగా వుండేది సినిమా.

ప్లస్ పాయింట్లు

విక్రమ్ నటన

యాక్షన్ సీన్లు

సాంకేతిక విలువలు

మైనస్ పాయింట్లు

స్క్రీన్ ప్లే

డిటైలింగ్

నిడివి

ఫినిషింగ్ టచ్ : కోబ్రా…అంటే భయమే కదా

Rating : 2/5

This post was last modified on August 31, 2022 7:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరణ్ కి పోటీగా సోనూసూద్ – చిరంజీవి రియాక్షన్

గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…

46 minutes ago

జపాన్ వెళ్తున్న దేవర….రచ్చ గెలుస్తాడా ?

సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…

2 hours ago

స్మార్ట్ ప్రమోషన్లతో వెంకటేష్ ముందంజ!!

బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…

3 hours ago

అల్లు అర్జున్ పై నాకెందుకు కోపం? : సిఎం రేవంత్!

టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…

6 hours ago

సత్యం సుందరం దర్శకుడి వింత అనుభవం!

ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…

6 hours ago

ఆ రోజు మాట్లాడతా – జానీ మాస్టర్!

కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…

7 hours ago