కామెడీ సినిమా తీయడం వేరు…తియ్యాలనుకోవడం వేరు. ఎఫ్ 2..ఎఫ్ 3 సినిమాలు రెండింటికీ వున్న బేసిక్ తేడా అదే. ఎఫ్ 2 సినిమా నవ్వుల సెలయేరు అయితే ఎఫ్ 3 హడావుడి జలపాతం. దర్శకుడు అనిల్ రావిపూడి..నిర్మాత దిల్ రాజు కలిసి ఎఫ్ 2 మ్యాజిక్ ను రీ క్రియేట్ చేయాలనుకున్నారు. మ్యాజిక్ ను రీక్రియేట్ చేయడం అంత వీజీ కాదు. కానీ ఈ ఫీట్ లో ఈ ఇద్దరు మరో విధంగా సక్సెస్ అయ్యారు. అది ఏ విధంగా అంటే సమ్మర్ టైమ్ లో ఓ ఫ్యామిలీ కామెడీ సినిమాను అందించడం ద్వారా.
ఎఫ్ 2 లో ప్రేక్షకులకు పరిచయం అయిన క్యారెక్టర్లను తీసుకుని, ఫ్రెష్ గా కథ అల్లి, దానికి సరిపడా కొత్త క్యారెక్టర్లను తీసుకుని అందించిన సినిమా ఎఫ్ 3. ప్రేక్షకుడు ముందుగా ప్రిపేర్ కావాల్సింది ఏమిటంటే ఈ రెండు సినిమాలకు అస్సలు సంబంధం లేదు. కామెడీ సినిమాలో లాజిక్కులు, కథ వెదక్కూడదు. అనిల్ రావిపూడి ఎఫ్ 3 కోసం పెద్దగా కథ రాసుకోలేదు. డబ్బు కోసం కిందా మీదా అయిపోయే కొన్ని క్యారెక్టర్లు…బాగా డబ్బుండి..వారసులు లేని ఓ ఆసామీ. ఈ క్యారెక్టర్లు అన్నీ నేనంటే నేనే వారసుడు అంటూ ఆ ఇంట చేరి రచ్చ చేయడం. చివరకు ఏం జరిగింది? అన్నది కథ.
సినిమాకు ఎఫ్ 2 ఛాయలు పాత్రల ద్వారా వుంటాయి తప్ప కథకు సంబంధం లేదు. ఏ సీన్ కు ఆ సీన్ ఓ స్కిట్ అనుకోవాల్సిందే. సినిమా తొలిసగం స్క్రీన్ ప్లే కూడా అలాగే వుంటుంది. ఇద్దరు హీరోలు, హీరోయిన్లు, వాళ్ల ఫ్యామిలీలు, వాళ్ల మధ్య జరిగే ఫన్ మ్యాజిక్ లతో ఫస్ట్ హాఫ్ ఓకె అనిపించేసుకుంటుంది. తొలిసగం మొత్తం నవ్వులు పండకపోయినా, చాలా వరకు ఫరవాలేదు అనే భావన కలుగుతుంది. అక్కడ కూడా ఏ స్కిట్ కు ఆ స్కిట్ అన్నట్లే. ఒక స్కిట్ కు మరో స్కిట్ కు లింక్ వుండదు. కానీ ఫన్ వుండడం వల్ల పాస్ మార్కులు లభించేస్తాయి.
సినిమా మలిసగం వచ్చేసరికి రెండు సమస్యలు. ద్వితీయార్థం మొత్తాన్ని ఒకే భవంతిలో తీయాల్సి రావడం, రెండు ప్రతి ఫ్రేమ్ లో దాదాపు డజనకు పైగా ఆర్టిస్ట్ లు సదా కనిపిస్తూ వుండడం. తొలిసగంలో వెంకీ, వరుణ్, ఆలీ, మెహరీన్ ఇలా విడివిడిగా పరిచయం చేసుకుంటూ వచ్చారు. ఒక్కొక్కరి మీద ఒక్కో స్కిట్ రన్ చేసారు. అందువల్ల వాటిని ఆస్వాదించడానికి వీలవుతుంది. కానీ మలి సగానికి వచ్చే సరికి ప్రతి ఫ్రేమ్ లో దాదాపు డజను మంది నటులు స్క్రీన్ మీద వుండాల్సి రావడంతో ఒకరిద్దరికి తప్ప మిగిలిన వారికి న్యాయం జరగదు. మెహరీన్, ప్రగతి, సునీల్, వై విజయ, అన్నపూర్ణ, ఇలా చాలా మంది ప్రెజెన్స్ తప్ప ప్రెజెంటేషన్ వుండదు. పైగా ద్వితీయార్ణంలో అనిల్ రావిపూడి పెన్ పవర్ కూడా అంతగా వర్కవుట్ కాలేదు. అక్కడక్కడ ఫన్ పండిన తరువాత సినిమా క్లయిమాక్స్ కు చేరుకుంటుంది.
క్లయిమాక్స్ మొత్తం ఈవీవీ సత్యనారాయణ సినిమాలను, భీమినేని సుడిగాడు సినిమాను గుర్తుకు తెస్తుంది. ఆ స్టయిల్ ను ఒడిసి పట్టుకోవడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యారు. సెకండాఫ్ లో అసంతృప్తి ఏమైనా వుంటే ఆ క్లయిమాక్స్ వల్ల పక్కకుపోయి సినిమా సేవ్ అవుతుంది. దర్శకుడు అనిల్ రావిపూడికి కమర్షియల్ మీటర్, ఆడియన్స్ పల్స్ బాగానే తెలుసు. ఎవరు ఏమనుకుంటారు…ఏం ఫీలవుతారు అన్నది ఆయన పట్టించుకోలేదు. ఏ దినుసు ఎక్కడ వేస్తే వంటకం ఘుమ ఘుమ లాడుతుంది అన్నదే చూసుకున్నారు.
బొమ్మల వ్యాపారాన్ని ఉద్దరించడానికి హీరోల ఇమేజ్ ను వాడుకోవడం కానీ, క్లయిమాక్స్ లో నారప్ప, వకీల్ సాబ్ లను తెరపైకి తేవడం కానీ ఇందులో భాగమే. పాన్ ఇండియా జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పి వెన్నెల కిషోర్ ను, పాన్ ఇండియా రేంజ్ భారీ క్లయిమాక్స్ అని చెప్పి, అన్ని భాషల ఫైటర్లను తీసుకురావడం అన్నది ఈవీవీ, భీమినేని స్టయిల్ వెటకారం. కానీ సెకండాఫ్ లో మరో సమస్య ఏమిటంటే డైలాగ్ డైలాగ్ కు, లేదా ఫన్ సీన్ ఎక్స్ ప్రెషన్ కు ఎక్స్ ప్రెషన్ కు మధ్య అస్సలు గ్యాప్ లేకపోవడం. కెమేరా గిరగరా ఒకరి మీద నుంచి మరొకరి మీదకు తిరుగుతూనే వుంటుంది. ఎక్కడా ఒక్క క్షణం స్టడీగా వుండదు. ఏ ఒక్క ఫేస్ ను చూసేందుకు సమయం వుండదు. పంచ్ ను ఆస్వాదించి నవ్వేలోగా మరోటి పడిపోతుంది. ఈ తరహా ఎడిటింగ్ లేదా స్క్రీన్ ప్లే వల్ల సినిమాకు కొంత మైనస్ నే.
ఇలాంటి సినిమాను హీరో వెంకటేష్ చాలా వరకు తన భుజాల మీద మోసాడు. సునీల్ కూడా తొలిసగం అంతా ఆదుకున్నాడు. వరుణ్ కొంత వరకు ఓకె. హీరోయిన్ల ఇద్దరూ బాలేరు. మెహరీన్ ఇంట్రడక్షన్ సీన్ అయితే మరీ దారుణంగా వుంది. తమన్నా కూడా అంత అందంగా కనిపించలేదు. తొలిసగంలో చాలా పాత్రలు అవసరం లేకపోయినా చొప్పించారు. అవన్నీ మలిసగంలో మాయం అయ్యాయి. సినిమాకు సాయి శ్రీరామ్ కేమేరా, దేవీ సంగీతం రెండూ మైనస్ నే. దేవీ పాటలు క్యాచీగా లేవు. బ్యాక్ గ్రవుండ్ స్కోర్ పాత పాటలతో నెట్టుకువచ్చాడు.
అనిల్ రావిపూడి అదృష్టం అంతా సినిమాలో రెండు వంతలు ఫన్ పండడం మీదే ఆధారపడింది. ఆ మాత్రం ఫన్ కూడా పండకపోతే సినిమా పరిస్థితి వేరేగా వుండేది. తొలిసగంలో చాలా వరకు మలిసగంలో అక్కడక్కడ ఫన్ పండడంతో సినిమా సమ్మర్ లో పాస్ అయిపోతుంది అనిపించేుసుకుంది.
ప్లస్ పాయింట్లు
ఫన్
ఫన్
ఫన్
మైనస్ పాయింట్లు
సెకండాఫ్ కొంత
మ్యూజిక్
ఫినిషింగ్ టచ్
ఫన్..విత్ ఫిల్లింగ్
Rating: 3/5
This post was last modified on May 27, 2022 3:07 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…