బాక్సింగ్ అన్నది బహు ప్రాచీన క్రీడ. కానీ అలా అని చెప్పి, బాక్సింగ్ మీద తీసిన సినిమా కూడా అంత పురాతనంగా వుండక్కరలేదు. థియేటర్లకు కొత్త తరం ఆడియన్స్ వస్తున్నారు. కొత్త అయిడియాలను ఆదరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇలాంటి పరమ పాత అరిగిపోయిన కథను తీసుకుని కొడుకు అల్లు బాబి వస్తే, అనుభవం పండిన అల్లు అరవింద్ ఎలా ఒకె అన్నారో? అన్నది పెద్ద క్వశ్చను మార్క్. సరే కథ పాతది అయితే అయింది. దర్శకుడు కొత్తవాడు. కొత్తగా తీస్తాడేమో అని అనుకుని వుండొచ్చు. కానీ ఆయన వివి వినాయక్ దగ్గర ‘ఆ కాలంలో’ పని చేసారు. ఇంకా ఈయన కూడా ఆయన లాగే అక్కడే వుండిపోయారు అని మాత్రం ఊహించి వుండరు. అన్నీ అంచనా వేసి, ఊహించి సినిమా తీస్తే ‘గని సినిమా’ ఇలా ఎందుకు వుంటుంది. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది.
బాక్సింగ్ నేపథ్యంలో ఏనాడో అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమా తీసాడు పూరి ఙగన్నాధ్. ఆ నాటికి అది పక్కా అడ్వాన్స్ సినిమా. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ సినిమా వచ్చింది. ఇది పరమ ఓల్డ్ స్టయిల్. కథ గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓ బాక్సర్. విఙయతీరం చేరే వేళ వెన్నుపోటు. చీటర్ గా ముద్రపడి చనిపోతాడు. అతగాడి కొడుకు తండ్రిని అసహ్యించుకుంటూనే పెరుగుతాడు. కానీ బాక్సింగ్ ను మాత్రం వదలడు. తండ్రికి వెన్నుపోటు పొడిచిన వాడే కొడుకును కూడా పొడవాలనుకుంటాడు. కానీ ఆ కుర్రాడు విఙయం సాధించి, ఆ వెన్నుపోటు వీరుడికి బుద్ది చెబుతాడు. ఇదీ కథ.
పొరపాటున కూడా కథలో కొత్తదనం కోసం వెదకాల్సిన పని ప్రేక్షకులకు లేదు. పోనీ ఇదే కథ కోసం రాసుకున్న అరవయ్యో, డెభయ్యో సీన్లలో కొత్త దనం తొంగి చూసి వుంటుందని ఆశపడి, భంగపడాల్సిన పని కూడా లేదు. సినిమా ప్రారంభం నుంచే తెలిసిపోతుంది. ఇది పక్కా 1980 నాటి స్క్రిప్ట్ అని. ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త సీన్ లేదు. హీరోయిన్ ట్రాక్ పూరి ఙగన్నాధ్ సినిమాలు చూసి వాతలు పెట్టుకునే ప్రయత్నం లా వుంది. పోనీ మళ్లీ అలా అని పూర్తిగా ధైర్యం చేయలేకపోయారు.
స్క్రిప్ట్ పాత తరహా అన్న సంగతి అలా వుంచితే ఆలోచనా విధానం కూడా చాలా పూర్ గా వుంది. హీరో సాధించాల్సింది ఏమిటి? శతృవు మీద పగ, బాక్సింగ్ లో విఙయం. ఈ రెండూ కూడా అయాచితంగా వచ్చేస్తే ఇక హీరోయిఙం ఏముంది? హీరో అపోనెంట్ పాత్ర కనికరించింది కనుక, ఇతగాడు బతికి పోయి విఙయం సాధించేసాడు. అప్పుడు కూడా చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనవుతుంది. ఇక విలను అనేవాడు తను చేసిన ఘనకార్యాలు తానే పబ్లిక్ గా రికార్డు చేసుకుంటే చేసుకో అనే టైపులో ఙాబితా ఏకరవు పెడితే, చాటుగా ఫోన్ లో (గతంలో విడియో కేమేరాలు వాడేవారు) రికార్డు చేసేసారు. అదే విలన్ అలా చెప్పకపోతే హీరో చేసేదేమిటి? మెయిన్ అపోనెంట్ కూడా మీ నాన్న ఆశయం కోసం నువ్వు గెలవాలి అంటూ పోటీ నుంచి తప్పుకుంటాడు. అలా తప్పుకోకపోతే హీరో గెలవలేడనా అతగాడి ఉద్దేశం?
ఇక హీరోయిఙం ఎక్కడ వుంది? క్లయిమాక్స్ లో హీరో ఫైట్ చేసే అపోనెంట్ ప్రేక్షకులకు తెలియాలి. బాహుబలిలో ప్రభాస్ ప్రత్యర్థి రానా కాబట్టి కనెక్ట్ అయ్యారు. అదే ముక్కు మొహం తెలియని వాడైతే హీరోనే చూస్తారు తప్ప అవతలి వాడి సంగతి పట్టదు. గని సినిమాలో ఇదే వ్యవహారం చోటు చేసుకుంది. బాక్సర్ లు అంటే ఎలా వుండాలి? వడలిపోయిన సునీల్ శెట్టి, ఉపేంద్ర మాదిరిగానా? వాళ్ల కన్నా ఙగపతి బాబే బాగున్నాడు.
సినిమాకు అక్కరలేని ఖర్చు చేసారు. హీరో తల్లి నర్సరీ నడుపుతూ బతుకుతుంటుంది. దాని కోసం ఓ భారీ సెట్. నలుగురు పనివాళ్లు. ఒక భారీ ఇల్లు. ఇలాంటి వ్వవహారాలు ఇంకా చాలా వున్నాయి. ఆర్ట్ డిపార్ట్ మెంట్ బడ్ఙెట్ పెంచడానికి తప్ప మరెందుకు పనికిరానివి. తల్లికి తెలియకుండానే నేషనల్ ఛాంపియన్ ఎలా కావాలనుకున్నాడో హీరో? పత్రికల్లో వార్తలు రాకుండా వుంటాయా?
సినిమా తొలిసగం మొత్తం అక్కడికక్కడే గుడుగుడు గుంచం తిరుగుతూ వుంటుంది. మలిసగం మాత్రం పూర్తిగా కథ మీదే నడుస్తుంది. కానీ ఆ కధ మాత్రం కొత్తగా వుండదు. అదే సమస్య. క్లయిమాక్స్ కొత్తగా వుంటుంది అని ఊహించడానికీ లేదు. అలాగే వుంటుంది కూడా.
సినిమాకు నిర్మాతల డబ్బులు మాత్రమే వృధా కాలేదు. హీరో వరుణ్ తేఙ్ శ్రమ కూడా. అంత కష్టపడి బాడీ బిల్డ్ చేసి, బాక్సింగ్ నేర్చుకుని, తన ఆసక్తి అంతా చూపించాడు. కానీ సుఖం లేదు. ఫలితం అంతకన్నా లేదు. మాటలు అక్కడక్కడ బాగున్నాయి. ఈ మధ్యకాలంలో థమన్ వీక్ ఆల్బమ్ ఇదే. ఆర్ఆర్ ఓకె. సినిమాటోగ్రఫీలో పెద్దగా మెరుపులు లేవు.
ఈ ప్రొడెక్ట్ అంతా ఇలా అఘోరించడానికి కారణం ఎవరూ అని పెద్దగా పోస్ట్ మార్టం చేయనక్కరలేదు. దర్శకుడి స్టామినా తెలియకుండా లేదా, ఎక్కువ అంచనా వేసి సినిమా చేతిలో పెట్టడమే అసలు సిసలు తప్పిదం.
ప్లస్ పాయింట్లు
వరుణ్ తేఙ్ శ్రమ
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్లు
కథ, స్క్రీన్ ప్లే, డైరక్షన్
ఇంకా చాలా
ఫినిషింగ్ టచ్: నాక్ అవుట్
Rating: 2.25/5
This post was last modified on April 8, 2022 3:43 pm
టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహకర్తలు పనిచేశారు. రాబిన్ శర్మ తన టీంను రంగంలోకి దింపి.. ఎప్పటికప్పుడు ఆలోచనలు పంచుకుని.. వ్యూహాలు…
ప్రముఖులకు సంబంధించి విషయాలు తరచూ చర్చకు వస్తూ ఉంటాయి. మీడియాకు మించి సోషల్ మీడియా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పటి…
తాను తప్పు చేసినా.. పొరుగు వాడు తనపై బురద జల్లుతున్నాడనే రకం రాజకీయాలు సాగుతున్నాయి. తను చేసింది తప్పయినా.. అంగీకరించలేని…
మరో రెండు రోజుల్లో ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నెల 31తో ప్రస్తుతం…
పదవులు చాలానే ఉంటాయి. కానీ.. వాటిని ఎవరైతే చేపడతారో.. వారికి అనుగుణంగా ఆ పదవులకు కళ రావటమో.. ఉన్న కళ…