Movie Reviews

సమీక్ష – రౌడీ బాయ్స్

అవకాశం కుదిరినపుడల్లా నిర్మాత దిల్ రాజు రౌడీ బాయ్స్ గురించి చెప్పిన మాట ఒకటి వుంది. అలనాటి ప్రేమదేశం లాంటి సినిమా అన్నదే ఆ మాట. అలాగే మరో ముచ్చట ఏమిటంటే ఇటీవల కాలంలో కాలేజీ బ్యాక్ డ్రాప్ లో మంచి లవ్ స్టోరీ రాలేదు అన్నది. ఈ రెండు మాటలు చాలు రౌడీ బాయ్స్ సినిమా మీద కాస్త ఆసక్తి పెంచడానికి. కానీ ఆ విధంగా పబ్లిసిటీ చేయడంలో చూపించిన ఆసక్తి, ఆ విధమైన సినిమాను అందించడం లో మాత్రం చూపించలేదు.

ఇదే విషయాన్ని మరో కోణంలో కూడా చెప్పవచ్చు. ప్రేమదేశం వచ్చి చాలా రోజులు అయిందని అలాంటి సినిమా, కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సినిమా రాలేదని అలాంటి మూవీని తయారు చేయాలనుకున్నారే కానీ అలాంటి బ్యాక్ డ్రాప్స్ లో కొత్త కథ తయారు చేసుకోవాలని అనుకోలేదు. ఇదే రౌడీ బాయ్స్ లో అసలు సిసలు సమస్య.

ప్రేమదేశం సినిమా ఓ ముక్కోణపు ప్రేమకథ. అందులో బలమైన స్నేహం, అంతకన్నా బలమైన ప్రేమ రెండూ వుంటాయి. ఆ ఫీట్ ను మళ్లీ రిపీట్ చేయడం కష్టం. అందుకే రౌడీ బాయ్స్ లో స్నేహం అన్న ఎలిమెంట్ ను పక్కన పెట్టారు. అలాగే కాలేజీ బ్యాక్ డ్రాప్ అన్నది మన సినిమాలకు కొత్త కాదు. సవాలక్ష సినిమాలు. వాటిల్లో అంతకు మించిన సీన్లు, జోక్ లు, గొడవలు, ఇంకా ఎన్నో.

ఇప్పుడు కొత్తగా చూపించాలి లేదా తీయాలి అంటే వాటన్నింటినీ మరిచిపోయేలా వుండాలి లేదా ఆలోచనల్లోకి కూడా రాకుండా చేయాలి. ఇక్కడ కూడా రౌడీ బాయ్స్ ఫెయిల్ అయింది.

రౌడీ బాయ్స్ లో రెండు కథలు. తొలిభాగంలో రెండు కాలేజీలు. ఇద్దరు హీరోల్లాంటి కుర్రాళ్లు (ఆశిష్, విక్రమ్) , వారి మధ్య ఓ అమ్మాయి (అనుపమ). కాలేజీల మధ్య, హీరోల మధ్య గొడవలు. రెండో కథేంటీ అంటే అమ్మాయి..అబ్బాయిల లివింగ్ టు గెదర్. అక్కడ చిన్న చిన్న ఎమోషన్లు, బ్రేకప్ లు చివరకు ముగింపు.

తొలిభాగం వరకు చూసుకుంటే కాలేజీల మధ్య గ్యాంగ్ వార్ లు, తన కన్నా పెద్దదైన అమ్మాయిని ప్రేమించడం, చిన్న చిన్న సరదా చమక్కులు. ఇవేవీ కొత్తవి కావు. కొత్త బంగారు లోకం వంటి సినిమాను దిల్ రాజు నిర్మించారు. అప్పటి ఆ సినిమా చాలా కొత్తగా ఫ్రెష్ గా వుంటుంది. అలాంటి ఫ్రెష్ నెస్ అన్నది రౌడీ బాయ్స్ లో అస్సలు కనిపించదు. చూసేసిన అనేక సినిమాల్లో సీన్లే వేరే నటులతో చూసిన ఫీలింగ్ వెన్నాడుతుంటుంది. అందువల్ల తొలిసగం ఏమంత కొత్తగా, ఆసక్తికరంగా వుండదు. టైమ్ పాస్ గా సాగిపోతుంది.

సినిమా ద్వితీయార్థానికి లీడ్ చేసే లివింగ్ టుగెదర్ అన్నది కూడా కొత్త పాయింట్ కాదు. కానీ సినిమా ఆ దిశగా టర్న్ తీసుకోవడం అన్నది ఆసక్తి వుండి ఏం జరుగుతుందో అన్న ఆలోచనతో ప్రేక్షకులు ద్వితీయార్థంలోకి వస్తారు. ఈ లివింగ్ టుగెదర్ అన్న టర్న్ తీసుకోవడం వల్ల దర్శకుడు సాధించినది ఏమిటి అంటే కాసిన్ని రొమాంటిక్ మూవ్ మెంట్స్. అవి ఓకె అనిపించుకుంటాయి.

హీరో ఆరెస్ట్రా ఎపిసోడ్ లు పండాలి అన్నా, లవ్ స్టోరీల్లోకి ఫీల్ రావాలి అన్నా పాటలు చాలా కీలకం. రౌడీబాయ్స్ కు అదే అతి పెద్ద మైనస్. ఎక్కువ పాటలు వున్న ఈ ఆల్బమ్ లో ఆకట్టుకునేవి తక్కువ. దీనికి తోడు ప్రీ క్లయిమాక్స్, క్లయిమాక్స్ టూ ప్రిడిక్టబుల్ గా వుంటాయి. ఇవన్నీ చూసాక కొంత మంది ఆడియన్స్ కు అయినా మలి సగం కన్నా తొలిసగమే బెటర్ అని అనిపించినా ఆశ్చర్యం లేదు.

నిజానికి కాలేజీ బ్యాక్ డ్రాప్ లో కొత్తసీన్లు రాయడం అంత సులువు కాదు. అందుకే కొత్త సీన్ల కన్నా కొత్త ఫన్ నే టేకప చేసిన కాలేజీ సినిమాలు ఎక్కువ. ఇక్కడ ఆ ఫన్ లైన్ లో కూడా దర్శకుడు శ్రీహర్ష ఫెయిలయ్యారు. యూత్ సినిమా అంటే ఓ అమ్మాయి కోసం ఇద్దరు పోటీ పడడం, రెండు కాలేజీల మధ్య గ్యాంగ్ వార్, యూత్ ఆర్కెస్ట్రా బ్యాండ్, లివింగ్ టుగెదర్ లాంటి పాయింట్ లు వుండాలి అని అనుకుని, ఆపై దాని చుట్టూ కథ అల్లుకున్నట్లు వుంది.

సినిమాను ఏమాత్రం కాపాడిన పాయింట్ ఏమైనా వుందీ అంటే హీరో, హీరోయిన్, మిగిలిన నటులు కాస్త ఫ్రెష్ గా వుండ ఈజ్ తో నటించడమే. ఫలానా..ఫలానా సినిమాల్లా వుండాలనే ఆలోచనతో కాకుండా మంచి యూత్ సినిమా తీయాలనే ఆశతో కథ తయారు చేసుకుని వుంటే వేరుగా వుండేది. ప్రస్తుతానికి యూత్ సినిమా బదులు పాత సినిమా చూసినట్లే వుంది.

సినిమాకు ఖర్చు గట్టిగా చేసారు. పాటలు మినహా టెక్నికల్ వాల్యూస్ బాగానే వున్నాయి. కొత్త హీరో ఓకె అనిపించుకుంటాడు. అనుపమ కూడా ఓకె. కథలో దమ్ము లేకపోవడం, నెరేషన్ అంతగా ఆకట్టుకోకపోవడం, కొన్ని చోట్ల నెమ్మదించడం, కొన్ని చోట్ల రొటీన్ అనిపించుకోవడం, అన్నింటికి మించి ప్రీ క్లయిమాక్స్, క్లయిమాక్స్ మైనస్ కావడం రౌడీ బాయ్స్ ను యావరేజ్ సినిమాగా మార్చేసాయి.

ప్లస్ పాయింట్లు

నిర్మాణ విలువలు
బ్యాక్ గ్రవుండ్ స్కోర్
విజువల్స్

మైనస్ పాయింట్లు

తొలిసగం
రొటీన్ నెరేషన్

ఫినిషింగ్ టచ్: ఓల్డ్ బాయ్స్

Rating: 2.5/5

This post was last modified on January 14, 2022 8:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మైఖేల్ జాక్సన్ మీద ఇంత ప్రేమ ఉందా

ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…

2 hours ago

శ్రీలీల డెబ్యూకి మోక్షం ఎప్పుడో

అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…

3 hours ago

పెయిడ్ ట్వీట్లతో ప్రయోజనమేమి?

చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…

5 hours ago

LSG: ఓనర్ గోయెంకా కోపంలో తప్పు లేదు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…

5 hours ago

తెలుగు టైటిల్స్ నిర్లక్ష్యం చేయకండి

ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…

5 hours ago

క‌విత దూకుడు మామూలుగా లేదు

క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. మాజీసీఎం కేసీఆర్ త‌న‌య‌గా.. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఆ పార్టీతో…

5 hours ago