సమీక్ష: దర్బార్

మురుగదాస్ ఓ మాంచి ఇంటలెక్చ్యువల్ డైరక్టర్. సమాజం పట్ల, దాని సమస్యల పట్ల ఆయన స్పందించే తీరు వేరుగా వుంటుంది. ఆయన సినిమాల్లో లిక్కర్ సీన్లు కనిపించకుండా చూసుకుంటారు. బర్నింగ్ టాపిక్ లను తీసుకుని, మాంచి సినిమాలుగా మలుస్తుంటారు. స్పైడర్ లాంటి సినిమాతో ఆయన పెయిల్ అయి వుంటే వుండొచ్చు గాక, కానీ ఆయన మీద సగటు సినిమా ప్రేక్షకుడికి ఓ నమ్మకం అనేది వుంది. అలాంటి నమ్మకం, అలాంటి అభిమానం ఏదైనా వుంటే ఈ వారం విడుదలయిన దర్బార్ సినిమాతో సగానికి సగం లేదా పూర్తిగా కూడా పోతుంది.

తలైవా రజనీ ని మళ్లీ వెనకటి తరం సూపర్ స్టార్ లా చూపిస్తాననే ఆశలు టీజర్ తో, ట్రయిలర్ తో రేకెత్తించి, ఆ ఆశలతో థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడికి ఓ సగటు సినిమా చూపించి, ఇదా మురుగదాస్ స్థాయి అని అనుకునేలా చేసారు. రజనీ లాంటి స్టార్ తో ఫెయిల్ అయినా, పాస్ అయినా, ఇటీవల యంగ్ డైరక్టర్లు కాస్త విభిన్నమైన ప్రయోగాలు చేసారు. కానీ మురుగదాస్ పక్కా ఫార్ములా సినిమాను, అది కూడా పాత చింతకాయపచ్చడి సీన్లతో నింపేసి జనం ముందు పెట్టారు.

ఓ పోలీస్ ఆఫీసర్, విచ్చలవిడిగా రౌడీ బ్యాచ్ ను కాల్చి పారేస్తుంటాడు. ఎందుకా? అని చూస్తే ఓ ఫ్లాష్ బ్యాక్. అందులో ఆ హీరోకి దారుణ అన్యాయం. ఆ ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తరువాత మళ్లీ ఆ విచ్చలవిడితనం. మెయిన్ విలన్ ఎంట్రీ. హీరోయిజానికి కాస్త బ్రేక్. ఆ తరువాత నేరుగా విలన్ తో ఢీ. ఫినిష్.

ఇదీ సినిమా. అయితే దీనికి రజనీ స్టయిల్ తోడయింది. కానీ మురుగదాస్ మార్క్ తోడు కాలేదు. అదే సమస్య. సినిమాలో విలన్ కొడుకును తెలివిగా చంపించే ఎపిసోడ్ మినహా మరెక్కడా మురుగదాస్ మేధావితనం స్క్రిప్ట్ లో కనిపించదు. అయితే ఈ ఎపిసోడ్ కూడా రజనీ సినిమాలు మెచ్చే మాస్ జనాలకు అంత తేలికగా అర్థం కాదు.

సినిమా తొలిసగం బాగానే వుంది అనిపిస్తుంది. దానికి కారణం, ఓపెనింగ్ ఫైట్, రజనీ స్టయిల్ ఇలాంటివి అన్నీ కలిసి. ఫరవాలేదు, ఓ కమర్షియల్ యాక్షన్ సినిమా అన్న ఫీల్ ను కలిగిస్తాయి. కానీ మలిసగం దగ్గరకు వచ్చేసరికి ఇంక సరుకు అయిపోయింది. ఇంటర్వెల్ బ్యాంగ్ తరువాత పెళ్లి పాట రావడంతోనే ఈ విషయం తెలిసిపోతుంది. విలన్ ను విదేశాల నుంచి తీసుకువచ్చిన తరువాత, ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఆ విషయం, హీరోకి ఎలా తెలుస్తుంది అన్న ఉత్కంఠను రేకెత్తించలేకపోయారు.

మెయిన్ విలన్ ఎంటర్ అయిన తరువాత దర్శకుడి కథనంలో పూర్తిగా డొల్లతనం కనిపించింది. ఆ డొల్లతనం అలా కొనసాగి, ఆఖరికి క్లయిమాక్స్ మీద కూడా పడింది. ఓ సాదా సీదా క్లయిమాక్స్ ను అల్లి, సినిమా ముగిసింది అనిపించగలిగారు. ఒక పక్కన రజనీ తో రజనీ ఫ్యాన్స్ లెవెల్ కు దిగి సినిమా తీస్తూనే, మళ్లీ అక్కరలేని మేధావితనం చూపించే ప్రయత్నం చేసారు. ఖైదీలతో పరిశోధన అనే కాన్సెప్ట్ అలాంటిదే. కామన్ ఆడియన్ కు ఒక్క ముక్క, ఒక్క సీన్ అర్థం అయితే ఒట్టు.

ఇది కాక సినిమాలో హీరోయిన్ ట్రాక్ మరీ పరమ రొటీన్ గా వుంది. మన సీనియర్ హీరోలు అంతా ఎప్పుడో ఒకప్పుడు ఈ ట్రాక్ ను చేసినవారే. ఆ సీన్లు అన్నీ మన ప్రేక్షకులు సవా లక్ష సార్లు చూసినవే. ఆ ట్రాక్ అంతా ఏ మాత్రం రంజింప చేయదు. కామెడీ కోసం పెట్టిన ట్రాక్ కూడా అంతంత మాత్రం.

సినిమాలో పాటలు తెలుగు ఆడియన్స్ కు పట్టవు. డైలాగులు కూడా కృతకంగా వున్నాయి. ఆర్ ఆర్ కొన్ని చోట్లు బాగుంది. కానీ కొన్ని చోట్ల తమిళ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ చేసినట్లుంది. సినిమా ద్వితీయార్థం విషయంలో సూర్య సింగం సినిమాను కాస్త ఆదర్శంగా తీసుకున్నట్లుంది. అక్కడ ఆ రేసీ స్క్రీన్ ప్లేకు తగిన పిక్చరైజేషన్, సూర్య యాక్షన్ సరిపోయింది. రజనీ ఇక్కడ సూట్ కాలేదు. ఆ రేంజ్ పిక్చరైజేషన్ లేదు. దాంతో తేలిపోయాయి సీన్లన్నీ.

ఈ వయసులో రజనీ బాగానే కష్టపడ్డారు. ప్యాన్స్ కు తగినట్లు కనిపించారు. నివేధా థామస్ మరోసారి తన నటన ప్రూవ్ చేసుకుంది. నయనతారకు అంత సీన్ లేదు. విలన్ పాత్ర డిజైన్ మరీ నాసిగా వుంది. అసలు సినిమాలో బలమైన విలనిజమే లేదు.

టోటల్ గా పండగకు రజనీ దర్బార్ కొలువు తీరుతుంది అనుకుంటే, తొలి షో లోనే వెల వెల పోయినట్లు అయింది.

ఫినిషింగ్ టచ్….’సింగం’ ను చూసి వాతలు
రేటింగ్ – 2.5/5

This post was last modified on April 19, 2020 11:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రుషికొండ ప్యాలెస్ జగన్ రాజకీయ సమాధి: రఘురామ

500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…

45 mins ago

వైసీపీ ప్రతిపక్ష హోదాపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…

45 mins ago

లోకేష్ స్పీచ్‌కు లైకులు ప‌డుతున్నాయ్‌.. !

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్ర‌సంగాల‌కు మంచి లైకులు ప‌డు తున్నాయి. ఇది ఏదో…

46 mins ago

పుష్ప-2లో షాడో విలన్

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…

1 hour ago

విశ్వక్‌కు అప్పుడు నో చెప్పిన హీరోయినే..

ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…

3 hours ago

దేవర-2 తీయాలా వద్దా?

తెలుగులో ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. పాన్ వరల్డ్ హిట్…

5 hours ago