బాహుబలి అని పేరు పెట్టుకున్నవాడు పరమ బక్కచిక్కిపోయి, వీక్ నెస్ కు బ్రాండ్ అంబాసిడర్ మాదిరిగా వుంటే ఎలా వుంటుంది? రాజా విక్రమార్క అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టుకుని, అర్థం పర్థం లేని సినిమా చూపిస్తే అచ్చం అలాగే వుంటుంది. కొంచెం లవ్, రోమాన్స్, మరి కొంచెం ఫన్, ఇంకొంచెం యాక్షన్, మరికాస్త థ్రిల్లింగ్ ఎలిమెంట్లు ఇలా కనిపించినవి, అనుకున్నవీ అన్నీ తెచ్చుకుని వచ్చి వేస్తే, మాంచి కిక్కిచ్చే భేల్ పూరీ అవుతుందేమో అనుకుంటే అది కాస్తా కక్కించే వంటకంగా మారిపోతే అచ్చం రాజా విక్రమార్క సినిమా మాదిరిగానే వుంటుంది.
ఇంతకీ ఈ రాజా విక్రమార్క కథేంటీ అంటే ఎన్ఐఎ లో పని చేస్తుంటాడు విక్రమ్(కార్తికేయ). హోమ్ మినిస్టర్ (సాయిుకుమార్) ను కాపాడే డ్యూటీ పడుతుంది. నేరుగా కాదు. అతగాడికి తెలియకుండా, ఓ కామెడీ డ్యాన్స్ మాస్టర్ (హర్షవర్దన్) సాయంతో హోమ్ మినిస్టర్ ఇంట్లో చేరి, అతగాడి కూతురు క్రాంతి (తాన్యా) ను లవ్ లో పడేస్తాడు. ఇంతలో ఆమె కాస్తా కిడ్నాప్ అవుతుంది. ఆ తరువాత ఎలా కాపాడాడు హీరో అన్నది మిగిలిన సినిమా.
కథ నిజానికి ఇలా రెండు లైన్లలో చెప్పేసేది కాదు. బోలెడంటే బోలెడు వుంది. బోలెడు పాత్రలు వున్నాయి. నీరసంగా చుట్టేసిన అతి పెద్ద ట్విస్ట్ వుంది. ఇంకా చాలా చాలా వున్నాయి. కానీ వాటితో పాటు స్క్రిప్ట్ ను సరిగ్గా తయారు చేసుకోలేకపోయిన వీక్ నెస్ వుంది.
ఎన్ఐఎ ఏజెంట్ క్యారెక్టర్ ను జోవియల్ గా, కొంచెం స్టయిలిష్ గా తీర్చి దిద్దాలనే ఆలోచన వరకు ఓకె. కానీ మరీ ఆ కామెడీ మరీ కిందకు దిగిపోకూడదు. తొలిసగం అంతా అక్కరలేని సోది సీన్లతో నింపేసారు. సినిమా కథను ముందుకు నడిపించే సీన్లు చాలా తక్కువ అంటే తక్కువే. చాలా సీన్లు సినిమాకు అవసరమా అనే అనుమానం కలిగించేవే. హీరోయిన్ ను డేటింగ్ కు అని చెప్పి ఓ గుడికి తీసుకెళ్తాడు. అక్కడ సీన్లు, హావభావాలు అబ్బో..మాములుగా వుండవు.
ఇలా తొలిసగం అంతా మామూలు వ్యవహారాలతో నిండిపోయి, హీరోయిన్ కిడ్నాప్ తో మలిసగంలోకి దారి తీస్తుంది. పోనీ అప్పటికి అయినా సినిమా సీరియస్ టర్న్ తీసుకుంటుంది. హీరోయిన్ ను పక్కన పెట్టేసారు కనుక, ఓ పనైపోయింది అనుకుంటే ఇటు ఫ్లాష్ బ్యాక్ సీన్లు, అటు ప్రెజెంట్ సీన్లు, విలన్ ట్విస్ట్, మళ్లీ అక్కడ విలన్ బాల్యంలోని ఎమోషనల్ సీన్లు, ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏవోవో వస్తుంటాయి. వెళ్తుంటాయి.
పోలీస్ ఆఫీసర్ నే విలన్ అన్న కీలకమైన ట్విస్ట్ ను ఎంత నాసి రకంగా ఎలివేట్ చేసారో, అంతకు అంతకన్నా వీక్ గా రివీల్ చేసారు. ఎక్కడా కూడా ఒక్క సీన్ బాగా హ్యాండిల్ చేసాడు అని కానీ, చేయగలిగాడు అని కానీ అనిపించదు. సినిమా, సీన్లు, ఇలాంటి వాటితో తనకు సంబంధం లేదన్నట్లు హీరో కార్తికేయ నటించుకుంటూ వెళ్లిపోయాడు. కామెడీ, యాక్షన్ సీన్లు ఒకె కానీ బై మిస్టేక్ మొహంలో బాధ చూపించాలనుకుంటే మాత్రం ప్రేక్షకులు సైతం బాధపడేలా వున్నాయి ఎక్స్ ప్రెషన్లు.
హీరోయిన్ తాన్యా స్క్రీన్ మీద అలా అందంగా కనిపించడం వరకే. సినిమాలో సీనియర్లు, తనికెళ్ల, సాయి కుమార్, హర్షవర్దన్ ఓకె. పశుపతి లాంటి మంచి నటుడిని తీసుకుని కూడా సరైన పాత్ర చేయించలేకపోయారు. సుధాకర్ కోమాకుల ఆ పాత్రకు అస్సలు ఫిట్ కాదు. బ్యాక్ గ్రవుండ్ స్కోర్, ఫొటోగ్రఫీ ఓకె. ఖర్చు బాగానే పెట్టారు. కానీ ఆ మేరకు అవుట్ పుట్ తీసుకురాలేకపోయారు.
ప్లస్ పాయింట్లు
హర్ష కామెడీ
మైనస్ పాయింట్లు
కథ, కథనం
ఇంకా..ఇంకా..
ఫినిషింగ్ టచ్: ..వద్దు..రాజా
Rating: 2/5
This post was last modified on November 12, 2021 2:49 pm
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…