Movie Reviews

సమీక్ష – నాట్యం

Director: Revanth Korukonda
Cast: Sandhya Raju, Kamal Kamaraj, Rohit Behal, Aditya Menon, Subalekha Sudhakar, Bhanupriya
Producer: Sandhya Raju
Music: Shravan Bharadwaj
Banner: Nishrinkala films
Genre: Dance
Release Date: 22 Oct 2021

భగవద్గీతను బూతు పుస్తకాన్ని పక్క పక్కన పెడితే ఈ కాలంలో జనం ఎక్కువగా ఏది అందుకుంటారో చెప్పనక్కరలేదు. ఈ కాలంలో పూర్తిగా గుళ్లు గోపురాల్లో, శాస్త్రీయ నృత్యం ఆధారంగా సినిమా తీస్తే చూసేదెవరు? ఆదరించేదెవరు? ఎవరో పెద్ద పెద్ద సెలబ్రిటీలు పూనుకుని ముందుకు వస్తే తప్ప జనం కాస్తయినా థియేటర్ వంక, ఆ సినిమా వైపు చూసే పరిస్థితులు ఇప్పుడు లేవు.

ఇలాంటి నేపథ్యంలో ఒక నృత్య కళాకారణి తన తపన తీర్చుకోవడం కోసం కోట్లు ఖర్చు చేసి అలాంటి సినిమా తీయడాన్ని ముందుగా మెచ్చుకోవాలి. సినిమా ఎలా వుంది? ఆడుతుందా? ఆడదా? అన్నది పక్కన పెట్టి ఆ తపనను చూడాలి. ఆ తపనే ఈ వారం ‘నాట్యం’ అనే సినిమా రూపంలో థియేటర్లలోకి వచ్చింది.

సంధ్య రాజు అనే నృత్య కళాకారిణి పెద్ద తెరపై తనను, తను నేర్చుకున్న విద్యను ప్రదర్శించాలనే తాపత్రయాన్ని ఈ సినిమా చూపిస్తుంది. కానీ అది మాత్రమే కాదు, సినిమా మేకింగ్ లో క్వాలిటీని, మాంచి విజువల్స్ ను, కథకు తగిన ఆంబియన్స్ తో కూడిన లోకేషన్లను కూడా చూడొచ్చు. దానికి తగినట్లే మంచి సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రవుండ్ స్కోర్, నిర్మాణ విలువలు.

సరే, ఇంతకీ సినిమా లోకి వస్తే…నృత్యం మీద అభిమానంతో దాన్ని ఓ కథను చెప్పే కళగా ఆరాధించే గ్రామం ‘నాట్యం’. ఆ ఊరిలో నాట్య మండలి. దానికి ఓ గురువు (ఆదిత్య మీనన్). ఆయన ప్రియ శిష్యురాలు సితార (సంధ్య రాజు). తన గురువు చెప్పిన కాదంబరి కథను ఎప్పటికైనా వేదిక మీద నృత్య రూపంలో ప్రదర్శించాలన్నది ఆమె కోరిక. ఈ కోరిక ఎలా నెరవేరింది అన్నది సినిమా.

నాట్యం సినిమా కథను ఆసక్తికరమైన థ్రిల్లర్ గా మార్చవచ్చు. ఆ సత్తా ఆ కథకు వుంది. ఇప్పుడు ఆ కథను అలా అనుకున్నట్లు ప్రెజెంట్ చేసారు తప్ప ఆసక్తికరంగా అయితే కాదు. క్లాసికల్ నృత్యాన్ని, వెస్ట్రన్ తో మిక్స్ చేసి ఫ్యూజన్ చేస్తే, జనం ఆసక్తికరంగా చూస్తారు అనే పాయింట్ ను కథలో రాసుకున్న దర్శకుడు రేవంత్, అదే విధంగా తను అనుకున్న కథకు కాస్త థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఆసక్తికరంగా తయారుచేస్తే ప్రేక్షకులు చూస్తారు అనే ఆలోచన ఎందుకు చేయలేదో? దాని కోసం నిజానికి పెద్దగా వ్రతం చెడక్కరలేదు. కాస్త స్క్రీన్ ప్లే మార్చుకుని, కథనాన్ని ఆసక్తికరంగా నడిపితే సరిపోతుంది.

నిజానికి దర్శకుడికి కాస్త విషయం వుంది. కథను చెప్పడానికి తీసుకున్న లోకేషన్లు, పెట్టిన ఫ్రేమ్ లు, సాంకేతిక సహచరుల నుంచి రాబట్టిన పనితనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. కానీ కథలో చేరిన కొన్ని సీన్లు ఆసక్తిని కలిగించలేకపోతే, మరి కొన్ని సీన్లు ఆసక్తిని చంపేసాయి.

సినిమా తొలిసగం బాగానే వుంటుంది. స్లోగా టేకాఫ్ తీసుకున్నా, భిన్నమైన ఆంబియన్స్ తో, ఆసక్తికరమైన లోకేషన్లతో, పాటలు, డ్యాన్స్ లతో ఒకె అనిపించుకుంటుంది. మరీ డ్యాన్స్ మీద పెట్టిన కొన్ని సీన్లు మాత్రం కాస్త బోర్ కొట్టిస్తాయి. తొలిసగం అన్నది కాస్త బండి లాగించేసినా, మలిసగం ప్రారంభం కాగానే పట్నంలో హీరోయిన్ సీన్లు, హీరో (రోహిత్ బెహల్) అండ్ టీమ్ తో చేసిన సాంగ్, ఇతరత్రా సీన్లు అన్నీ కోసేసి, తీసేసి, రీప్లేస్ చేసుకోవాల్సినవే. ఈ వ్యవహారం ఇరవై నిమషాలకు పైగానే వుంటుంది.

మళ్లీ సినిమా ప్రీ క్లయిమాక్స్, క్లయిమాక్స్ లోకి వచ్చాక ఆసక్తిగానే వుంటుంది కానీ అక్కడా ఇంకా బాగా చేయడానికి చాలా అవకాశం వుంది. కాదంబరి కథను స్టేజ్ మీద, విజవల్ గానూ మిక్స్ చేసిన చెప్పిన థీమ్ ను ఇంకా చాలా మెరుగు పరిచే అవకాశం వుంది. కీలకమైన కాదంబరి రచనల పాయింట్ ను, దేవతకు ముడిపెట్టి మూఢనమ్మకంగా మార్చి, దాన్ని అలా వుంచేందుకు ధర్మకర్త (శుభలేఖ సుధాకర్) వ్యవహారాన్ని మరింత క్లారిటీగా చేయాలి. అది కూడా బలమైన రీజన్ వుంటే ఇంకా బాగుంటుంది. ఆది నుంచీ కాదంబరి అనేది ఓ గుప్తమైన బలమైన పాయింట్ గా చెబుతూ వచ్చి, చివర్లో సింపుల్ పాయింట్ గా మార్చేసారు.

సినిమాకు శ్రావణ్ భరద్వాజ్ అందించిన నేపధ్యసంగీతం బాగుంది. పాటలు కూడా ఓకె. వేణువులో అన్న పాటలో సాహిత్యం బాగుంది. ఓంనమశ్శివాయ పాట చిత్రీకరణ బాగుంది. సంధ్యరాజు స్క్రీన్ ప్రెజెన్స్ ఓకె. సహజంగా నర్తకి కావడంతో ఎమోషన్లు బాగానే పండించారు. గురువుగా ఆదిత్య మీనన్, హీరో రోహిత్ ఒకె.

ఓ పాటలో చేసిన కృష్ణ-రాధ విజువల్ ఎఫెక్ట్స్ నిజంగా టాప్ లెవెల్లో వున్నాయి. ఇస్కాన్ సంస్థ విదేశీ పుస్తకాల్లోంచి పెయిటింగ్ లు తీసుకవచ్చి తెరమీద ఆవిష్కరించినట్లు వున్నాయి. మొత్తం మీద ఎన్నో బావున్న, బావులేని సినిమాలు చూసే జనం, ఇలాంటి సినిమాను ఓ సారి చూసేసినా తప్పేం కాదు.

ప్లస్ పాయింట్లు
సాంకేతిక విలువలు
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్లు
కథనంలో తడబాట్లు

ఫినిషింగ్ టచ్ మెచ్చుకోదగ్గ ప్రయత్నం

This post was last modified on October 22, 2021 4:05 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

వైఎస్’ల వార‌స‌త్వం కోసం జ‌గ‌న్ ఆరాటం!

ఈ ఏడాది జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ.. త‌ర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఓ ప్ర‌శ్న…

46 minutes ago

బన్నీ నిర్ణయం కరెక్టని ఋజువైనట్టే

ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…

1 hour ago

హీరోలు సాధార‌ణ మ‌నుషులే.. మ‌రిచిపోతున్నారు: త‌మ్మారెడ్డి

ద‌ర్శ‌కుడు, న‌టుడు, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌కు ఇండ‌స్ట్రీలో మంచి పేరుంది. ఆయ‌న ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడ‌తారు.. ఏం…

2 hours ago

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్‌కు హైకోర్టు ఊరట

తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మధ్యంతర…

2 hours ago

ఆర్ఆర్ఆర్ : మేకింగ్ అఫ్ మాస్టర్ పీస్!

ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రిలీజైన అయిదారు నెలల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోవడం సహజం.…

2 hours ago

చొక్కా విప్పి కొరడాతో కొట్టుకున్న అన్నామలై

తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వ తీరుపై తన వినూత్న నిరసనతో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల…

3 hours ago