Movie Reviews

సమీక్ష – ఎస్ ఆర్ కళ్యాణమండపం

స్లిమ్ ఫిట్ షర్ట్ లు బాగానే వుంటాయి. కానీ వాటికి మన ఫిజిక్ నప్పాలి కదా? మాస్ పాత్రలు వేసేయాలని, ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేసుకోవాలని మొహానికి రంగేసుకున్న ప్రతి హీరోకీ వుంటుంది. కానీ ఆ తరహా పాత్రలు మనకు నప్పుతాయో, నప్పవో అన్నది చూసుకోవాలి కదా? రాజుగారి రాణిగారు సినిమాతో ఓకె అనిపించుకున్న అప్ కమింగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆ వెంటనే మాంచి మాస్ సినిమాతో జనం ముందుకు వచ్చేసాడు. అయితే కేవలం మాస్ వుంటే సరిపోదు, ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా అద్దకం వేయాలనుకున్నాడు. ఆ విధంగా అతగాడే కథ, స్క్రీన్ ప్లే, మాటలు సెట్ చేసుకుని రంగంలోకి దిగిపోయాడు. ఆ ప్రయత్నం ఎలా వుందో చూద్దాం.

ఎస్ ఆర్ కళ్యాణమండం ఓనరు ధర్మ (సాయికుమార్). తాగడానికి తప్ప మరెందుకు పనికి రాని మనిషి. భార్య (తులసి)చేత సదా చీవాట్లు తింటూ వుంటాడు. కొడుకు (కిరణ్) తండ్రితో అస్సలు మాట్లాడడు. అదెందుకో మనకు సినిమా పూర్తయినా తెలియని దేవ రహస్యం. పోనీ ఈ కొడుకు కిరణ్ ఏమైనా పనికి వచ్చే రకమా? అంటే అంతకన్నా బేవార్స్ వ్యవహారం. కాలేజీలో డింకీలు, బార్ లో డ్రింక్ లు. ఇదే సదా. ఇలాంటి నేపథ్యంలో మూల పడిన ఎస్ ఆర్ కళ్యాణమండపాన్ని ఉద్దరించే పని నెత్తిన పెట్టుకుంటాడు. మధ్యలో ప్రియాంక జవాల్కర్ తో లవ్ స్టోరీ ఒకటి.

మొత్తం మీద కథ ఎలా వుంటుందీ అంటే విశాఖపట్నం వెళ్తుంది కధ అనుకుంటే సూర్యాపేట దగ్గర టర్నింగ్ తీసుకుని ఖమ్మం వెళ్తుంది. ఓహో..ఖమ్మం వెళ్తుందా అనుకుంటే యూ టర్న్ తీసుకుని వెనక్కు వచ్చి మళ్లీ నల్గొండ వైపు వెళ్తుంది. ఓహో ఇదా టెస్టినేషన్ అనుకుంటే కాదు అని హైదరాబాద్ చక్కా వచ్చేస్తుంది. తండ్రి అప్రయోజకత్వం, కొడుకు బేవార్స్ తనం మీద ఫోకస్ పెట్టి, అక్కడి నుంచి కళ్యాణమండప జీర్ణోద్ధరణ కార్యక్రమం మీద దృష్టి పెట్టి, అంతలోనే లవ్ స్టోరీలో ట్విస్ట్ చొప్పించి, ఆపైన తండ్రీ కొడుకుల సెంటిమెంట్ రంగరించి చివరకు ఏమీ లేదు. అంతా ఊ..ఉత్తుత్తినే అన్నట్లుగా క్లయిమాక్స్ ను చూపించి ముగించేస్తారు.

సినిమా ముగిసాక మిగిలిపోయే భేతాళ ప్రశ్నలు కొన్ని వుంటాయి.

అసలు తండ్రితో పదేళ్ల పాటు మాట్లాడనంత బలమైన వైరం కొడుక్కు ఎందుకు వచ్చింది? ఊళ్లో వాళ్లు తండ్రి మంచోడు కాదంటే మాట్లాడ్డం మానేస్తాడా?

హీరోకు కూతురును ఇవ్వడం ఇష్టం లేని మామ, చంపించేందుకు కూడా వెనుకడానికి మామ, ఓ చెంప దెబ్బ తినగానే తిన్నగా పిల్లను తీసుకోవచ్చి..తీసుకో అని హీరో చేతిలో పెట్టేస్తాడా?

అసలు ఆది నుంచి అంతం వరకు హీరో ఎందుకు అలా సదా పీకల మటుకు తాగేస్తూ వుంటాడు? మాస్ క్యారెక్టర్ అంటే అదేనా?

అసలు హీరో తండ్రి క్యారెక్టర్ ఎందుకలా చులకనైపోయింది? ఆ పాత్ర సమస్య ఏమిటి? అన్నది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసారు?

సరే ఈ ప్రశ్నల సంగతి అలా వుంచితే సినిమాలో రెండు ఆణిముత్యాల్లాంటి ఎపిసోడ్ లు వున్నాయి. ఒకటి తన కళ్యాణమండపంలో ఒక పెళ్లి కోసం హీరో స్వాతిముత్యం సినిమా ఆదర్శంగా తీసుకుని, తయారుచేసిన కామెడీ ఎపిసోడ్ .

రెండు హీరో లవ్ ట్రాక్ లో అతి అద్భుతమైన ట్విస్ట్ అనుకుని ప్రవేశపెట్టిన బేకార్ పెళ్లికొడుకు వ్యవహారం. అసలు సినిమా టేకింగ్ నే చాలా చోట్ల ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టింది ఈ రెండు ఎపిసోడ్ లు ఆ విషయంలో ఫస్ట్ ర్యాంక్ కొట్టేస్తాయి. పెళ్లిళ్ల గురించి హీరో ఇచ్చే ఉపన్యాసం కూడా తన ర్యాంక్ తాను సాధిస్తుంది.

మాస్ సినిమా అంటే కాస్త నాటు డైలాగులు కూడా వుండాలని రూలేమైనా పెట్టుకున్నారేమో? ఆ విధంగా కూడా ట్రయ్ చేసారు. ఆ డోస్ సరిపోదేమో అనుకున్నారేమో? కాస్త ‘చేతి ఊపులు’ కూడా వాడేసారు.

నిజానికి హీరోకి ఇంతో అంతో విషయం వుంది. నటనలోనే కాదు, సంభాషణలు రాయడంలో కూడా. కానీ స్క్రిప్ట్ రాయడంలో మాత్రం పూర్తిగా అన్ ఫిట్ అనే చెప్పాలి. తనకు, తన ఫిజిక్ కు, తన లుక్స్ కు సరిపడా పాత్రలు తీసుకుని, మెలమెల్లగా ఒక్కో సినిమా చేసుకుంటూ వస్తే అది వేరుగా వుంటుంది. ఎకాఎకి మాస్ సినిమా చేయాలనుకుని, మాస్ సినిమాకు తగిన స్క్రిప్ట్ తయారు చేసుకోలేకపోతే అది ఎస్ ఆర్ కళ్యాణమండపం మాదిరిగా వుంటుంది. సినిమాలో హీరో గురించి కాస్తయినా మాట్లాడుకోవడానికి వుంటుంది. కానీ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గురించి మాట్లాడుకోవాలని సంకల్పించినా ఏమీ వుండదు. పైగా ఆ నడుము గోల ఒకటి.

కిచిడి అంటే వెజిటబుల్స్ వేసేయాలని వేసేనట్లు, సినిమా అంటే అనేక రకాల ఫ్యాక్టర్స్ వుండాలని అనుకుని ఎక్కడ గుర్తు వచ్చినవి అక్కడ వేసేసారు. పాత హిట్ సాంగ్స్ నుంచి పాత సినిమాల హిట్ పాయింట్ల మీదుగా పవర్ స్టార్ ను చూపించడం వరకు. కానీ వాటికి కూడా ఓ సరైన ప్లేస్మెంట్, ఇతరత్రా వ్యవహారాలు వుండకపోతే పండవు అని అస్సలు అనుకోలేదు.

రెండు పాటలు బాగున్నాయి కానీ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కు ఏ స్కోరూ రాదు. ఫొటోగ్రఫీ ఓకె. మొత్తం మీద లాక్ డౌన్ అనంతరం జనాలు పరుగెత్తుకు వెళ్లిపోయి సినిమా చూడాలనుకున్నా, అంత చాన్స్ ఇవ్వని సినిమా ఇది.

ప్లస్ పాయింట్లు

సెంటిమెంట్ పాయింట్

మైనస్ పాయింట్లు

మిగిలిన పాయింట్లు అన్నీ

ఫినిషింగ్ టచ్: కళ్యాణమండపాన్ని రిన్నోవేట్ చేయాలి

-సూర్య

Rating: 2.5/5

This post was last modified on August 6, 2021 9:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప‌ద‌హారు వేల‌ ప‌దవులు.. చంద్ర‌బాబు బీసీ మంత్రం.. !

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రో బీసీ మంత్రాన్ని ప‌ఠిస్తున్నారు. వారికి ఇప్ప‌టికే.. స‌రైన స‌ముచిత ప్రాధాన్యం క‌ల్పించిన…

2 hours ago

బాబీని ఇబ్బంది పెట్టిన ఆ సినిమా ఏది?

‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…

2 hours ago

మరణశిక్షపై ట్రంప్ కఠిన వైఖరి!

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్ మరణశిక్ష అమలుపై తన కఠినమైన వైఖరిని వ్యక్తం చేశారు.…

3 hours ago

పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఇంకా తగ్గలేదు

మాములుగా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు వారాల తర్వాత బాగా నెమ్మదించిపోతుంది. మొదటి పది…

3 hours ago

ఉస్తాదుకి పనికొచ్చే బేబీ జాన్ పొరపాట్లు !!

పెద్ద అంచనాలతో బాలీవుడ్ మూవీ బేబీ జాన్ రిలీజయ్యింది. విజయ్ బ్లాక్ బస్టర్ తెరీ రీమేక్ గా అట్లీ నిర్మాణంలో…

4 hours ago