ఇండస్ట్రీలో, సామాన్యుల్లో సినిమా టికెట్ రేట్ల గురించి చర్చ జరగడం కొత్తేమి కాదు. పెద్ద హీరోలతో ప్యాన్ ఇండియా మూవీస్ తీయడం బాగా పెరిగాక నిర్మాతల బడ్జెట్ లు అమాంతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని రికవర్ చేసుకోవడానికి ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకుని వారం నుంచి పది రోజుల దాకా వంద నుంచి నూటా ముప్పై రూపాయల దాకా పెంచుకునే వెసులుబాటు తెచ్చుకోవడం బాహుబలి నుంచి దేవర దాకా చాలా సార్లు చూశాం. ఒక కుటుంబం లేదా స్నేహితుల బృందం కలిసి థియేటర్ కు వెళ్తే కనీసం వెయ్యి నుంచి పదిహేను వందల దాక ఖర్చవుతున్న వైనం మీదే ఇప్పుడు డిస్కషన్లు జరుగుతున్నాయి.
ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ కాలంలో అణా కాణీలతో మొదలైన టికెట్ రేట్లు రూపాయలకు మారేదాకా ఎన్నో పరిణామ క్రమాలు పరిశ్రమ చూసింది. చిల్లర పైసలు అమలులో ఉన్నప్పుడే లవకుశ కోటి రూపాయలు వసూలు చేయడం చరిత్ర మర్చిపోలేని మైలురాయి. బాల్కనీ మూడు నాలుగు రూపాయలు ఉన్నప్పుడు అడవి రాముడు లాంటివి కనకవర్షం కురిపించాయి. ఘరానా మొగుడు, చంటి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టినప్పుడు హైదరాబాద్ లో పై తరగతి రేటు పది రూపాయల లోపే. పోకిరి నలభై కోట్లు వసూలు చేసినప్పుడు బిసి సెంటర్స్ లో ముప్పై రూపాయల లోపే అప్పర్ క్లాస్ టికెట్ ధరలున్నాయి.
కానీ ఆయా కాలాల్లో థియేటర్ రెవిన్యూలు ఎక్కువగా రావడానికి ఎన్నో కారణాలు. అప్పటికి ఓటిటి లేదు. ఇంటర్నెట్ వాడకం పెరిగింది 2000 సంవత్సరం తర్వాతే. పైరసీ పెరిగింది కూడా అప్పుడే. అంతకు ముందు టీవీలో వచ్చే పరిమిత ఎంటర్ టైన్మెంట్ కి మించి వినోదాన్ని అందుకోవాలంటే జనాలు ఖచ్చితంగా థియేటర్ కు వెళ్లాల్సి వచ్చేది. వీడియో క్యాసెట్ల నుంచి డివిడిల దాకా ఒరిజినల్ వెర్షన్లు ఆరేడు నెలల తర్వాత రిలీజయ్యేవి. కానీ ఇప్పుడు ఇరవై ఎనిమిది రోజుల గ్యాప్ లో సలార్, గుంటూరు కారం లాంటివి డిజిటల్ లో వచ్చేస్తున్నాయి. ఎందుకో కరోనా నుంచి ఓటిటి హక్కుల దాకా బోలెడు రీజన్స్.
నిన్న నిర్మాత ఎస్కెఎన్ అన్నట్టు సినిమా హాళ్లకు వచ్చే ఆడియన్స్ తగ్గిపోతున్న క్రమంలో పెట్టుబడిని త్వరగా సేఫ్ చేసుకోవాలంటే వారం పది రోజులనే టార్గెట్ చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే నష్టాలు తప్పవు. దేవర, కల్కి 2898 ఏడికి ప్రొడ్యూసర్లు నిశ్చింతగా ఉన్నారంటే టికెట్ రేట్లు పెరగడం వల్లే కదా. పోనీ ప్రేక్షకులు తమకిది భారం అనుకుంటే ఓ వారం ఆగడం తప్ప వేరే ఆప్షన్ లేదు. పెద్ద చిత్రాలకు రేట్లు పెంచినప్పుడు మరి చిన్న సినిమాలకు తగ్గించాలనే వాదనని కాదనలేం. దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. మొన్న సుహాస్, సుధీర్ బాబులకు కూడా మల్టీప్లెక్సుల్లో రెండు వందల రేట్ పెట్టారు.
ఒకరకంగా చెప్పాలంటే ఈ టికెట్ రేట్ల వ్యవహారం అంతులేని కథ లాంటిది. గుళ్లో దర్శనం త్వరగా జరగాలంటే స్పెషల్ టికెట్లు ఎలా అయితే అధిక ధరలకు కొంటామో అలాగే స్టార్ హీరోల సినిమాలకూ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ హీరోలను దేవుళ్లతో పోల్చడం కాదు ఉద్దేశం. డబ్బు చెల్లించేందుకు భక్తులు ఎలా అయితే సిద్ధంగా ఉంటారో అభిమానులూ అదే తరహాలో తమ హీరో కోసం సొమ్ములు ఎక్కువైనా పర్వాలేదని అనుకుంటున్నారు. ఇకపై దీనికి అలవాటు పడటం తప్ప వేరే మార్గం కనిపించదు. నాణేనికి రెండు వైపులా చూడాలనే తరహాలో సమాజానికి దీనివల్ల నష్టమేమీ లేనప్పుడు వాదనలు చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు.
This post was last modified on October 15, 2024 5:17 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ…