ఇటీవల మంచి అంచనాలతో విడుదలైన ‘శ్వాగ్’ మూవీ.. ఆ అంచనాలను అందుకోలేకపోయింది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. ఐతే యుఎస్ ప్రిమియర్స్ నుంచి వచ్చిన టాక్, రివ్యూలు చూసి సినిమా బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయిపోతుందా అన్న సందేహాలు కలిగాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో షోలు చూసిన ప్రేక్షకులు సినిమా అంత బ్యాడ్‌గా ఏమీ లేదని తీర్మానించారు. సినిమాకు ఓ మోస్తరుగా వసూళ్లు వచ్చాయి. కానీ ఓవరాల్‌గా టీం ఆశించిన ఫలితం అయితే రాలేదు.
ఈ నేపథ్యంలో ‘శ్వాగ్’ సక్సెస్ మీట్‌లో హీరో శ్రీ విష్ణు.. ఈ సినిమా నచ్చని వారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. తమ సినిమా 90 శాతం మందికి నచ్చిందని.. పది శాతం మంది మాత్రమే కొంత నిరాశ పడ్డారని చెప్పాడు. ఆ పది శాతం మంది మాత్రం కథలో కొంచెం కన్ఫ్యూజన్ ఉందని అన్నట్లు శ్రీ విష్ణు తెలిపాడు.
ఆ పది శాతం మందిని కూడా అలరించేలా తన తర్వాతి సినిమా ఉంటుందని శ్రీ విష్ణు హామీ ఇచ్చాడు. ‘‘మా సినిమా 90 శాతం మందికి నచ్చింది. మిగతా పది శాతం మంది కథ కొంచెం గందరగోళంగా ఉందన్నారు. కానీ వాళ్లతో సహా ఎవ్వరూ కూడా సినిమా బాాలేదని అనట్లేదు. కొత్తగా ప్రయత్నించినపుడు కొన్ని నెగెటివ్ కామెంట్స్ సహజమే. నేను గతంలో చేసిన సినిమాల్లో నటన గురించి ఇప్పటికీ మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు అవన్నీ ఆపేసి శ్వాగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకులను గెలిపించడానికి ఈ సినిమా చేశాను. ఈ రోజు వాళ్లందరూ గెలిచి మమ్మల్ని గెలిపించారు. ఇలాంటి రిస్క్ ఉన్న కథలు ఎంచుకోకపోతే మన తర్వాతి తరం వారిలో స్ఫూర్తి నింపలేం. ఏ సినీ నేపథ్యం లేని నన్ను ఈ స్థాయిలో ఉంచిన తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకుంటూనే ఉంటాను. ఈ సినిమాను ఎంజాయ్ చేయలేకపోయిన పది శాతం మందికి కూడా తర్వాతి ప్రాజెక్టుతో పూర్తి వినోదాన్ని ఇస్తానని మాటిస్తున్నా. మీకు వడ్డీతో సహా వినోదాన్ని అందిస్తా. లేదంటే లావైపోతాను’’ అని శ్రీ విష్ణు అన్నాడు.
This post was last modified on October 15, 2024 4:48 pm
ఒకే సినిమాపై సంవత్సరాల తరబడి ఖర్చు చేయడం బాహుబలి నుంచే మొదలయ్యిందని చెప్పాలి. గతంలో అంజి, అమ్మోరు లాంటివి సుదీర్ఘ…
ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…