సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తోందంటే ఒకప్పుడు తెలుగులో కూడా ఎంత హడావుడి ఉండేదో. ఇక్కడి సూపర్ స్టార్ల సినిమాలతో సమానంగా హైప్ కనిపించేది. ఆయన చిత్రాలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే ప్రేక్షకులు ఎగబడి టికెట్లు కొనేవాళ్లు. షోలకు షోలు నిమిషాల్లో సోల్డ్ ఔట్ అయిపోయేవి.
కానీ ‘కబాలి’, ‘కాలా’, ‘పేట’, ‘దర్బార్’ లాంటి సినిమాల పుణ్యమా అని ఆయన క్రేజ్ కరిగిపోతూ వచ్చింది. దీంతో రజినీ సినిమా రిలీజవుతుంటే ముందున్న హైప్ కనిపించడం లేదు. ఐతే మధ్యలో ‘జైలర్’ సినిమాకు మాత్రం మంచి బజ్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి.
సినిమాకు ఓపెనింగ్స్ కూడా భారీగా వచ్చాయి. ఆ చిత్రానికి లాంగ్ రన్ కూడా వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత రజినీ సినిమాకు హంగామా కనిపించింది ఆ చిత్రంతోనే. కానీ ఆ ఊపు తర్వాత కొనసాగడం లేదు. రజినీ స్పెషల్ రోల్ చేసిన ‘లాల్ సలాం’ను అసలు మన ప్రేక్షకులు పట్టించుకోలేదు. తమిళంలో కూడా అది డిజాస్టర్ అయింది.
ఐతే ‘జై భీమ్’ దర్శకుడితో రజినీకాంత్ నటించడం.. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫాహద్ ఫాజిల్ లాంటి మేటి ఆర్టిస్టులు స్పెషల్ రోల్స్ చేయడంతో ‘వేట్టయాన్’కు బాగానే క్రేజ్ ఉంటుందని భావించారు. కానీ టీజర్, ట్రైలర్ అంత ఎగ్జైటింగ్‌గా లేకపోవడం వల్లో.. ఇది సీరియస్ కంటెంట్ ఉన్న సినిమాలా కనిపించడం వల్లో ఏమో కానీ ‘వేట్టయాన్’కు తెలుగులో బజ్ అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ డల్లుగా ఉన్నాయి.
బుక్ మై షోలో సోల్డ్ ఔట్ షోలే కనిపించడం లేదు. కొన్ని మాత్రమే ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఈ సినిమాకు ఆశించిన బజ్ కనిపించడం లేదు. ‘వేట్టయాన్’ అని తమిళ టైటిల్ పెట్టడం కూడా ఈ చిత్రానికి మైనస్ అయినట్లు కనిపిస్తోంది. గతంలో రజినీ సినిమాల పేర్లు, డబ్బింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనిపించేది. కానీ ఈసారి అన్యాయంగా ‘వేట్టయాన్’ అనే తమిళ టైటిల్ పెట్టి రిలీజ్ చేయడం మన ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పించినట్లుంది. కంటెంట్ కూడా ఎగ్జైటింగ్‌గా కనిపించకపోవడంతో ఈ సినిమాను లైట్ తీసుకుంటున్నట్లున్నారు.
This post was last modified on October 15, 2024 4:45 pm
తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…
21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…
కొన్ని సినిమాలు నేటివిటీ మీద ఆడతాయి. ఒక చోట బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన పక్కన కూడా అదే రిజల్ట్…
మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…
ఒకసారి టీమ్ఇండియా నుంచి బయటకు వెళ్లాక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రావడం అంత ఈజీ కాదు. అందులోనూ 36 ఏళ్ల…
స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు…