ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ఆగస్టు 15కే రావాల్సిన ఈ చిత్రం డిసెంబరు 5కు వాయిదా పడిపోయింది. ఈ న్యూస్ ముందు తీవ్ర నిరాశ కలిగించినా.. తర్వాత అభిమానులు సరేలే అని సర్దుకున్నారు. ఒక దశలో డిసెంబరు 5కైనా సినిమా వస్తుందా అనే సందేహాలు కలిగాయి. కానీ అ అనుమానాలను పటాపంచలు చేస్తూ టీం వడివడిగా షూటింగ్ చేస్తూ డెడ్ లైన్ అందుకునే దిశగా సాగుతోంది.
తాజాగా ‘పుష్ప-2’ టీం నుంచి బయటికి వచ్చిన అప్‌డేట్ అభిమానులకు మాంచి ఉత్సాహాన్నిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌ను సుకుమార్ అండ్ టీం లాక్ చేసేసింది. ప్రథమార్ధం వరకు ఎడిటింగ్ అంతా పూర్తి చేసి.. ఫైనల్ కట్‌కు ఓకే చెప్పేశాడు సుకుమార్. మామూలుగా ఇదేమంత పెద్ద న్యూస్ కాదు కానీ.. సుకుమార్ సినిమాల విషయంలో మాత్రం విశేషమే.
షూటింగ్‌కి ఎక్కువ టైం తీసుకున్నట్లే ఎడిటింగ్ విషయంలోనూ సుకుమార్ చాలా సమయం తీసుకుంటాడని పేరుంది. ఒక పట్టాన ఏదీ ఓకే చేయడు. లాక్ చేయడు. ‘పుష్ప’ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులు సమయానికి పూర్తి కాక చివర్లో ఎంత హడావుడి అయిందో తెలిసిందే. రిలీజ్‌కు ముందు రోజు వరకు ఆ పనులు సాగాయి. చివరికి ఔట్‌పుట్ పర్ఫెక్ట్‌గా లేక ప్రేక్షకులు కొంత ఇబ్బంది పడ్డారు. ‘పుష్ప-2’కు ఆ పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్త పడుతున్నారు.
షూటింగ్ ఆలస్యమై హడావుడి తప్పనప్పటికీ.. సమాంతరంగా ఎడిటింగ్ పనులు చేయడం ప్లస్ అవుతోంది. సుకుమార్ కూడా ఈసారి అప్రమత్తంగా ఉంటూ విడుదలకు రెండు నెలల ముందే ఫస్టాఫ్‌ను ఓకే చేసేశాడు. ఈ నెల చివరికి ‘పుష్ప-2’ షూట్ మొత్తం అయిపోతుందని సమాచారం. ఆ తర్వాత ఓ మూడు వారాలు సెకండాఫ్ ప్రి ప్రొడక్షన్ పనులకు కేటాయిస్తారు. విడుదలకు పది రోజుల ముందే ఫస్ట్ కాపీ తీసి తాపీగా ప్రమోషన్లు చేసుకోవాలన్నది టీం ప్లాన్. ప్రస్తుతానికి అంతా ట్రాక్ మీదే ఉన్నట్లు తెలుస్తోంది.
This post was last modified on October 15, 2024 4:44 pm
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…
మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…
వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…
వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ,…
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…