టాక్ షోలలో కొత్త ట్రెండ్ సృష్టించిన ఆన్ స్టాపబుల్ సీజన్ 4 ఈ నెల 24 నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. మొన్న జరిగిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో యానిమేషన్ తో కూడిన ప్రత్యేక వీడియో అభిమానులను ఆకట్టుకుంది. గెస్టులు ఎవరు రాబోతున్నారనేది పూర్తి లిస్టు బయటికి రాలేదు కానీ దుల్కర్ సల్మాన్, అల్లు అర్జున్ లాంటి ఒకటి రెండు పేర్లయితే లీకయ్యాయి. ఇప్పుడు అందరి దృష్టి బన్నీ ఎపిసోడ్ మీదే ఉంది. గతంలో ఈ కలయిక జరిగినప్పటికీ అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. బన్నీ నుంచి వినాల్సిన సంగతుల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
వాటిలో పుష్ప 2 కన్నా ప్రధానమైన విషయాలు కొన్నున్నాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో వైసిపి అభ్యర్థి కోసం అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం మీద పెద్ద దుమారమే రేగింది. మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ రెండుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధాలు చేసుకున్నారు. టిడిపి జనసేన కూటమి గెలిచాక కూడా కొంత కాలం ఇవి కొనసాగాయి. బన్నీ వాస్, అల్లు అరవింద్ పలు సందర్భాల్లో దీని గురించి ఇన్ డైరెక్ట్ గా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసినా వాళ్ళు చెప్పిన సమాధానాలు వేడిని పూర్తిగా చల్లార్చలేకపోయాయి. వాటికి బన్నీనే స్వయంగా సమాధానం చెబితే తప్ప క్లారిటీ రాదు.
అందుకే బాలయ్య బన్నీ 2 ఎప్పుడు వచ్చినా వ్యూయర్ షిప్ మోత మోగిపోవడం ఖాయం. మాములుగా అయితే అల్లు అర్జున్ ఇలా రెండుసార్లు ఒకే ప్రోగ్రాంకి ఓకే చెప్పేవాడు కాదేమో. కానీ ఆహా ప్లాట్ ఫార్మ్ కావడం, పుష్ప 2 విడుదల దగ్గరగా ఉండటం, తండ్రి అల్లు అరవింద్ సలహా, బాలయ్యతో బాండింగ్ ఇలా ఎన్నో అంశాలు రిపీట్ కి దోహదం చేశాయి. కాకపోతే అన్నింటికీ చెక్ పడేలా బన్నీ ఓపెన్ అవుతాడా లేదానేది వేచి చూడాలి. డిసెంబర్ 6 పుష్ప 2 ది రూల్ రిలీజ్ కానున్న నేపథ్యంలో దానికి ఒకటి రెండు వారాల ముందు ఈ స్పెషల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వొచ్చని గీత కాంపౌండ్ టాక్.
This post was last modified on October 15, 2024 11:08 am
కన్నతల్లిని మోసం చేసిన రాజకీయ నాయకుడిగా జగన్ కొత్త చరిత్ర సృష్టించారని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్, జగన్ సోదరి…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకుని ఉన్న 400 ఎకరాల భూముల విషయంపై తీవ్ర వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. దీనిపై…
జనసేన నాయకుడు.. ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి పోటీ లేకుండానే విజయం దక్కించుకున్న కొణిదల నాగబాబు.. రంగంలోకి…
ఏపీ రాజధాని అమరావతికి స్టార్ ఇమేజ్ రానుందా? ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన స్టార్ హోటళ్ల దిగ్గజ సంస్థలు.. అమరావతిలో…
అలేఖ్య చిట్టి పికిల్స్.. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి దీని గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. రాజమండ్రికి చెందిన…
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. తాజాగా ఆమె మీడియాతో…