Movie News

దసరా వేస్టయింది.. మరి దీపావళి?

పెద్ద పెద్ద పండుగల వచ్చినపుడు మంచి క్రేజున్న సినిమాలు ఒకేసారి మూణ్నాలుగు దాకా రిలీజవుతుంటాయి. ఈ విషయంలో సంక్రాంతికి ఉండే డిమాండే వేరు. ఒకేసారి నాలుగు క్రేజీ సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. టాక్ బాగుంటే అన్నీ కూడా బాగా ఆడేస్తుంటాయి. ఆ తర్వాత దసరా, దీపావళి పండుగలకు కూడా డిమాండ్ ఉంటుంది. ఐతే కొన్నేళ్ల నుంచి దసరాను టాలీవుడ్ సరిగా ఉపయోగించుకోవట్లేదు. ‘భగవంత్ కేసరి’ బాగా ఆడినా.. టైగర్ నాగేశ్వరరావు నిరాశపరిచింది. 

డబ్బింగ్ సినిమా ‘లియో’ పర్వాలేదనిపించింది. ఈసారి దసరా మరింత డల్ అయింది. డబ్బింగ్ మూవీ ‘వేట్టయన్’ మీదే ఎక్కువ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. రజినీ సినిమా అయినా సరే.. ఓపెనింగ్స్ కరవయ్యాయి. తెలుగు చిత్రాల్లో విశ్వం, మా నాన్న సూపర్ హీరో, జనక అయితే గనక.. వీటిలో ఏదీ కంటెంట్ పరంగా మెప్పించలేకపోయింది. అన్నీ ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకున్నాయి.

ఇక ప్రేక్షకుల దృష్టి దీపావళి మీదికి మళ్లనుంది. మధ్యలో కొన్ని వారాలు బాక్సాఫీస్ డల్లుగానే నడిచేలా కనిపిస్తోంది. దీపావళికి తెలుగులో మామూలుగా పోటీ తక్కువే కానీ.. ఈసారి మాత్రం ఎక్కువగానే ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయి. విశ్వక్సేన్ సినిమా ‘మెకానిక్ రాకీ’ రేసు నుంచి తప్పుకున్నప్పటికీ.. నాలుగు సినిమాలు పోటీలో నిలవబోతున్నాయి. వీటిలో దుల్కర్ సల్మాన్ మూవీ ‘లక్కీ భాస్కర్’ మీద ఎక్కువ అంచనాలున్నాయి. 

అది ప్రామిసింగ్ మూవీలా కనిపిస్తోంది. నిఖిల్ నుంచి సడెన్ సర్ప్రైజ్‌లా రానున్న ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ కూడా దీపావళికే షెడ్యూల్ అయింది. లేటెస్ట్‌గా కిరణ్ అబ్బవరం మూవీ ‘క’ను కూడా దీపావళి రేసులో నిలబెట్టారు. చూడ్డానికి ఇది కూడా కంటెంట్ ఉన్న సినిమాలాగే కనిపిస్తోంది. వీటికి తోడు తమిళ అనువాదం ‘అమరన్’ కూడా ఇదే పండక్కి రిలీజవుతుంది. సినిమాలైతే పైకి ఇంట్రెస్టింగ్‌గానే కనిపిస్తున్నాయి. మరి దసరాకు వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్ దీపావళికైనా కళకళలాడుతుందేమో చూడాలి.

This post was last modified on October 15, 2024 9:37 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది

గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…

17 minutes ago

నిత్యమీనన్ ఆ బయోపిక్ ఎందుకు చేయలేదు?

దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…

42 minutes ago

గౌతమ్ మీనన్ షాకింగ్ కామెంట్స్

తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

2 hours ago

‘షా’ మాట‌లు హుష్‌.. బీజేపీ నేత‌లు మార‌రా?

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా నాలుగు రోజుల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించా రు. విజ‌యవాడ…

2 hours ago

వ‌ల‌సల‌పై ట్రంప్ నిర్ణ‌యం.. అమెరికాకు చేటేనా?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి మాట‌లు చె ప్పినా.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు…

3 hours ago

కొత్త తరం దర్శకులతో చిరంజీవి లైనప్

తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…

4 hours ago