Movie News

ఆ రోజు నుంచి ‘రాజా సాబ్’ నాన్ స్టాప్ ధమాకా

ఈ ఏడాది కల్కి చిత్రంతో మురిపించాడు రెబల్ స్టార్ ప్రభాస్. దీని తర్వాత ఎక్కువ గ్యాప్ లేకుండా తన నుంచి మరో సినిమా రాబోతోంది. వచ్చే ఏడాది వేసవికి ‘రాజా సాబ్’ షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ స్థాయి హీరో నుంచి ఇంకో తొమ్మిది నెలల్లోనే ఇంకో పెద్ద సినిమా రావడం అంటే అభిమానులకు పండుగ అన్నట్లే. నిజానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొంత ఆలస్యం అయింది. 

ఇప్పటిదాకా ‘రాజా సాబ్’ నుంచి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్.. ఇంకో చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారంతే. ఆ తర్వాత టీం సైలెంటుగా షూటింగ్ చేసుకుంటోంది. మరి ఈ సినిమాకు ప్రమోషన్ల హంగామా ఎప్పట్నుంచి మొదలవుతుంది అనే విషయంలో అభిమానులు ఆసక్తితో ఉన్నారు. ఈ అప్‌డేట్‌ను ప్రభాస్ సన్నిహితుడైన పీఆర్వో కమ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తాజాగా వెల్లడించాడు.

ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాను కలిసిన ఎస్కేఎన్.. ‘రాజా సాబ్’ గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు. ఇటీవల ప్రచారం జరుగుతున్నట్లే ప్రభాస్ పుట్టిన రోజు అయిన అక్టోబరు 23న ‘రాజా సాబ్’ టీజర్ ఉంటుందని.. ఆ తర్వాత కూడా వరుస అప్‌డేట్స్ ఉంటాయని ఎస్కేఎన్ చెప్పాడు. “అక్టోబరు 23 నుంచి ‘రాజా సాబ్’కు సంబంధించి వరుస అప్‌డేట్స్ ఇవ్వాలని దర్శకుడు మారుతి, నిర్మాత విశ్వప్రసాద్ ప్రణాళికలు వేసుకున్నారు. త్వరలోనే అప్‌డేట్స్ గురించి వివరాలు వెల్లడిస్తాం. 

అక్టోబరు 23 నుంచి విడుదల వరకు ప్రేక్షకులను ‘రాజా సాబ్’ ప్రపంచంలోకి తీసుకెళ్తూ ఉంటాం. మారుతి ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా షూట్ చేస్తున్నారు. వినాయక చవితి, దసరా.. ఇలా ఏ పండుగకూ సెలవు తీసుకోకుండా సినిమా కోసం కష్టపడుతున్నాడు. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు” అని ఎస్కేఎన్ తెలిపాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ‘రాజా సాబ్’ విడుదల కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే.

This post was last modified on October 15, 2024 9:29 am

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

1 hour ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

3 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

3 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

3 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

5 hours ago