గత ఏడాది పెదకాపు పార్ట్ 1 అనే సినిమా ఒకటొచ్చిందంటే సామాన్య ప్రేక్షకులు గుర్తుకు తెచ్చుకోవడం కష్టం. అంత పెద్ద ఫ్లాపు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఫీల్ గుడ్ మూవీస్ అందించిన శ్రీకాంత్ అడ్డాల చాలా గ్యాప్ తర్వాత తీసిన చిత్రం కావడంతో ఓ మోస్తరు అంచనాలైతే నెలకొన్నాయి. హీరోగా విరాట్ కర్ణ పరిచయమయ్యాడు. కానీ పెదకాపు దారుణంగా పోయింది. కంటెంట్ మీద నమ్మకంతో రెండు భాగాలు తీయాలని ముందే ప్లాన్ చేసుకున్నారు కానీ ఫలితం చూశాక సీక్వెల్ ఆలోచనకు గుడ్ బై చెప్పేశారు. అయినా సరే విరాట్ కర్ణకు జాక్ పాట్ తగిలింది. అదే ఇవాళ ప్రారంభమైన నాగబంధనం.
కళ్యాణ్ రామ్ డెవిల్ ది బ్రిటిష్ ఏజెంట్ తో దర్శకుడిగా మారిన నిర్మాత అభిషేక్ నామా రెండో ప్యాన్ ఇండియా మూవీ ఇది. నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. దీనికి చాలా పెద్ద బడ్జెట్ పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఇవాళ పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు. విరాట్ కర్ణకు ఇది జాక్ పాట్ అనే చెప్పాలి. డెబ్యూ ఆశించిన ఫలితం ఇవ్వలేదు సరికదా కనీసం తన నటనను పూర్తి స్థాయిలో జడ్జ్ చేసే ఛాన్స్ కలిగించలేదు. అయినా సరే నాగబంధనం లాంటి ప్రాజెక్టు దక్కడం అదృష్టమే. పోస్టర్ గట్రా చూస్తుంటే ఫాంటసీ ఎలిమెంట్స్ చాలా బలంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది.
ఇది హిట్ కావడం విరాట్ కు చాలా అవసరం. మాములుగా మొదటి సినిమా యావరేజ్ అయితే అవకాశాలు వస్తాయి. అలాంటిది పెదకాపు పార్ట్ 1 అంత బోల్తా కొట్టినా ఇంత బడ్జెట్ పెట్టే నిర్మాత దొరకడం లక్ కాక మరేమిటి. వచ్చే ఏడాది రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న నాగబంధనంని ఇండియాలోని పలు క్లిష్టమైన లొకేషన్లతో విదేశాల్లో షూట్ చేయబోతున్నారు. డెవిల్ సమయంలో డైరెక్షన్ విషయంలో కొంత వివాదం ఎదురుకున్న అభిషేక్ నామా ఈసారి తన టాలెంట్ ని పెద్ద స్థాయిలో నిరూపించుకోబోతున్నారు. అందులోనూ రెగ్యులర్ జానర్ కాకుండా విఎఫ్ఎక్స్ డిమాండ్ చేసే కథను ఎంచుకోవడం విశేషం.
This post was last modified on October 14, 2024 3:49 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…