Chiranjeevi NTR and Ram Charan
మెగా, నందమూరి కుటుంబాల మధ్య ఉన్న అంతరం.. అభిమానుల మధ్య శత్రుత్వం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇది దశాబ్దాల నుంచి నడుస్తున్న చరిత్రే. అలాంటిది ఈ రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు అగ్ర కథానాయకులు కలిసి సినిమా చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు.
కానీ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. వీళ్లిద్దరూ ఆఫ్ ద సెట్స్ కూడా చాలా స్నేహంగా ఉంటున్న సంగతి పలు సందర్భాల్లో రుజువైంది. సంబంధిత ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు వీరి స్నేహం విషయంలో ఎలా ఫీలవుతున్నారో కానీ.. చరణ్ తండ్రి చిరంజీవికి మాత్రం వీరి స్నేహం ముచ్చటగొలుపుతోందట.
ఇండస్ట్రీలో అగ్ర కథానాయకులు వ్యక్తిగతంగా స్నేహంగా మెలగడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని.. తన వరకు అందరితో స్నేహంగా ఉండటానికి ఎంతో తపించేవాడినని చిరు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇద్దరు స్టార్ హీరోలు అన్నదమ్ముల్లా మెలిగితే వాళ్ల అభిమానుల మధ్య కూడా అలాంటి వాతావరణమే ఉంటుందని.. అందుకే ఈ విషయంలో తానెంత తపన పడేవాడినో ఇండస్ట్రీ జనాలందరికీ తెలుసని చిరు అన్నాడు.
తోటి హీరోలతో సఖ్యతతో మెలిగే విషయంలో చరణ్ తనను అనుసరిస్తున్నాడని.. తారక్‌తో అతడికి వ్యక్తిగతంగా మంచి స్నేహం ఉందని చిరు చెప్పాడు. వీరి స్నేహం తనకు ముచ్చటగొలుపుతుందన్న చిరు.. ప్రస్తుతం స్టార్ హీరోలందరూ కూడా బయట స్నేహితుల్లా మెలగడం మంచి పరిణామం అన్నాడు.
This post was last modified on April 28, 2020 2:34 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…