కెజిఎఫ్ రాకముందు ఆయన పేరు శాండల్ వుడ్ లో తప్ప మిగిలిన భాషల్లో ఎవరికీ తెలియదు. కానీ ఆ తర్వాత జరిగింది హిస్టరీ. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ సాంగ్స్ తో రవి బస్రూర్ తనను తాను నిరూపించుకున్న వైనం దర్శకులు వెంటపడేలా చేసింది. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ తో అతి తక్కువ టైంలో సలార్ రూపంలో గొప్ప అవకాశం దక్కించుకోవడమంటే మాటలు కాదు. దానికి తగ్గట్టే తన మీద పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకుంటూ కాటేరమ్మ లాంటి ఎపిసోడ్స్ కి రవి ఇచ్చిన నేపధ్య సంగీతం దాని స్థాయిని పదింతలు పెంచింది. ఈ రెండూ ప్రశాంత్ నీల్ సినిమాలన్నది తెలిసిన విషయమే.
ఇక నాణేనికి మరోవైపుకు వద్దాం. పైన చెప్పిన వాటిని మినహాయిస్తే రవి బస్రూర్ ఇంకే ఇతర సినిమాల్లో అంత మేజిక్ చేయలేకపోయాడనేది మ్యూజిక్ లవర్స్ ని కలవరపరిచే వాస్తవం. తెలుగులో బీజీఎమ్ ఇచ్చిన మార్షల్, శాసనసభ లాంటివి కనీసం పేర్లు కూడా ఆడియన్స్ కి గుర్తు లేవు. గోపీచంద్ భీమాకు స్కోర్ ఇచ్చింది తనేనంటే చాలా మంది ఆశ్చర్యపోతారేమో. హిందీలో సల్మాన్ ఖాన్ పిలిచి మరీ కిసీకా భాయ్ కిసీకా జాన్ కోసం నేపధ్య సంగీతం అడిగితే అక్కడా నిరాశే. కబ్జా నుంచి మొన్నొచ్చిన మార్టిన్ దాకా ఇదే తంతు. డౌట్ ఏంటంటే అసలు డైరెక్టర్లే కెజిఎఫ్ లాంటి సంగీతం ఇమ్మని అడిగి సతాయిస్తున్నారాని.
అనిరుధ్ రవిచందర్ లాగా రవి బస్రూర్ తనదైన ఒక ముద్ర అన్ని భాషల్లో వేయగలగాలి. దర్శకులు ఏం అడుగుతున్నారనేది పక్కన పెడితే కెజిఎఫ్ తరహా సౌండింగ్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో బస్రూర్ కంపోజింగ్ లో మార్పులు రావాల్సిన అవసరముందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తన చేతిలో జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు ఉంది. సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం వస్తుంది. వీటిని తీసేది నీలే అయినా అంచనాల బరువుని బాధ్యతగా మోయాల్సిన అవసరం రవి బస్రూర్ మీద ఉంది. సక్సెస్ మాత్రం మాట్లాడే ఇండస్ట్రీలో కేవలం లక్కు మీదే అఆధారపడలేంగా.
This post was last modified on October 14, 2024 12:01 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…