పుష్ప విలన్ గా మనకు పరిచయమయ్యాక ఫహద్ ఫాసిల్ కు తెలుగు ప్రేక్షకులతో మంచి బాండింగ్ ఏర్పడింది. అతని మలయాళ డబ్బింగ్ సినిమాలు వెతికి మరీ చూడటం మొదలుపెట్టారు. ఆ మధ్య వచ్చిన ఆవేశం తెలుగు అనువాదం చేయకపోయినా ఒరిజినల్ వెర్షన్ ని హైదరాబాద్ లో హౌస్ ఫుల్స్ చేసి మరీ చూశారు. అందుకే ఏదైనా కొత్త మూవీలో తను ఉన్నాడంటే బిజినెస్ పరంగా క్రేజ్ వస్తోంది. నిన్న రిలీజైన రజనీకాంత్ వేట్టయన్ లో దొంగతనాలు చేసి పోలీస్ ఇన్ఫార్మర్ గా మారిపోయే బ్యాటరీ పాత్రను బాగా పోషించాడు. కామెడీతో పాటు చివర్లో చిన్న ఎమోషన్ తో ఆకట్టుకున్నాడు.
అయితే ఇదంతా ఫహద్ ఫాసిల్ అభిమానులకు నచ్చడం లేదు. కేరళలో ఇంత మంచి ఫాలోయింగ్ పెట్టుకుని ఇతర భాషల్లో సపోర్టింగ్ ఆర్టిస్టు, విలన్ గా నటించడం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మల్లువుడ్ లో పారితోషికాలు తక్కువ. మార్కెట్ విస్తరిస్తున్నా ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు భారీగా పెరగడం లేదు. కానీ టాలీవుడ్ లో అలా లేదు. పుష్ప కేసునే తీసుకుంటే ఒక్క ఫహద్ ఫాసిల్ కే ఏడు కోట్లకు పైగా ఇచ్చారనే టాక్ ఉంది. ఇంత మొత్తం అతను స్వరాష్ట్రంలో హీరోగా చేసినా ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఎవరైనా సహజంగానే ఇతర బాషల వైపు చూడటం సహజం.
తనకే కాదు ఇలాంటి పరిస్థితి గతంలో వేరే హీరోలకూ ఎదురయ్యింది. కన్నడలో మంచి స్టార్ డం ఉన్న టైగర్ ప్రభాకర్, దేవరాజ్ లాంటి వాళ్ళు చిరంజీవి, బాలకృష్ణకు విలన్లుగా నటించారు. తమిళంలో నెపోలియన్ ఫామ్ లో ఉన్నప్పుడు నాగార్జున హలో బ్రదర్ లో నటించాడు. విష్ణువర్ధన్, మోహన్ లాల్ లాంటి స్టార్లు క్రేజీ దర్శకులు అడిగినప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేశారు. ఇప్పుడు ఫాహద్ ఫాసిల్ చేస్తోంది కొత్తది కాదు కానీ అతనికంటూ ఉన్న ఫ్యాన్స్ అలా ఫీలవుతున్నారు. డిసెంబర్ 6 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ లో ఎక్కువ సేపు పెర్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉండేలా సుకుమార్ డిజైన్ చేశాడట.
This post was last modified on October 11, 2024 1:40 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…