Movie News

‘చావా’కు చెక్ పెట్టేందుకు పుష్ప ప్లాన్

స్పీడ్ బ్రేకర్స్ గా మారతాయనుకున్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోవడంతో పుష్ప 2 ది రూల్ ఘనంగా రంగప్రవేశం చేసేందుకు రెడీ అవుతోంది. ముందు అనుకున్న డిసెంబర్ 6 కాకుండా ఒక రోజు ముందు గురువారం 5నే రావాలని మైత్రి మూవీ మేకర్స్ నిర్ణయించుకున్నట్టు వస్తున్న సమాచారం ట్రేడ్ వర్గాలకు కిక్ ఇస్తోంది. ముఖ్యంగా నార్త్ బయ్యర్లకు ఇది పెద్ద శుభవార్త. ఎందుకంటే ఆరో తేదీనే విక్కీ కౌశల్ ‘చావా’ని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

ఇందులోనూ రష్మిక మందన్ననే హీరోయిన్. మహారాష్ట్ర, బీహార్, ఉత్తర్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో చావాకున్న నేపథ్యం వల్ల ఎక్కువ డిమాండ్ ఉంది. దీన్ని తట్టుకోవాలంటే పుష్ప 2 ఒక రోజు అడ్వాన్స్ గా థియేటర్లకు రావడం మంచి ఎత్తుగడ. టాక్ బయటికి వచ్చేస్తుంది. ప్రేక్షకుల తీర్పు అర్థమైపోతుంది. పాజిటివ్ ఉంటే మాత్రం చావా ఎలా ఉన్నా పుష్పకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఏ సమస్యా లేదు కానీ ఉత్తరాదిలో చావా పోటీ వల్ల చిక్కులుంటాయని నార్త్ డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడ్డారు.

ఇదంతా విశ్లేషించుకున్న పుష్ప 2 బృందం గురువారం విడుదలే సరైన నిర్ణయమనే నిర్ధారణకు వచ్చిందట. ప్రీమియర్లకు బదులు రోజంతా కలిపి అన్ని షోలు వేసుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గేమ్ చేంజర్ వాయిదా దాదాపు ఖరారు కావడంతో పుష్ప 2కి రూట్ మరింత క్లియర్ అయ్యింది. మూడు హాలీవుడ్ సినిమాలు, బాలీవుడ్ మూవీ బేబీ జాన్ లు క్రిస్మస్ సందర్భంగా వస్తున్నప్పటికీ పుష్పకు టెన్షన్ లేదు.

ఒకవేళ రామ్ చరణ్ ఉంటే థియేటర్లు తగ్గేవి కానీ ఇప్పుడా బెడద లేదు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న పుష్ప 2 నవంబర్ మూడో వారంకల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకోవాలి. ఇంకా ఐటెం సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్స్ లో మిగిలిన వర్క్ మొత్తం పూర్తవుతోంది. ట్రైలర్ లాంచ్ ని దీపావళి పండగ కన్నా ముందే ప్లాన్ చేసే సూచనలున్నాయి.

This post was last modified on October 10, 2024 6:55 pm

Share

Recent Posts

వ‌రంగల్‌కు ఎయిర్‌పోర్టు… ఆ పేర్లు పెట్ట‌మ‌న్న‌ సందీప్ వంగ

ఎయిర్‌పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాల‌నే నియ‌మాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, ప‌ట్ట‌ణాల‌కు కూడా విమానాశ్ర‌యాలు విస్త‌రిస్తున్నాయి. ఐతే మ‌రో తెలుగు…

16 minutes ago

‘రాకా’ అనిరుధ్ లేదా జి.వి.ప్రకాష్ అనుకుని…

‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…

18 minutes ago

ఈ క్లారిటీ ముందే ఉండాల్సింది డైరెక్టర్ గారు

టాలీవుడ్ యువ న‌టుడు సుహాస్ న‌టించిన త‌మిళ చిత్రం మండాడి బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన నేప‌థ్యంలో గురువారం చెన్నైలో నిర్వ‌హించిన…

45 minutes ago

ప‌వ‌న్ క‌ల్యాణ్… బ్యాక్ టు డ్యూటీ!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. ఏపీకి చేరుకున్నారు. గ‌త నెల…

45 minutes ago

మగాళ్లకు పీరియడ్స్ రావాలని వెయ్యిసార్లు ప్రార్థించిన నటి

మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…

2 hours ago

సంపూ కెరీర్ కొత్త మలుపు తిరుగుతుందా

హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో స్పూఫ్ హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత అదే…

4 hours ago