జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న క్రేజీ మల్టీ స్టారర్ వార్ 2 షూటింగ్ ప్రస్తుతం తారక్ లేకుండా జరుగుతోంది. దేవర ప్రమోషన్స్ కోసం నెల రోజులకు పైనే బ్రేక్ తీసుకోవడంతో ప్రస్తుతం తను లేని టాకీ పార్ట్, పాటలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఇటలీలో జరిగిన కీలక షెడ్యూల్ లో హృతిక్, కియారా అద్వానీల మీద సన్నివేశాలతో పాటు ఒక పాట కూడా షూట్ చేశారు. దసరా కాగానే తారక్ వార్ 2 సెట్లలో అడుగు పెట్టబోతున్నాడు. కీలకమైన క్లైమాక్స్ ఘట్టంతో పాటు ఇద్దరు హీరోలు పాల్గొనే యాక్షన్ బ్లాక్స్, నాటు నాటు తరహాలో ఒక పాటను చిత్రీకరిస్తారట.
ఇదిలా ఉండగా వార్ 2 స్టార్ అట్రాక్షన్ ఇక్కడితో ఆగిపోవడం లేదు. మరిన్ని ఆకర్షణలు జోడించే పనిలో యష్ రాజ్ ఫిలింస్ ఉంది. అందులో భాగంగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ సినిమా చివర్లో స్పెషల్ ఎంట్రీ ఇస్తారని ముంబై టాక్. హృతిక్, తారక్ లతో పాటు సల్లు భాయ్ పాల్గొనే ఈ ఎపిసోడ్ కి థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని అంటున్నారు. కబీర్, టైగర్, తారక్ (పాత్ర పేరు ఇంకా లీక్ కాలేదు) ముగ్గురు కలిసి ఏం చేస్తారనేది సస్పెన్స్. ఇదొక్కటే కాదు మార్టిన్ ఫేమ్ శాండల్ వుడ్ హీరో ధృవ సర్జ కూడా వార్ 2 లో భాగం కావొచ్చట. ఇటీవలే చూచాయగా ఇతను హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
వచ్చే ఏడాది ఆగస్ట్ 14 విడుదల ప్లాన్ చేసుకున్న వార్ 2 లో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. దేవర పార్ట్ 1 నార్త్ ఇండియాలోనూ మంచి విజయం సాధించడం మార్కెట్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ కి ప్లస్ కానుంది. ఫిబ్రవరి లోగా షూట్ పూర్తి చేసి ఆపై పూర్తి సమయాన్ని విఎఫెక్స్ కోసం కేటాయించబోతున్నారు. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద చూడని గ్రాఫిక్స్ ఇందులో దర్శనమిస్తాయని అంటున్నారు. బ్రహ్మాస్త్రలో తన మార్క్ చూపించిన అయాన్ ముఖర్జీ ఈసారి అంచనాలను అందని రీతిలో మెస్మరైజ్ చేస్తాడని యూనిట్ టాక్. దీపావళికి ఫస్ట్ లుక్ వదిలే ఆలోచనలో యష్ బృందం ఉంది.
This post was last modified on October 9, 2024 6:33 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…