ఇంకో రెండు నెలల కంటే తక్కువ వ్యవధిలో విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ కి శకునాలన్నీ కలిసి వస్తున్నాయి. డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ కావాల్సిన గేమ్ ఛేంజర్ సంక్రాంతికి వాయిదా పడిందనే ప్రచారం బన్నీ ఫ్యాన్స్ కి కొత్త జోష్ ఇచ్చింది. ఎందుకంటే కేవలం రెండు వారాల గ్యాప్ లో రామ్ చరణ్ మూవీ అందులోనూ దిల్ రాజు నిర్మాతగా అంటే ఖచ్చితంగా థియేటర్ల సమస్య వస్తుంది. ఇప్పుడీ టాక్ నిజమైన నేపథ్యంలో ఇంతకన్నా గుడ్ న్యూస్ పుష్ప టీమ్ కు ఉండదు. సో గ్రౌండ్ ఫ్రీ అయిపోతుంది. జనవరి రెండో వారం దాకా చెప్పుకోదగ్గ పోటీ ఉండదు కాబట్టి వసూళ్లు దున్నేయొచ్చు.
ఇక మరో శకునం దేవరకొచ్చిన స్పందన. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలకు ధారాళంగా అనుమతులు ఇచ్చేశాయి. ఇకపై ప్రతి ప్యాన్ ఇండియా మూవీకి ఈ సౌలభ్యం దక్కుతుంది. అలాంటప్పుడు దేవర కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న పుష్ప 2కి ఓపెనింగ్స్ మాములుగా ఉండవు. భీభత్సం జరుగుతుంది. పైగా ఎలాగూ ఆ డేట్ కి పుష్ప ఉందనే ఉద్దేశంతో ఇతర నిర్మాతలు ఎవరూ తమ సినిమాలను డిసెంబర్ మొదటి వారంలో ప్లాన్ చేసుకోలేదు. సో దేవర ఇప్పుడు ఏదైతే అడ్వాంటేజ్ తీసుకున్నాడో దానికి రెట్టింపుని పుష్పరాజ్ వాడుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
చేతిలో తక్కువ టైం ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను దర్శకుడు సుకుమార్ వేగవంతం చేశారు. ఎప్పుడూ లేనిది ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ లాక్ అయిపోయిందని మైత్రి లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ప్రకటించడం చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో డేట్ మిస్ కామనే సంకేతం ఇవ్వడం కోసమేనని అర్థం చేసుకోవచ్చు. సెకండాఫ్ లో వచ్చే ఐటెం సాంగ్ ని ఈ నెలాఖరు లేదా నవంబర్ మొదటి వారంలో షూట్ చేయబోతున్నారు. సమంతా స్థానంలో ఎవరు నర్తిస్తారనేది ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం మూడు యూనిట్లతో పని జరుగుతోంది. ఫహద్ ఫాసిల్ కు సంబంధించిన ఎపిసోడ్లను ఈ షెడ్యూల్ లోనే పూర్తి చేయబోతున్నారు.
This post was last modified on October 9, 2024 6:28 pm
కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…
సినిమాల సెన్సార్షిప్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…
వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…
వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…
కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి…
బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…