ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కానీ స్పిరిట్ మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కబీర్ సింగ్ రూపంలో అదిరిపోయే డెబ్యూ అందుకుని యానిమల్ బ్లాక్ బస్టర్ తో బాలీవుడ్ టాప్ లిస్టులోకి చేరిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఏకంగా ప్యాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ తో చేతులు కలపడంతో హైప్ ఏ స్థాయిలో పెరగబోతోందో వర్ణించడం కష్టం.
ప్రస్తుతం స్క్రిప్ట్ ని లాక్ చేసే పనిలో ఉన్న సందీప్ వంగా స్పిరిట్ సెట్స్ పైకి ఎప్పుడు తీసుకెళ్లాలనేది ఇంకా నిర్ణయించుకోలేదట. ముందు ది రాజా సాబ్, ఫౌజీలు పూర్తి చేశాకే తనకు పూర్తి కాల్ షీట్లు ఇవ్వాలని డార్లింగ్ ని అడిగినట్టు తెలిసింది.
దీనికి ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు చెబుతున్నారు. అయితే ఇక్కడితో స్పిరిట్ సంగతులు అయిపోలేదు. ఇందులో చాలా ముఖ్యమైన పాత్రల కోసం మోస్ట్ వాంటెడ్ క్యాస్టింగ్ ని సెట్ చేస్తున్నట్టు తెలిసింది. ఆల్రెడీ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ కోసం కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ తో సంప్రదింపులు జరిగిన వార్త ఉంది కానీ ఇంకా నిర్ధారణ కాలేదు.
ఇంకోవైపు ఒక పవర్ ఫుల్ రోల్ కోసం ఏకంగా చిరంజీవినే అడిగినట్టు లేటెస్ట్ గాసిప్. నిడివి తక్కువ, ఎక్కువ ఉన్న క్యామియోలు చేయడం మెగాస్టార్ కు కొత్త కాదు. కన్నడ సిపాయి, హాండ్స్ అప్, స్టైల్, బ్రూస్ లీ ఇలా చాలానే ఉన్నాయి.
ఒకవేళ నిజమైతే మాత్రం ఇదో మెంటల్ మాస్ కాంబినేషన్ అవుతుంది. ఎందుకంటే సందీప్ వంగా కరుడు గట్టిన మెగా ఫాన్. ఇది పలు సందర్భాల్లో తనే చెప్పుకున్నాడు. మాస్టర్ సినిమాలో తనకు ఇష్టమైన సీన్ లో చిరంజీవి వేసుకున్న షర్ట్ రంగు కూడా గుర్తు పెట్టుకునేంత అభిమానం అది.
అలాంటిది తన ఐకాన్ ని ఎలా చూపిస్తాడో వేరే చెప్పాలా. ఇదంతా ప్రస్తుతానికి గాసిప్పే. సందీప్ వంగా వీలైనంత లీక్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నాడు కానీ కొన్నయితే ఇలా ఏదో ఒక రూపంలో బయటికి వస్తున్నాయి. ఇంకా హీరోయిన్ ఎవరో ఖరారు కాని స్పిరిట్ కోసం మూడు వందల కోట్లకు పైగానే బడ్జెట్ పెడతారట.
This post was last modified on October 9, 2024 11:28 am
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…
మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…
వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…
వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ,…
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…