మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ‘గేమ్ చేంజర్’ మూవీ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. రకరకాల కారణాల వల్ల ఈ చిత్రం చాలా ఆలస్యం అయింది. ఐతే ఎట్టకేలకు ఈ ఏడాది క్రిస్మస్‌కు సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఐతే రిలీజ్ దగ్గర పడుతున్నా ఇప్పటిదాకా టీజర్ రాలేదు. సినిమా నుంచి రెండు పాటలు మాత్రమే రిలీజ్ చేశారు. వాటికి కూడా చాలా టైం తీసుకున్నారు. దసరా కానుకగా టీజర్ రిలీజవుతుందని కొన్ని రోజుల కిందట ప్రచారం జరిగింది. కానీ తీరా చూస్తే అదేమీ లేదని తేలిపోయింది. స్వయంగా సంగీత దర్శకుడు తమన్ దసరాకు ‘గేమ్ చేంజర్’ టీజర్ రిలీజ్ కావట్లేదన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. దీంతో చరణ్ అభిమానులు మరోసారి తీవ్రంగా నిరాశ పడ్డారు. ఐతే టీజర్ లేదంటూనే సినిమా గురించి అప్‌డేట్స్ ఇచ్చి ఉపశమనాన్నిచ్చే ప్రయత్నం చేశాడు తమన్.
‘‘దసరాకు టీజర్ రావట్లేదని నిరాశ పడొద్దు ఫ్రెండ్స్. టీం నిరంతరం సినిమాకు సంబంధించిన పనుల్లోనే ఉంది. సీజీ, వీఎఫ్ఎక్స్, ఫైనల్ ఎడిటింగ్, డబ్బింగ్, బ్యాగ్రౌండ్ స్కోర్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రతి నెలా ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ చేయడం కోసం అన్ని పాటలకూ సంబంధిత పనులు పూర్తి చేశాం. అక్టోబరు 30న తర్వాతి పాట రానుంది. సినిమా కచ్చితంగా డిసెంబరు 20న మీ ముందుకు వస్తుంది’’ అని తమన్ పోస్ట్ పెట్టాడు. ఇటీవల రిలీజ్ చేసిన ‘రా మచ్చా మచ్చా’ పాటకు మంచి స్పందనే వచ్చినప్పటికీ.. సంబంధిత పోస్టర్లో రిలీజ్ డేట్ లేకపోవడంతో మళ్లీ ఈ సినిమా విడుదల మీద సందేహాలు నెలకొన్నాయి. కానీ ఈ చిత్రం కచ్చితంగా డిసెంబరు 20న వస్తుందని తమన్ క్లారిటీ ఇచ్చాడు. అంతే కాక తర్వాతి పాట గురించి కూడా అప్‌డేట్ ఇచ్చాడు. టీజర్ దసరాకు కాకపోయినా ఈ నెలలోనే రిలీజ్ కావచ్చని భావిస్తున్నారు.
This post was last modified on October 9, 2024 8:05 am
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…