టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు స్టార్ హీరోయిన్ సమంత అంటే ప్రత్యేక అభిమానం అన్న సంగతి తెలిసిందే. తన దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ చిత్రాల్లో ఆమెకు స్పెషల్ రోల్స్ ఇచ్చాడు.
ముఖ్యంగా అఆ సినిమా చూస్తే సమంత మీద ఆయన అభిమానం ఎలాంటిదో అర్థమవుతుంది. ఆ సినిమా తర్వాత మళ్లీ ఆమెతో జట్టు కట్టలేదు మాటల మాంత్రికుడు. ఐతే సామ్‌పై తన అభిమానం మాత్రం తగ్గలేదని ఆలియా భట్ మూవీ జిగ్రా ప్రి రిలీజ్ ఈవెంట్లో చాటి చెప్పాడు త్రివిక్రమ్.
ఈ వేడుక ఆలియా సినిమా గురించి అయినా సామ్ చుట్టూనే అందరి స్పీచ్‌లూ తిరిగాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ అయితే సామ్‌కు ఒక రేంజ్ ఎలివేషన్ ఇచ్చాడు. సామ్ స్టార్‌డమ్‌ను రజినీతో త్రివిక్రమ్ పోల్చడం విశేషం.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ.. ఇలా పలు భాషల్లో ఒక రకమైన ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్లలో ఒకరు సూపర్ స్టార్ రజినీకాంత్ అయితే.. మరొకరు సమంత అని త్రివిక్రమ్ చెప్పడంతో సమంత గొల్లుమని నవ్వింది.
సమంతకు ఇండస్ట్రీలో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నట్లు చెప్పిన త్రివిక్రమ్.. ఏమాయ చేసావె సినిమా చూసి ఫిదా అయిపోయిన అల్లు అర్జున్ తనకు ఫోన్ చేసి సమంతకు తాను ఫ్యాన్ అయిన విషయం చెప్పినట్లు త్రివిక్రమ్ గుర్తు చేసుకున్నాడు.
ఇక సమంత ఈ మధ్య తెలుగు సినిమాలు చేయకపోవడంపై త్రివిక్రమ్ సరదా వ్యాఖ్యలు చేశాడు. ఈ మధ్య సామ్ ఎక్కువగా ముంబయిలోనే ఉంటోందని.. ఆమెకు హైదరాబాద్‌ను గుర్తు చేయాలని త్రివిక్రమ్ అన్నాడు.
అత్తారింటికి దారేది తరహాలోనే హైదరాబాద్‌కు దారేది అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రెండ్ చేయాలని త్రివిక్రమ్ కోరాడు. ఐతే త్రివిక్రమ్ ఈ మాట అంటుండగా.. సమంత తన కోసం క్యారెక్టర్లు రాస్తే సినిమాలు చేస్తానంటూ సైగ చేసింది. తప్పకుండా రాస్తాం అంటూ త్రివిక్రమ్ నవ్వేశాడు.
This post was last modified on October 9, 2024 1:01 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…