ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ చూసి, కాలానుగుణంగా మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తమను తాము మౌల్డ్ చేసుకోలేక త్వరగా రిటైర్ అవుతున్న దర్శకుల జాబితా పెద్దదే ఉంది. భీమినేని శ్రీనివాస నుంచి వివి వినాయక్ దాకా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దది. కృష్ణవంశీ అడపాదడపా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ మధ్య తీసిన రంగమార్తాండ ఓవర్ డ్రామా సెంటిమెంట్ తో ఫలితాలు అందుకోలేకపోయింది. చూడాలని ఉంది, ఒక్కడు లాంటి మర్చిపోలేని ఆల్ టైం క్లాసిక్స్ ఇచ్చిన గుణశేఖర్ త్వరలో యుఫోరియాతో రాబోతున్నారు. నిన్న టీజర్ లాంచ్ చేసి కాన్సెప్ట్ పరిచయం చేశారు.
టేకింగ్ చూస్తుంటేనే గుణశేఖర్ ఎంతగా ట్రెండ్ ని ఔపసోన పట్టారో అర్థం చేసుకోవచ్చు. కాలేజీ యువత, డ్రగ్స్ వాడకం, లైంగిక వేధింపులు, రేపులు ఇలా నిత్యం సమాజంలో జరుగుతున్న సంఘటనలనే హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్నారు. విజువల్స్ ఫ్రెష్ గా ఉన్నాయి. ప్రెస్ మీట్ లో గుణశేఖర్ చెప్పినట్టు ఇప్పుడు తెలుగు పేర్లు పెడితే అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామని, ముందు ఉద్వేగం టైటిల్ అనుకుని స్వంత వాళ్లే వద్దని చెబితే యూఫోరియాగా మార్చనని అన్నారు. సో ఇప్పటి ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో దాన్నే ఇచ్చే ప్రయత్నం చేసినట్టు స్పష్టం అర్థం అవుతోంది.
శాకుంతలం నేర్పించిన పాఠం గుణశేఖర్ త్వరగా వంటబట్టించుకున్నారు. కేవలం గ్రాండియర్లతో పనవ్వదని, బలమైన కంటెంట్ ఉంటే బడ్జెట్ తక్కువైనా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ మధ్య చాలా చిన్న సినిమాలు రుజువు చేయడంతో ఆయన రూటు మార్చుకున్నారు. ఒకవేళ ఇది కనక పాజిటివ్ రిజల్ట్ ఇస్తే ఇదే పంధా కొనసాగించవచ్చు. భూమిక హీరోయిన్ గా ఉన్న టైంలో ఆమె కెరీర్ లోనే అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచిన ఒక్కడు తర్వాత ఇన్నేళ్లకు ఆమెకు మరో కీలక పాత్ర ఇచ్చారు గుణశేఖర్. విడుదల తేదీ ఇంకా ఖరారు చేయని యుఫోరియాని ఈ ఏడాదే రిలీజ్ చేయాలని గుణశేఖర్ ఆలోచన.
This post was last modified on October 8, 2024 6:40 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…