Movie News

గేమ్ ఛేంజర్ మర్చిపోతున్న ముప్పు

నిర్మాత దిల్ రాజు సందర్భం వచ్చిన ప్రతిసారి గేమ్ ఛేంజర్ విడుదల క్రిస్మస్ అని చెబుతున్నారు తప్పించి ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫీషియల్ గా ఆ డేట్ ని ప్రకటించడం లేదు. రెండు లిరికల్ సాంగ్స్ వచ్చాయి. రా మచ్చ పాట రీచ్ మాములుగా లేదు.

దసరాకు టీజర్ వస్తుందని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకుంటే ఇప్పుడు మిస్ అయినా దీపావళికి బ్లాస్ట్ ఉంటుందని తమన్ ట్వీట్ చేయడం వాళ్ళను నిరాశ పరుస్తోంది. అక్టోబర్ 30 మూడో పాట ఖచ్చితంగా వస్తుందని అది మాత్రం మంచి మెలోడీ అనే హామీ ఇచ్చాడు. సో ఇదంతా ఫ్యాన్స్ ని ముందుస్తుగా ప్రిపేర్ చేయడం అన్న మాట.

డిసెంబర్ 20 లేదా 25 రిలీజ్ డేట్ ఏదైనా కావొచ్చు. గేమ్ ఛేంజర్ మర్చిపోతున్న ముప్పు మరొకటుంది. దీనికన్నా సరిగ్గా రెండు వారాల ముందు రాబోతున్న పుష్ప 2 ది రూల్ ప్రమోషన్లు ఇంకా మొదలుకాలేదు. మూడు యూనిట్ల షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల టీమ్ పబ్లిసిటీ మీద దృష్టి పెట్టలేదు.

ఒక్కసారి అవి మొదలైతే జాతీయ స్థాయిలో అటెన్షన్ బన్నీ సినిమా వైపు వెళ్ళిపోతుంది. ఆలోగా గేమ్ చేంజర్ మీడియా, ఆడియన్స్ అందరూ తనవైపు చూసేలా మేజిక్ చేయాలి. అది పాటతోనా లేక టీజర్ తోనా అనేది వచ్చాక తేలుతుంది కానీ ముందైతే గ్యాప్ లేకుండా చూసుకోవడం అవసరం.

దసరాకు విశ్వంభర టీజర్ లాక్ కావడం వల్లే గేమ్ ఛేంజర్ ది వాయిదా వేశారనే మరో వార్త ప్రచారంలోకి వచ్చింది కానీ జనవరిలో రిలీజయ్యే సినిమా కన్నా డిసెంబర్ లో విడుదలయ్యే మూవీ ముఖ్యం కదాని మెగా ఫ్యాన్సే ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా గేమ్ ఛేంజర్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ సరైన దిశలో లేదన్నది అధిక శాతం వినిపిస్తున్న కామెంట్. పుష్ప 2 రంగంలోకి దిగితే సీన్ మారిపోతుంది. అసలే ఆన్ లైన్ లో మెగా వర్సెస్ అల్లు రేంజ్ లో ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు. ట్రోలింగ్స్ కి సైతం అంతే అవకాశం ఉంటుంది. సో ఈ రెండు నెలలు రెండు సినిమాలకు చాలా కీలకం కాబోతున్నాయి.

This post was last modified on October 8, 2024 6:21 pm

Share

Recent Posts

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

5 minutes ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

9 minutes ago

హైదరాబాద్ లో బాలికను రేప్ చేసిన 8 మంది

మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…

27 minutes ago

జైలర్ 2 మీద పందెం కాసేదెవరు

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…

1 hour ago

నిర్మాత రిస్క్ చేశాడు… జాక్‌పాట్ కొడుతున్నాడు

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంత‌కుముందులా ఉదారంగా కొత్త సినిమాల‌ను కొన‌ట్లేద‌న్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌లు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫ‌ర్…

1 hour ago

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

5 hours ago