మీడియం బడ్జెట్ సినిమాకు ముందస్తు ప్రీమియర్లు వేయడం చాలా రిస్క్. ఏ మాత్రం టాక్ అటు ఇటు అయినా దాని ప్రభావం నేరుగా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ రోజు మార్నింగ్ షో మీద పడిపోతుంది. అందుకే నిర్మాతలు అలోచించి నిర్ణయం తీసుకుంటారు. సక్సెస్ అయినవి లేకపోలేదు. బేబీ, బలగం, మేజర్ లాంటివి స్పెషల్ పెయిడ్ షోల వల్లే గొప్ప ప్రమోషన్ అందుకున్నాయి. ఇప్పుడీ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ‘మా నాన్న సూపర్ హీరో’ రెడీ అవుతున్నాడు. సుధీర్ బాబు హీరోగా అభిలాష్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ డ్రామా అక్టోబర్ 11 విడుదల కాగా రేపు సాయంత్రమే ప్రీమియర్లు వేస్తున్నారు.
కంటెంట్ మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఇంత సాహసం చేయరు. దీని వెనుక మంచి స్ట్రాటజీ ఉంది. దసరా పండగ కాబట్టి పోటీ విపరీతంగా ఉంది. గురువారమే రజనీకాంత్ వేట్టయన్ వస్తుంది. బజ్ విపరీతంగా లేదు కానీ రజనీకాంత్ ని తక్కువంచనా వేయడానికి లేదు. మా నాన్న సూపర్ హీరోతో పాటు గోపీచంద్ విశ్వం బరిలో దిగుతోంది. ఇది పూర్తిగా మాస్, ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసుకుంది. శాండల్ వుడ్ మూవీ మార్టిన్ మీద బజ్ లేదు కానీ గ్రాండియర్ వల్ల ఎంతో కొంత మాస్ ని లాగే ప్రయత్నం చేయకపోదు. దిల్ రాజు అండదండలతో జనక అయితే గనక సైతం మంచి రిలీజ్ అందుకునే దిశగా ప్లాన్ చేస్తోంది.
ఇవి కాకుండా అలియా భట్ డబ్బింగ్ మూవీ జిగ్రాని తీసిపారేయలేం. వేటి లెక్కలు వాటికి ధీమాగా ఉన్నాయి కానీ మా నాన్న సూపర్ హీరో మాత్రం కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా పెట్టుకుని మార్కెటింగ్ చేసుకుంటోంది. పలువురు స్టార్ హీరోలు, దర్శకులు పని చేస్తున్న షూటింగ్ స్పాట్స్ కు వెళ్లి అక్కడే నేరుగా ప్రమోట్ చేసుకునే వెరైటీ ప్లాన్లు వేసిన సుధీర్ బాబు బృందం మొత్తానికి తక్కువ టైంలోనే జనాల దృష్టిలో పడేలా చేసుకుంది. ప్రస్తుతానికి ప్రీమియర్లకు సంబంధించి వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ పెట్టేశారు. మిగిలిన చోట్ల కూడా విస్తరిస్తారేమో చూడాలి.
This post was last modified on October 8, 2024 6:15 pm
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…
నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…
సరైనోడు ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశముందంటూ నిన్న…
ఒకప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియన్ ఫిలిం మేకర్స్ ఆలోచించడం కూడా కష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత…
మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…
కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని అనుకునేవారు.. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…