మొత్తానికి ఒడుదొడుకులను దాటి ‘దేవర’ సినిమా సక్సెస్ అనిపించుకున్నట్లే కనిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ చూసినపుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం అంచనాలను తగ్గించేసుకున్నారు. పైగా రిలీజ్ రోజు టాక్ ఏమంత గొప్పగా లేదు.
సినిమా చూసిన వాళ్లు బాలేదు అనలేదు కానీ.. అదిరింది అనే స్టేట్మెంట్స్ కూడా ఇవ్వలేదు. ఓవరాల్‌గా యావరేజ్ టాకే వచ్చింది. అయినా సరే రిలీజ్ టైమింగ్, ఇంకా వేరే అంశాలు కలిసి వచ్చి ఈ సినిమా ఉన్నంతలో బాగానే ఆడేసింది.
వీకెండ్ తర్వాత కొంచెం డల్లయినా.. దసరా సెలవులు కలిసి రావడంతో సినిమా ఓ మోస్తరు వసూళ్లతో సాగిపోతోంది. కొన్ని చోట్ల సినిమా లాభాల బాట పట్టింది. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా ఉంది.
మొత్తంగా సినిమాకు పాజిటివ్ రిజల్ట్ రావడంతో ‘దేవర-2’ ఉంటుందా లేదా అనే విషయంలో సందేహాలు తొలగిపోయినట్లే. కచ్చితంగా పార్ట్-2 ఉంటుందని ఒక అంచనాకు వచ్చేయొచ్చు. మరి ఆ చిత్రం ఎప్పుడు ఉంటుందన్నదే ఇప్పుడు ప్రశ్న.
‘దేవర’ రిలీజ్ ముందు వరకు ‘దేవర-2’ ఎప్పుడు చేయాలనే విషయంలో టీంకు కూడా స్పష్టత లేదు. రిజల్ట్‌ను బట్టి, ఎన్టీఆర్ కమిట్మెంట్లను బట్టి నిర్ణయం తీసుకోవాలనుకున్నారు.
ఇప్పుడు సినిమా ఫలితం తేలిపోయిన నేపథ్యంలో ‘దేవర-2’ను ఎప్పుడు మొదలుపెట్టాలనే విషయంలో ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. వచ్చే ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లొచ్చట. ఆ తర్వాత ఇంకో ఏడాదికి.. బహుశా దసరా లేదా క్రిస్మస్ టైంకి సినిమాను విడుదలకు సిద్ధం చేయాలని అనుకుంటున్నారట. రెండో భాగానికి టెక్నికల్ టీంలో కొన్ని మార్పులు ఉండొచ్చని సమాచారం.
అప్పటి వీలును బట్టి టెక్నీషియన్లను ఎంచుకుంటారట. ప్రస్తుతం తారక్ చేతిలో వార్-2తో పాటు ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. ఇవి రెండూ పూర్తి కావడానికి కనీసం ఏడాది సమయం పట్టొచ్చు. అవి పూర్తయ్యే సమయానికి కొరటాల వీలైతే వేరే సినిమా చేసి ఆ తర్వాత దేవర-2ను మొదలుపెట్టొచ్చు. లేదా అప్పటి వరకు వెయిట్ చేయొచ్చు.
This post was last modified on October 8, 2024 10:30 am
మాస్ కా బాప్, టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షో…
ప్రపంచ జనాభా 2024 చివరికి ఊహించని మార్క్ ను చేరనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 800 కోట్లను దాటబోతుందని యుఎస్ సెన్సస్…
"ఈ ఒక్క ఎన్నికల్లో చంద్రబాబును అడ్డుకుంటే చాలు. ఇక, 30 ఏళ్లపాటు మనకు తిరుగు ఉండదు" - అని వైసీపీ…
దక్షిణకొరియాలో మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర ప్రమాదం ప్రపంచాన్ని కలిచివేసింది. ఆదివారం ఉదయం ‘జెజు ఎయిర్’కు చెందిన ప్యాసింజర్…
వైసీపీ అధినేత జగన్‌కు 2024 భారీ షాకేనని చెప్పాలి. పార్టీ ఓటమి, కీలక నాయకుల జంపింగులతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.…
దేశంలో 31 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరిలో కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ సహా.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు…